రైళ్లలో, స్టేషన్లలో ఇకపై అలా చేస్తే జరిమానా..? వినకపోతే జైలు శిక్ష..! బీకేర్‌ఫుల్..
రైళ్లలో, రైల్వే స్టేషన్లలో మొబైల్ ఫోన్లలో పెద్ద శబ్దంతో పాటలు, వీడియోలు ప్లే చేయడం తోటి ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రవర్తనపై జరిమానాలు, ఇతర చర్యలు ఉంటాయంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే రూ.1,000 జరిమానా, రైలు నుంచి దింపేయడం, ఆరు నెలల జైలు శిక్ష వంటి వివరాలు ఏ నిబంధనల కింద వర్తిస్తాయో అధికారిక రైల్వే ప్రకటనలతో నిర్ధారించుకోవడం అవసరం.
ప్లీజ్ బ్రో డిస్ట్రబ్ చేయొద్దు.. సౌండ్ తక్కువ చేయండి.. ప్లీజ్ పెద్దగా వద్దు.. కొంచెం మెల్లగా మాట్లాడండి.. ప్రయాణంలో ఇలాంటి సందర్భాలు చాలానే ఎదురయ్యి ఉంటాయి.. ట్రైన్‌లో ప్రయాణించేటప్పుడు పక్కవాళ్లు మొబైల్‌లో ఫుల్ వాల్యూమ్ పెట్టి పాటలు, రీల్స్ చూస్తుంటే మనకు చిరాకు వేస్తుంది.. రిక్వెస్ట్ చేసినా వినరు.. అసలు వాళ్లు ఎంత న్యూసెన్స్ చేస్తున్నారో తెలిసి కూడా ఏం పట్టనట్లు బిహేవ్ చేస్తుంటారు.. అయితే అలాంటి వాళ్లకు ఇండియన్ రైల్వే శాఖ దిమ్మతిరిగే షాకిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రైళ్లలో లేదా స్టేషన్లలో ఫోన్‌లలో లౌడ్ స్పీకర్ ఆన్ చేసి పాటలు విన్నా, వీడియోలు చూసి ఇతరులకు డిస్టర్బ్ చేసినా… వేయి రూపాయలు ఫైన్ వేయడంతో పాటు ట్రైన్ నుంచి దింపేస్తారు!.. ఒకవేళ గొడవ చేస్తే ఏకంగా 6 నెలల జైలు శిక్ష, రూ. 5,000 వరకు జరిమానా తప్పదంటూ సౌత్ సెంట్రల్ రైల్వే హెచ్చరించింది.. అసలు రైల్వే శాఖ ప్రయోగించిన ఆ కొత్త చట్టం ఏంటి? ఈ రూల్స్ ఎవరికి వర్తిస్తాయి? ఈ రోజు వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చూసేద్దాం.. “ప్రయాణికుల సౌకర్యానికి భంగం కలిగించే ఈ ‘పబ్లిక్ న్యూసెన్స్’ ను అరికట్టడానికి దక్షిణ మధ్య రైల్వే రంగంలోకి దిగింది. జన్ విశ్వాస్ చట్టం: పబ్లిక్ ప్లేసెస్‌లో ఇబ్బందులను నిరోధించే ‘జన్ విశ్వాస్ చట్టం’ కింద సవరించిన రైల్వే చట్టంలోని సెక్షన్ 142 ను దీనికోసం ప్రయోగించారు. బీఎన్‌ఎస్ సెక్షన్ 270: భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 270 ప్రకారం… బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించే ఏ చర్య అయినా నేరమే! ఈ నిబంధనలను కేవలం రైళ్లలోనే కాకుండా మెట్రో వ్యవస్థలలోనూ అమలు చేయవచ్చని అధికారులు స్పష్టం చేశారు.. “ఈ నిబంధనలను అతిక్రమిస్తే శిక్షలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి క్లియర్‌గా చూద్దాం:
మొదటి విడత ఉల్లంఘన: ట్రైన్‌లో లేదా స్టేషన్‌లో లౌడ్ స్పీకర్ పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే… టీటీఈ (TTE) లేదా కమర్షియల్ సీనియర్ అధికారులు వెంటనే రూ. 1,000 జరిమానా విధిస్తారు. అంతేకాదు, వారిని రైలు నుంచి కిందకు దించేస్తారు. రైల్వే ప్రాంగణం నుంచి బయటకు పంపిస్తారు!
