AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను ఏడవడం నా కూతురు చూడలేకపోయింది.. సీనియర్ హీరోయిన్ గౌతమి ఎమోషనల్

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది గౌతమి. తెలుగుతో పాటు దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటించి మెప్పించింది. 90వ దశకంలో టాప్ హీరోలందరి సరసన నటించిన గౌతమి తన అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యే గుర్తింపు తెచ్చుకుంది

నేను ఏడవడం నా కూతురు చూడలేకపోయింది.. సీనియర్ హీరోయిన్ గౌతమి ఎమోషనల్
Gouthami
Rajeev Rayala
|

Updated on: Sep 27, 2026 | 12:18 PM

Share

సినీ నటి గౌతమి మొన్నామధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా నటుడు కమల్ హాసన్‌తో తన బంధం, ఆ బంధం ముగియడానికి దారితీసిన పరిస్థితులు, అలాగే వివాహం పై తన లోతైన అభిప్రాయాలను వెల్లడించారు. గౌతమి, కమల్ హాసన్‌తో తమ అనుబంధం ముగియడానికి ప్రధాన కారణం “గ్రోత్ పాటర్న్స్‌”లో వచ్చిన విభేదాలేనని స్పష్టం చేశారు. “మా గ్రోత్ పాటర్న్స్ వేరే దారిలో వెళ్ళాయి. ఆ డైవర్జెన్స్ ఏమో నేను భరించలేకపోయాను. ఆ కాంప్రమైజ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాతో నేను కాంప్రమైజ్ చేసుకున్నాను అంటే ఇంకా ఎలా బ్రతుకుతాను.? దేనికోసం బ్రతుకుతాను.?” అని ఆమె వివరించారు. తన జీవితంలో రాజీ పడటానికి తాను సిద్ధంగా లేనని, తన సంతోషం, వ్యక్తిగత ఎదుగుదల తనకు అత్యంత ముఖ్యమని గౌతమి చెప్పుకొచ్చారు. తన కుమార్తె సుబ్బలక్ష్మి గురించి మాట్లాడుతూ, తన అన్ హ్యాపీనెస్‌ను సుబ్బలక్ష్మి చూడలేకపోయిందని గౌతమి పేర్కొన్నారు.

సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

సుబ్బలక్ష్మి నా సఫరింగ్ చూసి ఎఫెక్ట్ అయింది. అండ్ అదే నన్ను మళ్ళీ బాగా తరిమింది కూడా. ఎందుకంటే నేను స్టేబుల్ అవ్వాలి. నేను సంతోషంగా, కామ్ గా, పీస్ఫుల్ గా ఉండాలి. అప్పుడే తను కామ్ గా ఉంటుందని నాకు తెలుసు. మేమిద్దరం ఎంత ముడిపడి ఉన్నాం అన్నది నాకు బాగా తెలుసు. సో ఐ హావ్ టు బి హ్యాపీ ఇఫ్ ఐ వాంట్ హర్ టు బీ హ్యాపీ” అని ఆమె తన కుమార్తె తన జీవితంలో ఎంతటి ప్రేరణో వెల్లడించారు. సుబ్బలక్ష్మి చాలా సెన్సిబుల్ చైల్డ్ అని గౌతమి అన్నారు. శృతి హాసన్‌తో తన సంబంధం గురించి ప్రస్తావించినప్పుడు, శృతి, సుబ్బలక్ష్మి మధ్య ఎప్పుడూ ఎలాంటి సమస్యలు లేవని, ప్రస్తుతం పెద్దగా కాంటాక్ట్ లేదని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..! అప్పుడు తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి

వివాహ బంధం పట్ల తన అభిప్రాయాలను పంచుకుంటూ, వివాహం అనేది అంత తొందరగా అంతరించిపోయేది కాదని గౌతమి అన్నారు. “అది ఒక జస్ట్ ఒక సోషల్ అరేంజ్మెంట్ కన్నా ఎక్కువ చాలా ట్రెడిషన్స్ లోనూ, చాలా అందమైన అర్థాలతో ముడిపడి ఉన్నది అది. వివాహం అనేది చాలా చక్కనైన బంధం, ఒక కమిట్‌మెంట్ అని, అయితే ఆ కమిట్‌మెంట్ ఇద్దరి వైపుల నుంచి ఉండాలని ఆమె స్పష్టం చేశారు. కాగితాల మీద సంతకాలు, తాలిబొట్లు, ఉంగరాలు వంటి ఆచారాలు ఉన్నప్పటికీ, మనసులో నిజమైన కమిట్‌మెంట్ లేకపోతే దానికి అర్థం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. అలాంటి పరిస్థితులలో, చట్టబద్ధంగా ముడిపడి ఉన్న సంబంధాలు చాలా వరకు వ్యక్తులను బంధించడానికి, దోపిడీ చేయడానికి ఒక మార్గంగా మారుతాయని, ఇది తన ప్రధాన అభ్యంతరమని గౌతమి తెలిపారు. ఆడవారు, మగవారు ఇద్దరూ ఈ పరిస్థితిలో బాధపడుతున్నారని ఆమె వివరించారు. వివాహం నిజమైన అర్థాన్ని మళ్లీ గుర్తు తెచ్చుకోవాలని, పరస్పర గౌరవం, ప్రేమ, అవగాహనతో కూడిన కమిట్‌మెంట్ అవసరమని ఆమె పేర్కొన్నారు.

స్టార్ హీరోలు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా 460 రోజులు థియేటర్లలో హౌస్‌ఫుల్.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us