AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Song : కుర్రాళ్ల గుండెల్లో గుచ్చుకున్న ప్రేమ పాట.. ఈ సాంగ్ వింటే కన్నీళ్లు ఆగవు..

కాలం మారినా, సంగీతంలో ఎన్నో మార్పులు వచ్చినా.. నిజమైన ఎమోషన్స్ తో రూపొందిన పాటలకు ప్రేక్షకుల హృదయాల్లో ఉండే స్థానం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. అలాంటి పాటలు మన తెలుగులో ఎన్నో ఉన్నాయి. వాటిలో ఈ పాట ఒకటి. ఈ పాట వింటే తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తాయి

Telugu Song : కుర్రాళ్ల గుండెల్లో గుచ్చుకున్న ప్రేమ పాట.. ఈ సాంగ్ వింటే కన్నీళ్లు ఆగవు..
Song
Rajeev Rayala
|

Updated on: Sep 29, 2026 | 9:40 AM

Share

సినిమాలు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోవడానికి కథ, నటీనటుల యాక్టింగ్ కారణం కాదు. కొన్ని సందర్భాల్లో సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తాయి. సినిమా విడుదలై ఎన్ని సంవత్సరాలు గడిచినా.. ఆ పాట వినగానే అప్పటి జ్ఞాపకాలు కళ్లముందు కదలాడుతుంటాయి. ముఖ్యంగా ప్రేమ, విరహం నేపథ్యంలో సాగే పాటలకు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ప్రేమలో ఉన్నప్పుడు వినే పాటలు ఒక రకమైన అనుభూతిని కలిగిస్తే.. ప్రేమను కోల్పోయిన సమయంలో వినే విరహ గీతాలు మరో రకమైన భావోద్వేగాన్ని కలిగిస్తాయి. అందుకే కొన్ని పాటలు వినేటప్పుడు తెలియకుండానే కళ్లలో నీళ్లు తిరుగుతాయి. అలాంటి ఎన్నో అద్భుతమైన పాటల్లో ‘గులాబీ’ సినిమాలోని “ఏ రోజైతే చూశానో నిన్ను.. ఆ రోజే నువ్వైపోయా నేను” పాట కూడా ఒకటి.

అబ్బా..! ఆ సినిమా నేను చేయాల్సింది.. కానీ ఆమెకు వెళ్ళిపోయింది.. చాలా బాధ పడ్డా

1995లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గులాబీ’ సినిమా అప్పట్లో యువతను విశేషంగా ఆకట్టుకుంది. జేడీ చక్రవర్తి, మహేశ్వరి జంటగా నటించిన ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. ప్రేమకథకు యాక్షన్, ఎమోషన్‌ను జోడిస్తూ తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సినిమాలోని పాటలకు కూడా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అందులో ముఖ్యంగా “ఏ రోజైతే చూశానో నిన్ను.. ఆ రోజే నువ్వైపోయా నేను” పాట ప్రత్యేకంగా నిలిచిపోయింది. ప్రియురాలు దూరమైన సందర్భంలో హీరో పడే బాధను, విరహ వేదనను ఈ పాట ఎంతో హృద్యంగా ఆవిష్కరిస్తుంది.

నేను చెప్పాలనుకుంది ఒకటి.. వాళ్లకు అర్ధమైంది ఇంకొకటి..! కయాదు సీన్‌పై డైరెక్టర్ క్లారిటీ.!

