Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్ కార్డు పోయిందా..? ఇంట్లోనే నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసుకోండి!
కేంద్ర ప్రభుత్వ పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద లబ్ది పొందాలంటే ఆయుష్మాన్ భారత్ కార్డు కలిగి ఉండాలి. ఒకవేళ మీరు ఈ కార్డు పొగోట్టుకుంటే ఆన్ లైన్ ద్వారా నిమిషాల్లనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా దేశంలోని సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం ఉచిత వైద్య సౌకర్యం పొందే అవకాశం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.5 లక్షల వరకు ఉచిత క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ పొందవచ్చు. నెట్‌వర్ ఆస్పత్రుల్లో ఈ సుదుపాయం అవకాశం ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ పోర్టల్‌లోకి వెళ్లి మీ సమీపంలోని ఆస్పత్రులను గుర్తించవచ్చు. జస్ట్ ఈ కార్డు చూపించి రూ.5 లక్షల వరకు ఉచిత ట్రీట్‌మెంట్ పొందవచ్చు. కుటుంబంలోని ప్రతీవ్యక్తికి ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అయితే మీరు ఆయుష్మాన్ భారత్ కార్డు పోగొట్టుకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా దానిని తిరిగి ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆయుష్మాన్ యాప్‌న, వెబ్ సైట్ సందర్శించాల్సి ఉంటుంది.
కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?
– ఆయుష్మాన్ భారత్ వెబ్‌సైట్ beneficiary.nha.gov.in ఓపెన్ చేయండి
– లబ్దిదారుడు అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి
-మొబైల్ నంబర్ నెంబర్ నమోదు చేసి OTPతో లాగిన్ అవ్వండి
-మీ రాష్ట్రం, జిల్లా, ఇతర సమాచారాన్ని నమోదు చేయండి
– మీ ప్రొఫైల్ ముందు డౌన్‌లోడ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి
-మీ ముఖ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయండి
-అనంతరం కార్డును డౌన్లోడ్ చేయండి
ఫిర్యాదు చేయడం ఎలా..?
మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, సేవలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదు చేయాల్నా cgrms.pmjay.gov.inకు సంప్రదించండి. అలాగే మీరు కార్డు పొగోట్టుకుంటే ఆయుష్మాన్ భారత్ యోజన టోల్ ఫ్రీ నంబర్ 14555 లేదా 1800-111-565 నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. మీ కార్డును బ్లాక్ చేయమని కోరవచ్చు. ఆయుష్మాన్ పోర్టల్ లేదా యాప్ ద్వారా మీరు హిస్టరీని చెక్ చేసుకోవచ్చు. దుర్వినియోగం కాకుండా ఉండాలంటే కార్డును పొగోట్టుకోగానే బ్లాక్ చేసుకోండి. మీ కార్డు దుర్వినియోం జరిగితే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
ఆయుష్మాన్ భారత్ ఎవరికి?
రేషన్ కార్డు కలిగి ఉండాలి. బీపీఎల్ఓ కుటుంబానికి చెందినవారై ఉండాలి. ఆదాయం తక్కువగా ఉండాలి. పేదలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఆన్‌లైన్ ద్వారా మీరు అప్లై చేసుకుని కార్డు పొందవచ్చు. ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అనంతరం మీ కార్డు జనరేట్ అవుతుంది. దానిని డౌన్‌లౌడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఆయుష్మాన్ భారత్ కార్డు ఆన్‌లైన్ ద్వారా సులువుగా పొందవచ్చు. అలాగే కామన్ సర్వీస్ సెంటర్లను ఆశ్రయించి కూడా అప్లై చేసుకోవచ్చు.
