AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP DGP: ఏపీలో ఎన్నికల హింసపై డీజీపీ సీరియస్.. కీలక ప్రకటన

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై డీజీపీ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా13 జిల్లాల్లో 31 ఎన్నికల సంబంధిత ఘటనలు చోటుచేసుకోగా, వీటిలో 22 ప్రత్యక్ష హింసాత్మక ఘటనలు, నామినేషన్ పత్రాలను లాక్కోవడం, చించివేయడానికి సంబంధించి మరో 9 ఘటనలు ఉన్నట్లు వెల్లడించారు.

AP DGP: ఏపీలో ఎన్నికల హింసపై డీజీపీ సీరియస్.. కీలక ప్రకటన
Ap Local Body Elections Violence
Anand T
| Edited By: |

Updated on: Oct 26, 2026 | 3:28 PM

Share

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై తాజాగా డీజీపీ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, వైసీపీ, సీపీఐఎంతో పాటు స్వతంత్ర అభ్యర్థులపై దాడులు జరిగినట్లు డీజీపీ పేర్కొన్నారు. మొత్తం 13 జిల్లాల్లో 31 ఎన్నికల సంబంధిత ఘటనలు చోటుచేసుకోగా, వీటిలో 22 ప్రత్యక్ష హింసాత్మక ఘటనలు, నామినేషన్ పత్రాలను లాక్కోవడం, చించివేయడానికి సంబంధించి మరో 9 ఘటనలు ఉన్నట్లు వెల్లడించారు.

ఎన్నికల హింసకు సంబంధించి ఇప్పటివరకు 16 కేసులు నమోదు చేయగా, మరో 11 ఘటనల్లో కేసుల నమోదు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఇప్పటివరకు 54 మందికి పైగా నిందితులను గుర్తించామని, మిగతా వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నలుగురిని ఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకోగా, ఇద్దరిపై BNSS సెక్షన్ 170 కింద ముందస్తు నిరోధక చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

మూడు సందర్భాల్లో హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారని.. పోలీసు వాహనంపై దాడి చేసిన మూకను చెదరగొట్టే క్రమంలో రెండు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించినట్టు తెలిపారు. అలాగే అభ్యర్థులకు ఎస్కార్ట్‌గా వెళ్తున్న పోలీసు వాహనంపై రాళ్ల దాడి జరగడంతో ఓ కానిస్టేబుల్ తలకు గాయమైందని.. ఒకచోట గాల్లోకి కాల్పులు జరిపినట్లు కూడా డీజీపీ ప్రకటనలో పేర్కొన్నారు.

నామినేషన్ పత్రాలను లాక్కోవడం, చించి వేయడం, ధ్వంసం చేయడం వంటి ఘటనలు మొత్తం 16 సార్లు జరిగాయని. రాళ్లు, కర్రలతో దాడులకు సంబంధించి ఆరు ఘటనలు నమోదయ్యాయని తెలిపారు. ఈ దాడుల్లో రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు కలిపి మొత్తం నాలుగు వాహనాలకు నిప్పుపెట్టారని చెప్పుకొచ్చారు. రెండు ఇళ్లపై దాడి చేయగా, ఒక ఇంటిని ఎర్త్‌మూవర్‌తో కూల్చివేశారని.. ఓ అభ్యర్థితో సహా ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మరో మూడు ఘర్షణల్లో పలువురు గాయపడ్డారని తెలిపారు. మూడు చోట్ల రాస్తారోకోలు, రోడ్ల దిగ్బంధం జరగడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు.

జిల్లాల వారీగా మొత్తం 31 ఘటనలు నమోదయ్యాయని.. అనంతపురం – 8, అన్నమయ్య – 3 , వైఎస్సార్ కడప – 3, ప్రకాశం – 3 , తిరుపతి – 3 , చిత్తూరు – 2 , శ్రీ సత్యసాయి – 2 , పల్నాడు – 2 , నెల్లూరు – 1 , కర్నూలు – 1 , మార్కాపురం – 1 ,నంద్యాల – 1 , ఏలూరులో ఒక కేసు నమొదైందన్నారు.

పార్టీలతో సంబంధం లేకుండా హింసకు పాల్పడిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థుల పత్రాలను చించివేస్తే నాన్‌-బెయిలబుల్ క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. కేవలం దాడులు చేసిన వారే కాకుండా, హింసను ప్రేరేపించినవారు, మూకలను సమీకరించిన నాయకుల పాత్రపైనా విచారణ ఉంటుందని తేల్చిచెప్పారు. నామినేషన్ కేంద్రాల వద్ద కర్రలు, రాళ్లు, ఆయుధాలతో తిరగడాన్ని సహించబోమన్నారు.

సున్నిత ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించాలని జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను ఆదేశించారు. అభ్యర్థులు, ఎన్నికల సిబ్బందికి పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడైనా ఎన్నికల హింస, బెదిరింపులు, అడ్డంకులు ఎదురైతే తక్షణమే 100 లేదా 112 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని డీజీపీ ప్రజలకు పిలుపునిచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏడాది పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి.. పక్కా కొలతలతో
ఏడాది పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి.. పక్కా కొలతలతో
చరిత్ర సృష్టించిన సైమన్ హర్మర్.. 130 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
చరిత్ర సృష్టించిన సైమన్ హర్మర్.. 130 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
శివ మాల వేసిన యాంకర్ స్రవంతి.. ఫొటోస్ ఇదిగో
శివ మాల వేసిన యాంకర్ స్రవంతి.. ఫొటోస్ ఇదిగో
శుక్రవారం ఈ చిన్న పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహంతో..
శుక్రవారం ఈ చిన్న పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహంతో..
ఆ హీరోయిన్ కు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని..
ఆ హీరోయిన్ కు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని..
ఈ 5 రకాల వ్యక్తులతో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకండి.. జీవితంలో..
ఈ 5 రకాల వ్యక్తులతో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకండి.. జీవితంలో..
3 ఏళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ ఫైనల్.. మరి ఇప్పుడేం చేస్తున్నారంటే
3 ఏళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ ఫైనల్.. మరి ఇప్పుడేం చేస్తున్నారంటే
'నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?'.. అర్జున్ తీవ్ర ఆగ్రహం
'నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?'.. అర్జున్ తీవ్ర ఆగ్రహం
లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!
లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!
కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..
కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..