హీరోయిన్‌ను విలన్లు కిడ్నాప్ చేసిన తర్వాత కథలో వచ్చే ఈ పాట ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుంది. ప్రేమించిన వ్యక్తి ఒక్కసారిగా దూరమైతే కలిగే బాధను పాటలోని సాహిత్యం, సంగీతం, గానం కలిసి మరింత బలంగా చూపించాయి. ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రేమలోని తీయదనంతో పాటు విరహంలోని బాధను కూడా ఆయన పదాల్లో అద్భుతంగా పలికించారు. పాటలోని ప్రతీ పదం ప్రేమికుడి మనసులోని భావాలను ప్రతిబింబించేలా ఉంటుంది. మరోవైపు శశి ప్రీతమ్ ఈ చిత్రానికి సంగీతం అందించడమే కాకుండా ఈ పాటను స్వయంగా ఆలపించారు. ‘గులాబీ’ సినిమా విడుదలై ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. కొత్త తరహా సంగీతం, కొత్త సినిమాలు వస్తున్నప్పటికీ ఈ సినిమాలోని పాటలకు మాత్రం ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉంది. ముఖ్యంగా ప్రేమ విఫలమైన వారు, తమకు ఇష్టమైన వ్యక్తికి దూరమైన వారు ఈ పాటను వింటే తమ అనుభవాలను గుర్తు చేసుకుంటుంటారు. అందుకే “ఏ రోజైతే చూశానో నిన్ను.. ఆ రోజే నువ్వైపోయా నేను” పాట కేవలం సినిమాలోని ఒక పాటగా మాత్రమే కాకుండా.. ఎంతోమంది ప్రేమికుల భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచిపోయింది. కాలం మారినా, సంగీతంలో ఎన్నో మార్పులు వచ్చినా.. నిజమైన భావోద్వేగంతో రూపొందిన పాటలకు ప్రేక్షకుల హృదయాల్లో ఉండే స్థానం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే.

ఇవి కూడా చదవండి

సినిమా టైటిల్ ఇలా మార్చాల్సిందే.. స్టార్ హీరోకు చుక్కలు చూపించిన శ్రీదేవి.. చివరకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కుర్రాళ్ల గుండెల్లో గుచ్చుకున్న ప్రేమ పాట..
కుర్రాళ్ల గుండెల్లో గుచ్చుకున్న ప్రేమ పాట..
అయ్యో పాపం.. కరెంట్ షాక్‌తో ఆడ చిరుత మృతి! అసలేం జరిగిందంటే..
అయ్యో పాపం.. కరెంట్ షాక్‌తో ఆడ చిరుత మృతి! అసలేం జరిగిందంటే..
భారత్ ఖాతాలో మరో పతకం.. మహిళల ట్రాప్ షూటింగ్‌లో మెరిసిన త్రయం
భారత్ ఖాతాలో మరో పతకం.. మహిళల ట్రాప్ షూటింగ్‌లో మెరిసిన త్రయం
వేడి వేడి అన్నంలోకి.. కారం కారం టమాటా ఉల్లికారం, నోరూరడం గ్యారంటీ
వేడి వేడి అన్నంలోకి.. కారం కారం టమాటా ఉల్లికారం, నోరూరడం గ్యారంటీ
సామాన్యులపై వార్ ఎఫెక్ట్.. పెరగనున్న ఆ వస్తువుల ధరలు..
సామాన్యులపై వార్ ఎఫెక్ట్.. పెరగనున్న ఆ వస్తువుల ధరలు..
వైన్‌ షాప్‌లో దూరిన కోతి.. మందు బాటిల్‌ ఎత్తి దించకుండా తాగేసింది
వైన్‌ షాప్‌లో దూరిన కోతి.. మందు బాటిల్‌ ఎత్తి దించకుండా తాగేసింది
IND vs WI 2nd ODI: రెండో వన్డేలో ఓ మార్పుతో బరిలోకి భారత జట్టు..?
IND vs WI 2nd ODI: రెండో వన్డేలో ఓ మార్పుతో బరిలోకి భారత జట్టు..?
దీపావళికి బంగారం కొంటున్నారా? ఈ తప్పు చేస్తే వేలల్లో నష్టం!
దీపావళికి బంగారం కొంటున్నారా? ఈ తప్పు చేస్తే వేలల్లో నష్టం!
ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా? మీ ఆరోగ్యానికి ముప్పు
ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా? మీ ఆరోగ్యానికి ముప్పు
ది ప్యారడైజ్‌ ఆ స్టార్ నటుడు కూడా ఉన్నడా.!!
ది ప్యారడైజ్‌ ఆ స్టార్ నటుడు కూడా ఉన్నడా.!!