AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాక్సిడెంట్ బాధితులకు సంజీవని.. ఆసుపత్రికి వెళ్లగానే రూ.1.5 లక్షల ఫ్రీ ట్రీట్‌మెంట్.. ఎలా పొందాలంటే?

రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి సరైన సమయంలో ఆర్థిక సహాయం అందక ఎందరో ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఇలాంటి వారికి అండగా నిల్చేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం రాహత్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికీ ఈ పథకం గుంరిచి చాలా మందికి తెలియదు.ఈ పథకం కింద ప్రభుత్వం ప్రమాదాల్లో గాయపడిన వారికి రూ. 1.5 లక్షల వరకు ఉచిత నగదు రహిత చికిత్సను అందిస్తుంది. మరీ ఈ పథకాన్ని ఎలా పొందాలి.. దీనికి ఏం ఏం కావాలో ఇక్కడ క్లియర్‌గా తెలుసుకుందాం.

యాక్సిడెంట్ బాధితులకు సంజీవని.. ఆసుపత్రికి వెళ్లగానే రూ.1.5 లక్షల ఫ్రీ ట్రీట్‌మెంట్.. ఎలా పొందాలంటే?
Free Cashless Treatment For Road Accident Victims
Anand T
|

Updated on: Oct 22, 2026 | 9:11 PM

Share

పీఎం రాహత్.. రోడ్డు ప్రమాదాల్లో పేద ప్రజలకు అండగా ఉండాలనే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గత ఫ్రిబ్రవరి నెలలో ప్రారంభించారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు అత్యంత కీలకమైన తొలి గంటను గోల్డెన్ అవర్ గా పరిగణిస్తారు. ఈ సమయంలో సరైన వైద్యం అందితే మరణించే వారిలో సగం మందిని కాపాడవచ్చు. అయితే, చేతిలో డబ్బు లేకపోవడం, ఆసుపత్రి ఖర్చులకు భయపడి చాలామంది సకాలంలో వైద్యం పొందలే ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకే కేంద్రం ఈ సరికొత్త పథకానికి తీసుకొచ్చింది.

ఏడు రోజుల వరకు ఫ్రీ ట్రీట్మెంట్

పీఎం రాహత్ పథకం కింద, ఏ కేటగిరి రోడ్డుపై ప్రమాదం జరిగినా బాధితులు ఉచిత వైద్య సహాయం అందుతుంది. ప్రమాదం జరిగిన క్షణం నుంచి ఏడు రోజుల వరకు అయ్యే అన్ని రకాల అత్యవసర వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క బాధితుడికి కూడా ఆసుపత్రులు వైద్యం నిరాకరించకూడదన్నదే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. బాధితుడు ఆసుపత్రిలో చేరిన వెంటనే చికిత్స అందేలా, బిల్లుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా ఇది పూర్తి భరోసా కల్పిస్తుంది.

112 నంబర్‌తో తక్షణ సాయం..

ప్రమాదం జరిగిన వెంటనే బాధితులు గానీ, స్థానికులు గానీ 112 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి తక్షణ సాయం అందుకోవచ్చు. ఈ నంబర్ ద్వారా సమీపంలోని నెట్‌వర్క్ ఆసుపత్రుల వివరాలతో పాటు అంబులెన్స్ సదుపాయాన్ని పొందవచ్చు. ప్రమాద స్థలంలో బాధితులకు తోడ్పడే వారిని రాహు వీర్ అని పిలుస్తూ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి తొలి 48 గంటలు, సాధారణ గాయాలైన వారికి 24 గంటల పాటు తక్షణ స్థిరీకరణ చికిత్సను ఈ పథకం గ్యారెంటీ ఇస్తుంది.

డిజిటల్ పద్ధతిలో నిధుల విడుదల:

ఈ పథకం అమలు మొత్తం డిజిటల్ ప్రక్రియలో జరుగుతుంది. ప్రమాద వివరాలను నమోదు చేసే ఈ-డార్ (E-DAR) ప్లాట్‌ఫార్మ్, నేషనల్ హెల్త్ అథారిటీ వ్యవస్థలు రెండూ అనుసంధానమై ఉంటాయి. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు అంతా ఆన్‌లైన్‌లో పారదర్శకంగా సాగుతుంది. ఇన్సూరెన్స్ ఉన్న వాహనాల కేసులో బీమా కంపెనీలు, హిట్ అండ్ రన్ కేసుల్లో ప్రభుత్వం నేరుగా నిధులు సమకూరుస్తుంది. రాష్ట్ర ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపిన 10 రోజుల్లోనే ఆసుపత్రులకు బిల్లులు జమ అవుతాయి.

జిల్లా స్థాయిలో పరిష్కారం:

చికిత్స విషయంలో మీకు ఏవైనా సమస్యలు వస్తే జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన ఉండే రోడ్డు భద్రతా కమిటీకి ఫిర్యాదు చేయొచ్చు. మౌలిక సదుపాయాలు, నిధుల కొరత లేకుండా అత్యవసర చికిత్స వ్యవస్థను బలోపేతం చేసి బాధితులకు ఆర్థిక భరోసాతో పాటు సకాలంలో వైద్యం అందించి ప్రాణాలు నిలపడమే లక్ష్యంగా ‘పీఎం రాహత్’ పథకం అమలులోకి వచ్చింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us