AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశవ్యాప్తంగా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు.. రాజ్‌ఘాట్‌లో మోదీ నివాళులు

దేశవ్యాప్తంగా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఢిల్లీలోని రాజ్‌ఘాట్, విజయ్‌ఘాట్‌లలో నివాళులర్పించారు. సత్యం, అహింస, నిరాడంబరత, దేశభక్తి వంటి వారి ఆదర్శాలను స్మరించుకుంటూ, స్వచ్ఛభారత్ సహా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ జయంతి వేడుకలు దేశ ప్రజలకు గొప్ప స్ఫూర్తినిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు.. రాజ్‌ఘాట్‌లో మోదీ నివాళులు
Pm Modi Pays Tributes At Rajghat
Balaraju Goud
|

Updated on: Oct 02, 2026 | 8:14 AM

Share

దేశవ్యాప్తంగా జాతిపిత మహాత్మ గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతితో పాటు లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని కూడా దేశ ప్రజలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహాత్మ గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా గాంధీజీ సేవలను ప్రధాని స్మరించుకున్నారు. సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత వంటి ఆయన విలువలు దేశానికి ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. బాపూజీ అందించిన కాలాతీత సందేశం ప్రతి ఒక్కరినీ మెరుగైన సమాజ నిర్మాణం వైపు, వికసిత భారత్ లక్ష్యం వైపు నడిపించాలని ఆకాంక్షించారు.

అనంతరం మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా విజయ్‌ఘాట్‌లో ఆయనకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. నిరాడంబరత, నిజాయితీ, దేశభక్తికి శాస్త్రిజీ జీవితం గొప్ప ఉదాహరణగా నిలిచిందని గుర్తు చేసుకున్నారు. దేశ సేవ పట్ల ఆయన చూపిన అంకితభావం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.

గాంధీ, శాస్త్రి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు, స్వచ్ఛత కార్యక్రమాలు చేపడుతున్నారు. మహాత్మ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలను స్మరించుకుంటూ దేశ ప్రజలు వారికి ఘన నివాళులు అర్పిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇల్లు కట్టేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు.. నిపుణులు చెప్పిన సూచనలు!
ఇల్లు కట్టేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు.. నిపుణులు చెప్పిన సూచనలు!
వైద్యరంగంలో గ్లోబల్ భాగస్వామ్యమే కీలకం: నాసిర్ అలీ ఖాన్
వైద్యరంగంలో గ్లోబల్ భాగస్వామ్యమే కీలకం: నాసిర్ అలీ ఖాన్
ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి.. ప్రధాని మోదీ నివాళులు
ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి.. ప్రధాని మోదీ నివాళులు
కలలో మెట్లు ఎక్కుతున్నారా? దిగుతున్నారా? స్వప్న శాస్త్రం చెప్పే..
కలలో మెట్లు ఎక్కుతున్నారా? దిగుతున్నారా? స్వప్న శాస్త్రం చెప్పే..
కీళ్ళ నొప్పులు ఎంతకీ తగ్గడం లేదా? ఇవి తింటే పూర్తిగా మాయం
కీళ్ళ నొప్పులు ఎంతకీ తగ్గడం లేదా? ఇవి తింటే పూర్తిగా మాయం
శంషాబాద్ నుంచి కడప వెళ్తున్న విమానంలో కలకలం..!
శంషాబాద్ నుంచి కడప వెళ్తున్న విమానంలో కలకలం..!
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వెదర్ రిపోర్ట్
ఉడకబెట్టిన గుడ్లు ఎంతసేపు బయట ఉంచవచ్చు? నిపుణుల సూచనలు!
ఉడకబెట్టిన గుడ్లు ఎంతసేపు బయట ఉంచవచ్చు? నిపుణుల సూచనలు!
గుండె వేగం, నిద్ర.. వెల్‌నెస్ బ్యాండ్ ప్రత్యేకతలు ఇవే
గుండె వేగం, నిద్ర.. వెల్‌నెస్ బ్యాండ్ ప్రత్యేకతలు ఇవే
అంకిత భకత్‌, కీర్తి, కుంకుమ్‌ దుమ్మురేపారు.. భారత్‌కు మరో గోల్డ్
అంకిత భకత్‌, కీర్తి, కుంకుమ్‌ దుమ్మురేపారు.. భారత్‌కు మరో గోల్డ్