అబ్బా..! ఆ సినిమా నేను చేయాల్సింది.. కానీ ఆమెకు వెళ్ళిపోయింది.. చాలా బాధ పడ్డా
ప్రముఖ నటి మీనా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం మీనా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కాగా ఓ ఇంటర్వ్యూలో మీనా మాట్లాడుతూ.. తన నటనా ప్రస్థానం, తన కెరీర్ ఎంపికలు, బాలీవుడ్ అవకాశాలపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మీనా, తన కెరీర్‌లో కొన్ని గొప్ప అవకాశాలను ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రయాణం మొదలుపెట్టి, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అగ్రతారగా ఎదిగారు. ముఖ్యంగా తెలుగులో ‘సీతారామయ్యగారి మనవరాలు’ వంటి చిత్రాలతో గొప్ప విజయం సాధించి, బిజీగా మారిన తర్వాత, పలు అవకాశాలను వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు మీనా. అందాల భామ మీనా వదులుకున్న చిత్రాలలో అక్కినేని నాగార్జున నటించిన సూపర్ హిట్ చిత్రం ‘నిన్నే పెళ్లాడతా’ ముందు వరుసలో ఉంటుంది. ఆ సినిమా ఛాన్స్ ముందుగా తనకే వచ్చిందని మీనా తెలిపారు.
వామ్మో.. ఆమె ఈమే ఒక్కరేనా..? ప్యారడైజ్‌లో కీలక పాత్ర.. ఈ నటిని బయట చూస్తే ఫిదా అవ్వాల్సిందే.!
నిన్నేపెళ్లాడతా సినిమా కోసం దర్శకుడు కృష్ణవంశీ 60-65 రోజుల డేట్స్ కోరారని, అయితే ఆ సమయంలో తాను వరుస చిత్రాలకు కమిట్ అయి ఉండడంతో, అన్ని రోజులు కేటాయించలేకపోయానని మీనా వివరించారు. “25 రోజుల్లో పూర్తయ్యే సినిమాకి అప్పట్లో 60 రోజులు అడిగారు. అప్పటికే నేను చాలా కమిట్‌మెంట్లలో ఉన్నాను. 15 రోజులు ఇవ్వగలను కానీ, మిగిలిన రోజులు ఇవ్వలేను. ఒకసారి ఒప్పుకున్నాక ఇబ్బందులు పడడం ఎందుకు, చెడ్డపేరు రావడం ఎందుకు అని ఆ సినిమాను వదులుకున్నాను అని మీనా తెలిపారు. తర్వాత సినిమా చూసినప్పుడు ఆ పాత్ర ఎంత బాగుందో అర్థమైందని, మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నందుకు చాలా బాధపడ్డాను అని తెలిపారు మీనా.
వామ్మో.. ఆమె ఈమే ఒక్కరేనా..? ప్యారడైజ్‌లో కీలక పాత్ర.. ఈ నటిని బయట చూస్తే ఫిదా అవ్వాల్సిందే.!
అలాగే రజనీకాంత్‌తో కలిసి నటించే అద్భుతమైన అవకాశం పడయప్ప తెలుగులో నరసింహ రూపంలో మీనాను పలకరించింది. అయితే, ఈ చిత్రంలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్రను మీనా వదులుకోవాల్సి వచ్చింది. నా తల్లి ఆ పాత్ర నాకు సరిపోదని చెప్పారు. అప్పటికే నేను రజనీకాంత్‌తో మంచి జోడీగా పేరుపొందాను, చాలా హోమ్లీ పాత్రలు చేశాను. ‘నీలాంబరి’ పాత్ర చాలా అరోగెంట్, పవర్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి, అది నా ఇమేజ్‌కు సరిపోదని తల్లి భావించారు,” అని మీనా తెలిపారు. ఒక ఆర్టిస్ట్‌గా ఆ విభిన్నమైన పాత్ర చేయాలని తను కోరుకున్నప్పటికీ, తల్లి సలహా మేరకు డైరెక్టర్, హీరో సైతం మళ్లీ ఆలోచించి, సౌందర్య పాత్రను చేయమని అడిగారని, అయితే తాను ఒప్పుకోలేదని చెప్పారు. మీనా ఈ పాత్రను చేసి ఉంటే, దాని స్వభావం కొంత మారేదని, చివరికి క్యారెక్టర్ అంత హార్ష్‌గా ఉండేది కాదని దర్శకుడు చెప్పిన విషయాన్ని మీనా గుర్తు చేసుకున్నారు. ఈ పాత్ర రమ్యకృష్ణకు కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిందని, ‘బాహుబలి’లో రాజమాత శివగామి పాత్రకు కూడా ఇది ఒక పునాది అని మీనా కొనియాడారు. రమ్యకృష్ణకు వెంటనే ఫోన్ చేసి అభినందించినట్లు తెలిపారు.
ఆ హీరో చాలా గొప్పోడు.. స్కూటర్ మీద తిరిగే నాకు కారు కొనిచ్చాడు.. అది ఇప్పటికీ నాతోనే ఉంది
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




