Actor Kamalakar: ‘అభి’ సినిమా హీరో గుర్తున్నాడా? పాపం 34 ఏళ్లకే హఠాన్మరణం.. అసలు ఏం జరిగిందో తెలుసా?
పొలిటిక్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబంలో పుట్టాడు. కానీ ఆశ్చర్యకరంగా రాజకీయాల్లోకి కాకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. హీరోగా నాలుగు సినిమాలు చేశాడు. అతి తక్కువ కాలంలోనే ట్యాలెంటెడ్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతనిని చూసి హీరోగా ఎంతో మంచి భవిష్యత్ ఉందనుకున్నారు. కానీ విధి ఈ నటుడి రాతను మరోలా రాసింది.

2004లో రిలీజైన ‘అభి’ సినిమా చాలా మందికి గుర్తుంటుంది. ఈ సినిమా యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్నా ఇందులోని పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. అప్పటి రేడియోలు, టేప్ రికార్డర్లలో ఈ సాంగ్స్ మోత మోగిపోయాయి. ముఖ్యంగా ‘వంగతోట మలుపు కాడ కొంగు పట్టి లాగాడే’ అనే సాంగ్ అయితే తెగ నచ్చేసింది. అప్పట్లో ఎక్కడ చూసినా ఈ మాస్ సాంగే వినిపించేది. అలాగే ‘ఎవరో అతనెవరో’ అనే మెలోడీ సాంగ్ కూడా మ్యూజిక్ లవర్స్ కు తెగ నచ్చేసింది. ఇక అభి సినిమాలో నటించిన హీరో పేరు కమలాకర్. పూర్తి పేరు బూచే పల్లి కమలాకర్ రెడ్డి. పేరు వింటుంటే ఎక్కడో పొలిటికల్ ఫ్యామిలీ గుర్తొస్తుంది కదా..అవును ఈ హీరో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచే వచ్చాడు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో బూచే పల్లి కుటుంబానికి ఇప్పటికీ మంచి పేరుంది. పార్లమెంట్ సభ్యునిగా చాలా కాలం పాటు సేవలందించిన బూచే పల్లి సుబ్బా రెడ్డి కుమారుడే ఈ కమలాకర్. అలాగే 2009లో దర్శి ఎమ్మెల్యేగా గెలుపొందిన శివ ప్రసాద్ రెడ్డి ఈ హీరోకు స్వయనా సోదరుడు అవుతాడు.అయితే ఇంత బలమైన రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ నటనపై ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు కమలాకర్. అభి సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇందులో అతను పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటించి మంచి మార్కులు కొట్టేశాడు. సినిమా కూడా ఓ మోస్తరుగా ఆడింది.
అభి సినిమా తర్వాత కమలాకర్ కు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. త హాసిని, సన్నీ, సంచలనం సినిమాల్లో హీరోగానూ నటించాడు. సాయి కుమార్ లాంటి సీనియర్ హీరోలతోనూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. దీంతో కమలాకర్ ను చూసి భవిష్యత్ లో స్టార్ హీరో అవుతాడనుకున్నారు. కానీ విధి మరోలా తలంచింది. ఈ ట్యాలెంటెడ్ నటుడిని కాలం చాలా చిన్న చూపు చూసింది. కమలాకర్ నటించిన ఐదో సినిమా బ్యాండ్ బాలు. షూటింగ్ కూడా పూర్తయ్యి రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్ లో ఆడియో రిలీజ్ కూడా గ్రాండ్ గా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలోనే ఒక చిన్న ప్రమాదం జరిగింది. ఈవెంట్ జరుగుతుండగానే హీరో కమలాకర్ ప్రమాదవశాత్తూ జారి కింద పడి పోయారు. దీంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చాలా రోజులు చికిత్స పొందారు. కానీ కోలుకోలేకపోయారు. చివరకు 2013 జులై 14న గుండె పోటు తో తుది శ్వాస విడిచారు కమలాకర్. అప్పటికింకా అతని వయసు కేవలం 34 ఏళ్లు మాత్రమే. కమలాకర్ మృతి ఆయన కుటుంబ సభ్యులతో పాటు సినీ అభిమానులను తీవ్రంగా కలిచివేసింది. కమలాకర్ కు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




