ఈ సింపుల్ ట్రిక్‌తో ట్రైన్ టికెట్ బుకింగ్‌లో మీరే కింగ్.. వెయిటింగ్ లిస్ట్ మాటే ఉండదు..

Venkatrao Lella

Images: Pinterest

01 OCT 2026

అన్‌రిజర్వుడు టికెట్ కలిగిన ప్రయాణికులు జనరల్ కోచుల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ కోచ్‌లు పరిమిత సంఖ్యలో ఉండటం వల్ల ప్రయాణికుల రద్దీ ఎప్పుడూ కిక్కిరిసి ఉంటుంది. కనీసం కాలు పెట్టానికి కూడా ఖాళీ ఉండదు.

దూరపు ప్రయాణాలు చేసేవారు ఎక్కువదూరం నిల్చోని జనరల్ కోచుల్లో ప్రయాణం చేయాలంటే చాలా కష్టం. దీంతో దూరపు ప్రయాణాలు చేసేవారు ఆన్‌లైన్ ద్వారా ముందుగానే టికెట్లను కొనుగోలు చేస్తుంటారు.

రైల్వేశాఖ నిబంధనల ప్రకారం 60 రోజుల ముందుగానే రైళ్లల్లో అడ్వాన్స్ టికెట్ బుకింగ్ చేసుకునే సౌలభ్యం ఉంది. దీంతో దూర ప్రయాణాలు చేసేవారు ముందుగానే టికెట్ బుక్ చేసుకుంటారు.

కొన్ని రద్దీ రైళ్లల్లో బుకింగ్ విండో ఓపెన్ చేయగానే బుకింగ్ మెరుపు వేగంతో పూర్తవుతాయి. తత్కాల్ టికెట్లు అయితే నిమిషాల్లోనే పూర్తవుతాయి. కొన్ని చిట్కాలు పాటించడం వల్ల మెరుపు వేగంతో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

బుకింగ్ విండో ఓపెన్ కావడానికి 5 నుంచి 10 నిమిషాల ముందే మీరు లాగిన్ అయి రెడీగా ఉండాలి. అలాగే ప్రయాణికుల వివరాలను కూడా ముందే వెబ్ సైట్లో నింపి రెడీ చేసుకోవాలి. దీని వల్ల మీకు  సమయం వృథా కాదు.

ఐఆర్‌సీటీసీ మాస్టర్ లిస్ట్ ఫీచర్ సాయంతో మీరు పేర్లను ముందుగా సేవ్ చేసుకోవచ్చు. మీరు టికెట్ బుకింగ్ చేసేటప్పుడు ప్రయాణికుల వివరాలను ఒకే క్లిక్‌తో కనిపిస్తాయి. దీని వల్ల మీకు త్వరగా టికెట్లు బుక్ అవుతాయి.

పేమెంట్స్ విధానం సులభంగా ఉండేలా చూసుకోండి. నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేయాలంటే నెంబర్లు, ఓటీపీ ప్రక్రియలు అవసరముంది. కొన్నిసార్లు ఓటీపీలు ఆలస్యంగా వచ్చే అవకాశముంటుంది. దీని వల్ల ఎక్కువ సమయం పట్టవచ్చు.

మీరు ముందుగానే ఐఆర్‌సీటీసీ వ్యాలెట్‌లో నిధులు లోడ్ చేసుకోండి. వ్యాలెట్ ద్వారా పేమెంట్ చేయడానికి ఓటీపీ అవసరం ఉండదు. దీంతో వేగంగా పేమెంట్ చేయడం వల్ల టికెట్ కూడా వేగంగా పొందవచ్చు. లేకపోతే వెయిటింగ్ లిస్టులోకి వెళ్లే ప్రమాదముంటుంది.

ముందుగానే లాగిన్ అయి ఉండటం, ప్రయాణికుల వివరాలు ముందుగానే పొందుపర్చి ఉండటం, వేగంగా పేమెంట్ చేయడం వల్ల టికెట్ కూడా అత్యంత వేగంతో బుకింగ్ అవుతుంది. దీని వల్ల మీకు కన్పార్మ్‌డ్ టికెట్ లభిస్తుంది.