ఉడికేటప్పుడు ఇదొక్కటి వేస్తే.. సాధారణ అన్నం కూడా ఘుమఘుమలాడాల్సిందే!

22 Oct 2026

Anand T

మీరు రోజు వండుకునే విధంగా కాకుండా రెస్టారెంట్‌ స్టైల్‌లో గుమగుమలాగే అన్నం వండుకోవాలి అనుకుంటే ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది.

బిర్యానీ ఆకు

అవును మీరు అన్నం ఉడికించేటప్పుడు అందులో ఒక్క బిర్యానీ ఆకు వేయడం వల్ల.. మీ పూర్తి వంటే మారిపోతుంది.

బిర్యానీ ఆకు

అన్నంలో బిర్యానీ ఆకు వేయడం వల్ల అన్నానికి చక్కటి సువాసన రావడమే కాకుండా, సాధారణ అన్నం కూడా ఎంతో రుచిగా మారుతుంది.

అద్భుతమైన సువాసన

బిర్యానీ ఆకులోని మన జీర్ణ వ్యవస్థకు దోహదపడే అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియ సాఫీగా సాగేందుకు దోహదపడతాయి.

జీర్ణక్రియ

ఇందులో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు శరీరంలోని ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

యాంటీఆక్సిడెంట్‌లు

అన్నం ఉడికేటప్పుడు బిర్యానీ ఆకులు వేస్తే వాటిలోని సహజ నూనెలు నీటిలో కలిసి, ప్రతి బియ్యపు గింజకు ప్రత్యేకమైన ఘుమఘుమలాడే రుచిని అందిస్తాయి.

రుచి రెట్టింపు

ఎక్కువ ఘాటైన మసాలాలు వాడకుండానే, కేవలం ఒక్క ఆకుతో వంటకానికి సహజమైన సువాసన, చక్కటి రుచిని తీసుకురావచ్చు.

మసాలాకు ప్రత్యామ్నాయం

పులావ్ చేసేటప్పుడు నెయ్యిలో బిర్యానీ ఆకును వేయిస్తే దాని పరిమళం మరింత పెరిగి, అన్నం రెస్టారెంట్ స్టైల్ రుచితో సిద్ధమవుతుంది.

సుగంధభరిత పులావ్