అరుంధతి రికార్డును బద్దలు కొట్టిన హీరోయిన్ సినిమా.. 16 ఏళ్ల తర్వాత కొత్త చరిత్ర.!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ‘అరుంధతి’ ఒక మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం. గ్రాఫిక్స్, అద్భుతమైన నటన, కథా బలంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాలో జేజమ్మ పాత్రలో అనుష్క శెట్టి నటన అద్భుతమనే చెప్పాలి.

తెలుగు సినిమాల్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చాలా అరుదుగా భారీ వసూళ్లు సాధిస్తుంటాయి. 2009లో వచ్చిన అరుంధతి సినిమా ఇండస్ట్రీలోనే మైలురాయిగా నిలిచింది. అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయం సాధించి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కొత్త మార్కెట్ ఉందని నిరూపించింది. ఈ సినిమా ఇండస్ట్రీలో సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.. అలాగే కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టింది. ఈ సినిమాతో అనుష్క శెట్టి క్రేజ్ పెరిగిపోయింది. ఈ మూవీతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే 2026లో ఆ రికార్డు మరోసారి చర్చకు వచ్చింది. ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా అరుంధతి సినిమాను రికార్డ్‌ను బ్రేక్ చేసింది. ఆ సినిమా మరేదో కాదు.. సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం తక్కువ సమయంలోనే అరుంధతి టోటల్ కలెక్షన్స్ ను కేవలం 12 రోజులకే బీట్ చేసింది.
ఎన్టీఆర్‌తో రెండు సినిమాలు.. కెరీర్ పీక్‌లో ఉండగానే ఆత్మహత్యకు ప్రయత్నించింది.. ఇప్పుడు ఇలా
అరుంధతి సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.70 కోట్ల గ్రాస్ సాధించింది. మా ఇంటి బంగారం మాత్రం విడుదలైన 12వ రోజుకే సుమారు రూ.83.12 కోట్ల ప్రపంచవ్యాప్త గ్రాస్‌ను అందుకున్నట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో సోలో మహిళా ప్రధాన తెలుగు చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగామా ఇంటి బంగారం కొత్త రికార్డు సృష్టించింది. ఇది తెలుగు సినిమాలో మహిళా ప్రధాన కథలకు పెరుగుతున్న మార్కెట్‌పై కూడా చర్చకు దారితీసింది. ఒకప్పుడు హీరోయిన్ ప్రధాన పాత్రలో సినిమా అంటే బడ్జెట్ విషయంలో నిర్మాతలు జాగ్రత్తగా వ్యవహరించేవారు. కానీ ప్రేక్షకుల అభిరుచి మారడంతో కంటెంట్ బలంగా ఉంటే స్టార్ హీరోయిన్‌ను మెయిన్ చేసుకుని సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు.
తండ్రిని చిన్న వయసులోనే కోల్పోయాడు.. డబ్బంతా పోయింది..! కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు
ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. అరుంధతి రికార్డు దాదాపు 16 సంవత్సరాల పాటు నిలిచింది. ఇంతకాలం తర్వాత మరో హీరోయిన్ ప్రధాన చిత్రం దాన్ని అధిగమించడం తెలుగు సినిమా బాక్సాఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ విషయంగా నిలిచింది. ఇప్పటికే చాలా రకాల లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వచ్చాయి. మహిళా ప్రధాన సినిమాల రానున్న రోజుల్లో మరింత పెరగనున్నాయి. మరి మా ఇంటి బంగారం సినిమాను ఏ సినిమా బీట్ చేస్తుందో చూడాలి.
పొట్టకూటికోసం ఆటో నడిపాడు.. ఇప్పుడు తెలుగులో తోపు నటుడు.. ఆయన ఎవరంటే
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




