AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోరూరించే కొబ్బరి పాల అన్నం.. ఇలా చేస్తే 10 నిమిషాల్లోనే అయిపోతుంది

కొబ్బరి పాలు, సుగంధ ద్రవ్యాలు, బియ్యం కలయికతో తయారయ్యే కొబ్బరి పాల అన్నం ఒక అద్భుతమైన వంటకం. ఇది రుచిగా ఉండటమే కాకుండా, ఇంకా తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు. ఈ సులభమైన రెసిపీని మీరు, మీ ఇంట్లో కూడా కమ్మని, పొడిపొడిలాడే కొబ్బరి పాల అన్నాన్ని ఈజీగా చేసుకోవచ్చు. కేవలం పది నిమిషాల్లోనే ఈ వంటకం తయారవుతుంది.

Prasanna Yadla
|

Updated on: Oct 22, 2026 | 9:45 PM

Share
కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం: 1 గ్లాసు,  కొబ్బరి తురుము: అర కొబ్బరికాయ నుండి,  నీరు: కొబ్బరి పాలు తీయడానికి 1 గ్లాసు, అన్నం ఉడికించడానికి అదనంగా అర గ్లాసు,  నూనె: 1 టేబుల్ స్పూన్,   నెయ్యి: అర టేబుల్ స్పూన్ ,   బిర్యానీ ఆకు: 1, 
దాల్చిన చెక్క: 2 చిన్న ముక్కలు,  లవంగాలు: 4,  యాలకులు: 3,   అనాస పువ్వు: 1,  జాపత్రి: కొద్దిగా,  షాజీరా: 1 టీ స్పూన్, 
పచ్చిమిర్చి: 4-5 (రుచికి సరిపడా), ఉల్లిపాయ: 1 చిన్నది, సన్నగా తరిగినది,   అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీ స్పూన్,  పుదీనా తరుగు: కొద్దిగా
కొత్తిమీర తరుగు: కొద్దిగా,  ఉప్పు: రుచికి సరిపడా,  గరం మసాలా పౌడర్/బిర్యానీ మసాలా పౌడర్: 1 టీ స్పూన్

కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం: 1 గ్లాసు, కొబ్బరి తురుము: అర కొబ్బరికాయ నుండి, నీరు: కొబ్బరి పాలు తీయడానికి 1 గ్లాసు, అన్నం ఉడికించడానికి అదనంగా అర గ్లాసు, నూనె: 1 టేబుల్ స్పూన్, నెయ్యి: అర టేబుల్ స్పూన్ , బిర్యానీ ఆకు: 1, దాల్చిన చెక్క: 2 చిన్న ముక్కలు, లవంగాలు: 4, యాలకులు: 3, అనాస పువ్వు: 1, జాపత్రి: కొద్దిగా, షాజీరా: 1 టీ స్పూన్, పచ్చిమిర్చి: 4-5 (రుచికి సరిపడా), ఉల్లిపాయ: 1 చిన్నది, సన్నగా తరిగినది, అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీ స్పూన్, పుదీనా తరుగు: కొద్దిగా కొత్తిమీర తరుగు: కొద్దిగా, ఉప్పు: రుచికి సరిపడా, గరం మసాలా పౌడర్/బిర్యానీ మసాలా పౌడర్: 1 టీ స్పూన్

1 / 5
ముందుగా, ఒక గ్లాసు బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తిరిగి నీరు పోసి కనీసం అరగంట పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల అన్నం పొడిపొడిలాడుతూ వస్తుంది.అర కొబ్బరికాయ చిప్పను సులభంగా తీయడానికి ఒక రోజు ముందు ఫ్రిజ్‌లో ఉంచండి. కొబ్బరిని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది.

2 / 5
సన్నగా కట్ చేసిన కొబ్బరిని బ్లెండర్‌లో వేసి, మొదట అర గ్లాసు నీరు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని జ్యూస్ వడకట్టుకునే దానిలోకి వేసి స్పూన్‌తో నొక్కుతూ పాలను సేకరించండి.మిగిలిన పిప్పిని తిరిగి బ్లెండర్‌లో వేసి, మిగిలిన అర గ్లాసు నీటిని కూడా వేసి మరొకసారి గ్రైండ్ చేసి, పాలను వడకట్టండి. ఇలా రెండుసార్లు వడకట్టడం వల్ల కొబ్బరి పాలు పూర్తిగా బయటకు వస్తాయి. మొత్తం ఒక గ్లాసు కొబ్బరి పాలు సిద్ధమవుతాయి.

