AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: మహిళా కలెక్టర్ల పేరుతో సైబర్ కేటుగాళ్ల సరికొత్త మోసం.. ఏం చేశారో తెలిస్తే..

ఉమ్మడి కర్నూలు జిల్లాలో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోయారు. ఎన్నికల విధుల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ఇద్దరు మహిళా కలెక్టర్లనే టార్గెట్ చేస్తూ మోసాలకు తెరతీశారు. కర్నూలు కలెక్టర్ డాక్టర్ సిరి, నంద్యాల కలెక్టర్ రాజకుమారి పేర్లు, ఫొటోలను ఉపయోగించి వాట్సాప్ ద్వారా డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. విషయం పోలీసుల వరకు వెళ్లడంతో ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Andhra News: మహిళా కలెక్టర్ల పేరుతో సైబర్ కేటుగాళ్ల సరికొత్త మోసం.. ఏం చేశారో తెలిస్తే..
Cyber Fraud In Kurnool
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Oct 22, 2026 | 9:50 PM

Share

కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లుగా డాక్టర్ సిరి, రాజకుమారి సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల సమయం కావడంతో నిత్యం ఏదో ఒక పనితో వారు ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే ఇదే అదనుగా భావించిన సైబర్ మోసగాళ్లు ఏకంగా జిల్లా కలెక్టర్ల పేర్లను వాడుకొని వాట్సాప్ వేదికగా మోసాలకు తెరలేపారు. కర్నూలు కలెక్టర్ డాక్టర్ సిరి ఫొటో, పేరుతో పలువురి మొబైళ్లకు గుర్తుతెలియని నంబర్ నుంచి వాట్సాప్ సందేశాలు పంపారు.

తనకు అత్యవసరంగా రూ. 30,000 కావాలి, వెంటనే పంపించండి.. గంట తర్వాత రిటర్న్ చేస్తాను అని ఆ మెసేజ్‌లలో పేర్కొన్నారు. ఈ వ్యవహారం కాస్తా కలెక్టర్ దృష్టికి చేరడంతో ఆమె వెంటనే అప్రమత్తమయ్యారు. తన పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడిగితే ఎట్టిపరిస్థితుల్లోనూ పంపవద్దని, తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

నంద్యాల కలెక్టర్ పేరుతోనూ వసూళ్లు

ఇదే తరహాలో నంద్యాల కలెక్టర్ రాజకుమారికి కూడా ఈ సైబర్ బెడద ఎదురైంది. ఆమె పేరు, ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని ఒక ఫోన్ నంబర్ ద్వారా జిల్లా వాసులకు డబ్బులు కోరుతూ సందేశాలు పంపించారు. సమాచారం తెలుసుకున్న కలెక్టర్ రాజకుమారి వెంటనే స్పందించి ప్రజలను అలర్ట్ చేశారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా డబ్బులు అడగనని స్పష్టం చేస్తూ, తన పేరుతో వచ్చే ఇలాంటి నకిలీ సందేశాలను నమ్మవద్దని, అనుమానం వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఒకే సమయంలో ఇద్దరు జిల్లాల మహిళా కలెక్టర్ల ప్రొఫైళ్లను దుర్వినియోగం చేస్తూ డబ్బులు కాజేసేందుకు కేటుగాళ్లు యత్నించడం ఉమ్మడి కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆల్ ఇండియా సర్వీస్ (IAS) స్థాయి ఉన్నతాధికారుల పేర్లనే సైబర్ నేరగాళ్లు ఇలా వాడేస్తుంటే, ఇక సామాన్యుల భద్రత పరిస్థితి ఏమిటనే అంశంపై అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను వెతికే పనిలో పడ్డారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహిళా కలెక్టర్ల పేరుతో సైబర్ కేటుగాళ్ల సరికొత్త మోసం..
మహిళా కలెక్టర్ల పేరుతో సైబర్ కేటుగాళ్ల సరికొత్త మోసం..
 ఉదయం 5 గంటలకే లేవాలా? 5 AM రొటీన్‌లోని అసలు విషయం ఇదే!
 ఉదయం 5 గంటలకే లేవాలా? 5 AM రొటీన్‌లోని అసలు విషయం ఇదే!
కిచెన్ నుంచి బెడ్‌రూమ్ వరకు.. ఏ గదికి ఏ రంగు సరిపోతుందో తెలుసా?
కిచెన్ నుంచి బెడ్‌రూమ్ వరకు.. ఏ గదికి ఏ రంగు సరిపోతుందో తెలుసా?
నోరూరించే కొబ్బరి పాల అన్నం.. ఇలా చేస్తే 10 నిమిషాల్లోనే..
నోరూరించే కొబ్బరి పాల అన్నం.. ఇలా చేస్తే 10 నిమిషాల్లోనే..
మిగిలిన అన్నంతో మల్లెపువ్వుల్లాంటి ఇడ్లీలు.. ఇలా చేయండి!
మిగిలిన అన్నంతో మల్లెపువ్వుల్లాంటి ఇడ్లీలు.. ఇలా చేయండి!
  పాత ప్లాస్టిక్ కవర్లతో ఇన్ని పనులా? డబ్బు ఆదా చేసే చిట్కా
  పాత ప్లాస్టిక్ కవర్లతో ఇన్ని పనులా? డబ్బు ఆదా చేసే చిట్కా
'అభి' సినిమా హీరో గుర్తున్నాడా? పాపం 34 ఏళ్లకే హఠాన్మరణం..
'అభి' సినిమా హీరో గుర్తున్నాడా? పాపం 34 ఏళ్లకే హఠాన్మరణం..
రిచ్‌ లుక్‌, తక్కువ ధరతో మ్యూజిక్‌ లవర్స్‌ కోసం ఇయర్‌బడ్స్‌
రిచ్‌ లుక్‌, తక్కువ ధరతో మ్యూజిక్‌ లవర్స్‌ కోసం ఇయర్‌బడ్స్‌
  ఫోన్ పక్కన పెట్టలేకపోతున్నారా? ఈ చిన్న అలవాటు తగ్గించేస్తుంది
  ఫోన్ పక్కన పెట్టలేకపోతున్నారా? ఈ చిన్న అలవాటు తగ్గించేస్తుంది
బ్లాక్ జీన్స్ కొత్తగా కనిపించాలంటే.. ఉతికేటప్పుడు ఇలా చేయొద్దు
బ్లాక్ జీన్స్ కొత్తగా కనిపించాలంటే.. ఉతికేటప్పుడు ఇలా చేయొద్దు