AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొట్టకూటికోసం ఆటో నడిపాడు.. ఇప్పుడు తెలుగులో తోపు నటుడు.. ఆయన ఎవరంటే

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగొందుతోన్న వారిలో చాలా మంది గతంలో ఏవేవో ఉద్యోగాలు, పనులు చేసిన వారే. పొట్ట కూటి కోసం, ఫ్యామిలీ కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన వారే. ఈ దక్షిణాది ప్రముఖ నటుడు కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు.

పొట్టకూటికోసం ఆటో నడిపాడు.. ఇప్పుడు తెలుగులో తోపు నటుడు.. ఆయన ఎవరంటే
Tollywood
Rajeev Rayala
|

Updated on: Sep 30, 2026 | 11:11 AM

Share

సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్‌డమ్ అందుకున్న నటులు చాలామందే ఉన్నారు. అయితే కొందరి ప్రయాణం మాత్రం సినిమాల కంటే ఆసక్తికరంగా ఉంటుంది. ఎలాంటి సినీ బ్యాగ్రవుండ్ బ్యాగ్రౌండ్ లేకుండా, చేతిలో పెద్దగా డబ్బు లేకపోయినా కేవలం నటనపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఈ నటుడు ఒకరు. సినిమాలపై చిన్నతనం నుంచే ఆసక్తి పెంచుకున్న ఆయన.. తన కలను నిజం చేసుకోవాలనే పట్టుదలతో టీనేజ్‌లోనే ఇంటి నుంచి బయటకు వచ్చారు. కేవలం 17 ఏళ్ల వయసులో చెన్నైకి చేరుకున్న ఆయనకు అప్పట్లో సినిమా అవకాశాలు వెంటనే దక్కలేదు. జీవనం సాగించేందుకు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ, మరోవైపు నటుడిగా అవకాశం కోసం ప్రయత్నాలు కొనసాగించారు. ఇంతకూ ఆయన ఎవరో తెలుసా.? ఆయన మరెవరో కాదు బోస్ వెంకట్.

అలాంటి హీరోయిన్‌ మరొకరు ఉండరు.. అందం, గుణం కలబోసిన నటి.. ఆమె కోసమే ఆ సినిమాను 60, 70సార్లు చూశా

చెన్నైలో కొత్తగా అడుగుపెట్టిన సమయంలో బోస్ వెంకట్‌కు సినిమా రంగంలో ఎలాంటి పరిచయాలు లేవు. అయినప్పటికీ నటనపై ఉన్న ఆసక్తిని మాత్రం వదులుకోలేదు. పొట్ట కూటికోసం ఆటో నడుపుతూ.. తనకు దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు ప్రయత్నించారు. చాలా కాలం పాటు ఇలాగే కష్టపడిన ఆయనకు మొదట టెలివిజన్‌లో నటించే అవకాశం లభించింది. బుల్లితెరపై తన నటనతో గుర్తింపు తెచ్చుకున్న తర్వాత వెండితెరపై అవకాశాలు రావడం ప్రారంభమైంది. అలా చిన్న పాత్రలతో మొదలైన ఆయన ప్రయాణం క్రమంగా పెద్ద సినిమాలకు చేరింది.

విరాట్ కోహ్లీ నా బావ.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. షాక్‌లో అభిమానులు

2003లో వచ్చిన ‘ఈర నీలం’ చిత్రంతో బోస్ వెంకట్ వెండితెరపై నటుడిగా అడుగుపెట్టారు. ఆ తర్వాత వరుసగా తమిళ సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు. అరసచ్చి, కన్నమ్మ, తలైనగరం, శివాజీ, ధామ్ ధూమ్, సింగం, గో తదితర చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా కథకు కీలకంగా నిలిచే క్యారెక్టర్ రోల్స్, పోలీస్ పాత్రలు, ప్రతినాయక ఛాయలున్న పాత్రల్లోనూ ఆయన మెప్పించారు. దీంతో తమిళ చిత్ర పరిశ్రమలో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన స్థానాన్ని సంపాదించుకున్నారు. బోస్ వెంకట్‌కు తెలుగులోనూ పలు సినిమాల్లో నటించే అవకాశం లభించింది. జైహింద్ 2, మలుపు, అరణ్య వంటి చిత్రాల్లో కనిపించారు. అయితే కార్తీ నటించిన ఖాకీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో ఆయనకు మరింత గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో కార్తీతో కలిసి కనిపించే పోలీస్ అధికారిగా బోస్ వెంకట్ పోషించిన పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్‌లో కూడా ఆయనకు మంచి గుర్తింపు ఏర్పడింది.

ఇవి కూడా చదవండి

నువ్వేమైన పెద్ద హీరోయిన్‌వా.., అందగత్తెవా అంటూ అవమానించారు.. కట్ చేస్తే 150కుపైగా సినిమాలు

Bose Venkat

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us