3 / 5
ఒక గ్లాసు బాస్మతి బియ్యానికి ప్రెషర్ కుక్కర్‌లో ఒకటిన్నర గ్లాసుల నీరు సరిపోతుంది. కాబట్టి, వచ్చిన ఒక గ్లాసు కొబ్బరి పాలకు అదనంగా అర గ్లాసు నీటిని కలిపి పెట్టుకోవాలి. ఒకవేళ మీరు బాస్మతి బియ్యానికి బదులుగా రెగ్యులర్ బియ్యం ఉపయోగిస్తే, ఒక గ్లాసు బియ్యానికి ప్రెషర్ కుక్కర్‌లో రెండు గ్లాసుల నీరు అవసరం అవుతుంది. కడాయిలో వండితే బాస్మతికి రెండు గ్లాసులు, రెగ్యులర్ రైస్‌కి రెండున్నర గ్లాసులు అవసరం. స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి, అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె, అర టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి ఇష్టం లేని వారు పూర్తిగా నూనెను వాడవచ్చు. నూనె వేడి అయిన తర్వాత, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, జాపత్రి, షాజీరా వేసి, ఒక నిమిషం పాటు తక్కువ మంటపై వేయించాలి.

4 / 5
ఆ తర్వాత, కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసి ఒక నిమిషం వేయించాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయేంత వరకు రెండు నిమిషాల పాటు వేయించాలి.
ఇప్పుడు నానబెట్టి, నీటిని తీసేసిన బియ్యాన్ని వేసి, అన్నీ కలిసేలా ఒక నిమిషం పాటు తక్కువ మంటపై కలపండి. ఇలా చేయడం వల్ల అన్నం పొడిపొడిలాడుతూ వస్తుంది. కొబ్బరి పాలు,  అదనపు నీటి మిశ్రమాన్ని కుక్కర్‌లో పోసి, ఒకసారి కలిపి, తక్కువ మంటపై రెండు నిమిషాలు ఉడికించాలి. సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర వేయండి. రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ లేదా బిర్యానీ మసాలా పౌడర్ వేసి బాగా కలపండి. కుక్కర్ మూత పెట్టి, మీడియం మంటపై ఒక విజిల్‌ వచ్చేంత వరకు ఉడికించాలి.  స్టవ్ ఆఫ్ చేసి, ప్రెషర్ పూర్తిగా తగ్గే వరకు అలాగే ఉంచండి. తర్వాత మూత తీసి, మెల్లగా కలిపి, పొడిపొడిలాడే కొబ్బరి పాల అన్నాన్ని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని వడ్డించండి.

ఆ తర్వాత, కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసి ఒక నిమిషం వేయించాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయేంత వరకు రెండు నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు నానబెట్టి, నీటిని తీసేసిన బియ్యాన్ని వేసి, అన్నీ కలిసేలా ఒక నిమిషం పాటు తక్కువ మంటపై కలపండి. ఇలా చేయడం వల్ల అన్నం పొడిపొడిలాడుతూ వస్తుంది. కొబ్బరి పాలు, అదనపు నీటి మిశ్రమాన్ని కుక్కర్‌లో పోసి, ఒకసారి కలిపి, తక్కువ మంటపై రెండు నిమిషాలు ఉడికించాలి. సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర వేయండి. రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ లేదా బిర్యానీ మసాలా పౌడర్ వేసి బాగా కలపండి. కుక్కర్ మూత పెట్టి, మీడియం మంటపై ఒక విజిల్‌ వచ్చేంత వరకు ఉడికించాలి. స్టవ్ ఆఫ్ చేసి, ప్రెషర్ పూర్తిగా తగ్గే వరకు అలాగే ఉంచండి. తర్వాత మూత తీసి, మెల్లగా కలిపి, పొడిపొడిలాడే కొబ్బరి పాల అన్నాన్ని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని వడ్డించండి.

5 / 5
Follow Us