పునరావృతం చేస్తే: ఇదే తప్పును మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తే… గరిష్టంగా ఆరు నెలల జైలు శిక్ష, రూ. 5,000 వరకు జరిమానా ఎదుర్కొనక తప్పదు.”
“ఈ మధ్యకాలంలో స్మార్ట్‌ఫోన్లు, హై-స్పీడ్ ఇంటర్నెట్ విపరీతంగా పెరిగిపోవడంతో… ప్రయాణికులు ఎవరి సౌలభ్యం వారు చూసుకుంటూ పబ్లిక్ స్పేస్‌లో ఫుల్ వాల్యూమ్‌లో వీడియోలు పెట్టడం సర్వసాధారణమైపోయింది. ఇది తోటి ప్రయాణికులకు తీవ్ర మానసిక ఆందోళన కలిగిస్తోంది. దీనిని అరికట్టడానికి దక్షిణ రైల్వే తన అన్ని డివిజన్లకు ప్రత్యేక సర్క్యులర్ పంపింది. రైళ్లలో, స్టేషన్లలో ప్రయాణికులకు అర్థమయ్యేలా ప్రాంతీయ భాషలు, హిందీ, ఇంగ్లీష్‌లలో మైకుల ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రయాణంలో గట్టిగా మాట్లాడటం, పెద్ద సౌండ్స్‌తో రింగ్‌టోన్లు పెట్టుకోవడం వంటి వాటికి కూడా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. సో గాయిస్… ఇకపై ట్రైన్ జర్నీలో ఫోన్ వాడేటప్పుడు ఇయర్ ఫోన్స్ (Earphones) వాడటం మర్చిపోకండి! లేదంటే జేబుకి చిల్లు పడటంతో పాటు జైలు పాలు కావాల్సి వస్తుంది. ఈ అత్యంత ముఖ్యమైన రైల్వే అప్‌డేట్‌ను మీ ఫ్రెండ్స్ అండ్ తరచూ ట్రైన్లలో ప్రయాణించే ఫ్యామిలీ మెంబర్స్‌కు వెంటనే షేర్ చేసి అలర్ట్ చేయండి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హిట్ అండ్ రన్ ప్రమాదం జరిగితే రూ.2 లక్షలు ఎలా పొందాలి?
గన్ లైసెన్సులు.. ఆత్మరక్షణ కోసమా? మూగజీవాల వేట కోసమా?
దంపతుల రీల్స్ పిచ్చి..కన్నబిడ్డ సముద్రంలో కొట్టుకుపోతున్నా
ఏనుగులకు స్పెషల్ డైట్.. మైసూర్ దసరా జంబూ సవారీ వెనుక అసలు రహస్యం ఇదే
రేషన్ కార్డు హోల్డర్లకు గుడ్‌న్యూస్ ఇక..నెలనెలా మరో 6 సరుకులు! త్వరలోనే అధికారిక ప్రకటన.!
గన్ లైసెన్సులు.. ఆత్మరక్షణ కోసమా? మూగజీవాల వేట కోసమా?
దంపతుల రీల్స్ పిచ్చి..కన్నబిడ్డ సముద్రంలో కొట్టుకుపోతున్నా
ఏనుగులకు స్పెషల్ డైట్..
మంటల్లో చిక్కుకున్న మహిళను కాపాడిన డెలివరీ బాయ్
డ్రోన్ అంబులెన్స్‌లు వచ్చేస్తున్నాయ్
ఆ ఊళ్లో ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగదు...వంటచెయ్యరు..ఎందుకో తెలుసా?
కొత్త కారు.. షోరూమ్నుంచి బయటకు తీస్తుండగా..

