AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్.. అస్సలు గుర్తుపట్టలేం భయ్యా..! నువ్వే కావాలి హీరోయిన్ ఎంత మారిపోయింది

సినిమా ప్రపంచం అంటే అందమైన కలలు, అద్భుతమైన ఆశలు. కానీ ఈ రంగంలో నిలబడటమే నిజంగా కష్టమే. అనేక మంది ఓవర్‌నైట్ స్టార్ అవుతారు. కానీ ఆ మ్యాజిక్‌ను నిలబెట్టుకోగల వాళ్లే కొద్దిమందే. చాలామంది అందం, టాలెంట్ ఉన్నా, సరైన ఆప్షన్స్ ఎంచుకోలేక కనుమరుగు అవుతూ ఉంటారు.

అమ్మబాబోయ్.. అస్సలు గుర్తుపట్టలేం భయ్యా..! నువ్వే కావాలి హీరోయిన్ ఎంత మారిపోయింది
Actress
Rajeev Rayala
|

Updated on: Sep 30, 2026 | 1:55 PM

Share

టాలీవుడ్‌లో కొన్ని సినిమాలతోనే ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో రీచా పల్లోడ్ కూడా ఒకరు. ఒకప్పుడు తన అందం, అమాయకమైన చిరునవ్వు, సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హీరోయిన్.. ఆ తర్వాత క్రమంగా సినిమాలకు దూరమైంది. దీంతో రీచా పల్లోడ్ ఇప్పుడు ఎలా ఉంది.? ఏం చేస్తోంది.? అంటూ నెటిజన్స్ గూగుల్ లో తెగ గాలిస్తున్నారు. రీచా పల్లోడ్ పేరు వినగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చే సినిమా నువ్వే కావాలి. తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో రీచా పల్లోడ్ తన అందం, నటనతో ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ సినిమా ఆమెకు తెలుగులో మంచి గుర్తింపును తీసుకొచ్చింది. రీచా పల్లోడ్ సినీ ప్రయాణం హీరోయిన్‌గా మొదలైనది కాదు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టింది. 1991లో వచ్చిన హిందీ చిత్రం లమ్హే లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో బాలనటిగా నటిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ పరిచయం సంపాదించుకుంది. అనంతరం హీరోయిన్‌గా మారి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేసింది.

అలాంటి హీరోయిన్‌ మరొకరు ఉండరు.. అందం, గుణం కలబోసిన నటి.. ఆమె కోసమే ఆ సినిమాను 60, 70సార్లు చూశా

హీరోయిన్‌గా రీచా పల్లోడ్‌కు తెలుగులో మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం ‘నువ్వే కావాలి’. తరుణ్‌తో ఆమె జోడీ అప్పట్లో యువతను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా విజయం తర్వాత రీచాకు వరుస అవకాశాలు వచ్చాయి. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ నటిస్తూ తన కెరీర్‌ను కొనసాగించింది. అయితే స్టార్ హీరోయిన్‌గా ఎక్కువ కాలం సినిమాల్లో కొనసాగకుండా.. క్రమంగా వెండితెరకు దూరమైంది. 2000లలో వరుసగా సినిమాల్లో కనిపించిన రీచా పల్లోడ్.. ఆ తర్వాత చాలా అరుదుగా మాత్రమే తెరపై కనిపించింది. ఆమె చివరి తెలుగు సినిమాల్లో మలుపు కూడా ఒకటి. సినిమాలకు దూరమైన తర్వాత రీచా పల్లోడ్ పూర్తిగా తన వ్యక్తిగత జీవితంపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అప్పట్లో కనిపించిన హీరోయిన్‌ లుక్‌తో పోలిస్తే ఇప్పుడు ఆమె రూపంలో సహజమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో, పాత ఇంటర్వ్యూలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు మరోసారి వైరల్ కావడంతో రీచా పల్లోడ్ పేరు నెటిజన్ల మధ్య చర్చకు వచ్చింది.

ఇవి కూడా చదవండి

విరాట్ కోహ్లీ నా బావ.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. షాక్‌లో అభిమానులు

ఆమెకు సంబంధించిన పాత వీడియో ఇంటర్వ్యూలు కూడా ఇటీవల మళ్లీ వెలుగులోకి వచ్చాయి. అందులో తన సినిమా ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను రీచా పంచుకున్నట్లు తెలుస్తోంది. రీచా పల్లోడ్ కెరీర్‌లో సినిమాల సంఖ్య ఎక్కువ కాకపోయినా.. ఆమె నటించిన కొన్ని చిత్రాలు మాత్రం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయ్. ముఖ్యంగా నువ్వే కావాలిలో ఆమె పోషించిన పాత్రను ఇప్పటికీ చాలామంది గుర్తు చేసుకుంటారు. ఒకప్పుడు టాలీవుడ్‌లో యూత్‌ఫుల్ హీరోయిన్‌గా సందడి చేసిన రీచా పల్లోడ్.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు తెలుస్తోంది. ఆమెకు సంబంధించిన తాజా ఫొటోలు, పాత వీడియోలు సోషల్ మీడియాలో కనిపించినప్పుడల్లా అభిమానులు మాత్రం ‘నువ్వే కావాలి’ హీరోయిన్‌ను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.

View this post on Instagram

A post shared by Richa Pallod (@richapallod)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us