AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేషన్ కార్డు హోల్డర్లకు గుడ్‌న్యూస్ ఇక..నెలనెలా మరో 6 సరుకులు! త్వరలోనే అధికారిక ప్రకటన.!

రేషన్ కార్డు హోల్డర్లకు గుడ్‌న్యూస్ ఇక..నెలనెలా మరో 6 సరుకులు! త్వరలోనే అధికారిక ప్రకటన.!

Phani CH
|

Updated on: Oct 22, 2026 | 7:35 PM

Share

తెలంగాణ రేషన్‌ కార్డుదారులకు బియ్యంతో పాటు మరో ఆరు నిత్యావసర సరుకులను సబ్సిడీ ధరలకు అందించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. గోధుమపిండి, కందిపప్పు, పామాయిల్‌, చక్కెర, చింతపండు, కారం పొడిని రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీ చేసే అంశంపై పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. సరుకుల ధరలు, పరిమాణం, పంపిణీ ప్రారంభ తేదీపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అధికారుల నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టనుంది.

తెలంగాణలో రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్ అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బియ్యంతో పాటు గోధుమపిండి, కందిపప్పు, పామాయిల్ సహా మరో ఆరు నిత్యావసర సరుకులను సబ్సిడీ ధరలకు అందించే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే కొంత ఊరట లభించే అవకాశం ఉంది. ఇంతకీ ఆ ఆరు సరుకులు ఏంటి? వీటిని ఎప్పటి నుంచి పంపిణీ చేసే అవకాశం ఉంది? డీటెయిల్డ్‌గా చూద్దాం. ప్రస్తుతం మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో సామాన్య కుటుంబాల నెలవారీ ఖర్చులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు కిరాణా సరుకుల కొనుగోలుకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులను కూడా సబ్సిడీ ధరలకు అందించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే అర్హులైన రేషన్ కార్డుదారులకు ఆర్థికంగా కొంత ఉపశమనం లభించనుంది. ఇంతకీ రేషన్ షాపుల్లో కొత్తగా పంపిణీ చేయాలని పరిశీలిస్తున్న ఆరు సరుకులు ఏంటంటే.. గోధుమపిండి, కందిపప్పు, పామాయిల్, చక్కెర, చింతపండు, కారం పొడి. ఈ ఆరు నిత్యావసర వస్తువులను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా తక్కువ ధరలకు అందించే అంశంపై పౌరసరఫరాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే, ఈ సరుకులను ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకురావాలి? ఏ ధరలకు విక్రయించాలి? ఒక్కో కుటుంబానికి ఎంత పరిమాణంలో కేటాయించాలి? అనే అంశాలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రతిపాదనపై సచివాలయంలో పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సరుకులను ఎక్కడి నుంచి సేకరించాలి? కుటుంబ సభ్యుల సంఖ్య ఆధారంగా ఎంత పరిమాణంలో పంపిణీ చేయాలి? నిల్వ, రవాణా, పంపిణీ విధానం ఎలా ఉండాలి? అనే అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు, ఈ ప్రతిపాదన అమలుతో ప్రభుత్వంపై ఏటా ఎంత ఆర్థిక భారం పడుతుందో అంచనా వేయాలని సూచించారు. అధికారుల నివేదిక ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు రాష్ట్రంలో ప్రజలకు ఆహార ధాన్యాల కొరత రాకుండా ముందస్తు చర్యలపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. రేషన్ పంపిణీతో పాటు ఇతర సంక్షేమ పథకాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుకు కూడా భారీగా బియ్యం అవసరమవుతోంది. ఈ అవసరాల కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రతినెలా సుమారు 2.38 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతున్నట్లు పౌరసరఫరాల శాఖ అంచనా వేస్తోంది. అక్టోబర్ 16 నాటికి ప్రభుత్వ బఫర్ గోదాముల్లో 9.64 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీటికి అదనంగా కస్టమ్ మిల్లింగ్ రైస్‌తో పాటు ఇతర మార్గాల ద్వారా మరో 18.39 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి రావాల్సి ఉంది. ఈ బియ్యం కూడా గోదాములకు చేరితే మొత్తం నిల్వలు 28.03 లక్షల మెట్రిక్ టన్నులకు చేరనున్నాయి. ఈ నిల్వలు రాష్ట్ర అవసరాలకు సుమారు 11.7 నెలల పాటు సరిపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా, పంటల దిగుబడులు తగ్గినా లేదా మార్కెట్‌లో ఆహార ధాన్యాల ధరలు పెరిగినా ప్రజా పంపిణీ వ్యవస్థకు ఆటంకం కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. రేషన్ ద్వారా ప్రయోజనం పొందుతున్న సుమారు 3.42 కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రత కల్పించేలా బియ్యం నిల్వలను సమర్థంగా నిర్వహించాలని ఆదేశించారు. అవసరమైన బియ్యం సకాలంలో గోదాములకు చేరేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మొత్తానికి, తెలంగాణలో రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు మరో ఆరు నిత్యావసర సరుకులను సబ్సిడీ ధరలకు అందించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. అయితే, ఈ సరుకుల పంపిణీ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? వాటి ధరలు ఎంత ఉంటాయి? అర్హతలు, పంపిణీ పరిమాణం ఎలా నిర్ణయిస్తారు? అనే అంశాలపై ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. తుది నిర్ణయం వెలువడిన తర్వాతే రేషన్ కార్డుదారులకు అందే ప్రయోజనాలపై పూర్తి స్పష్టత రానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డబ్బుల్లేవని వైద్యం ఆపకండి.. హాస్పిటల్ బిల్లులకూ ఈఎంఐ ఆప్షన్.. అసలు నిజమిదే!

పశువుల్లో వింత వ్యాధి.. ఆందోళనలో జనం

దీపికా-రణ్‌వీర్‌ రెండో కూతురి పేరేంటో తెలుసా?

నువ్వు దేవుడివి బాస్‌.. మంటల్లో చిక్కుకున్న మహిళను కాపాడిన డెలివరీ బాయ్‌

డ్రోన్‌ అంబులెన్స్‌‌లు వచ్చేస్తున్నాయ్‌

Follow Us