AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ అడవుల్లో కొత్త అతిథులు.. వెలుగులోకి రెండు అరుదైన బల్లి జాతులు!

తెలంగాణ అంటే కేవలం చారిత్రక సంపద, ప్రకృతి, పులులు, చిరుతలు, జింకలు మాత్రమే కాదు.. మన కళ్లకు కనిపించని ఎన్నో సూక్ష్మ జీవజాతులకు కూడా ఇది నిలయం. ముఖ్యంగా రాళ్ల ప్రాంతాలు, పొడి అడవులు, కొండలు, గుట్టలు.. ఎన్నో ప్రత్యేక జీవులకు ఆవాసాలుగా ఉన్నాయి. తెలంగాణ జీవ వైవిధ్యానికి సంబంధించి రెండు సరికొత్త అధ్యాయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

తెలంగాణ అడవుల్లో కొత్త అతిథులు.. వెలుగులోకి రెండు అరుదైన బల్లి జాతులు!
New Gecko Species
M Revan Reddy
| Edited By: |

Updated on: Oct 02, 2026 | 10:02 AM

Share

తెలంగాణ అంటే కేవలం చారిత్రక సంపద, ప్రకృతి, పులులు, చిరుతలు, జింకలు మాత్రమే కాదు.. మన కళ్లకు కనిపించని ఎన్నో సూక్ష్మ జీవజాతులకు కూడా ఇది నిలయం. ముఖ్యంగా రాళ్ల ప్రాంతాలు, పొడి అడవులు, కొండలు, గుట్టలు.. ఎన్నో ప్రత్యేక జీవులకు ఆవాసాలుగా ఉన్నాయి. తెలంగాణ జీవ వైవిధ్యానికి సంబంధించి రెండు సరికొత్త అధ్యాయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

చారిత్రక సంపద, సాంస్కృతి, కళా నైపుణ్యానికి చిరునామా తెలంగాణ. నల్లగొండ, వరంగల్ జిల్లాల ప్రాంతాలు తెలంగాణా చారిత్రక, సాంస్కృతిక వైభవానికి ప్రధాన కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. చారిత్రక సంపదే కాదు… ఇప్పటివరకు ప్రపంచానికి తెలియని జీవ రహస్యాలు.. వెలుగు చూస్తున్నాయి. తెలంగాణ జీవ వైవిధ్యానికి సంబంధించి రెండు సరికొత్త బల్లి జాతులను శాస్త్రవేత్తలు గుర్తించారు.

నల్లగొండలో రాళ్ల మధ్య దాగిన అరుదైన బల్లిజాతి..

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం వర్ధమాన్ గూడెం, గుంటు మడుగు ప్రాంతాల్లో హైదరాబాద్‌ జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా శాస్త్రవేత్తల బృందం పరిశోధనలను చేపట్టింది. ఈ పరిశోధనల్లో రాళ్ల మధ్య దాగి ఉండే అరుదైన బల్లిజాతిని గుర్తించారు. ఇది రాత్రివేళల్లో మాత్రమే సంచరిస్తుంది. అంటే పగటిపూట రాళ్ల మధ్య దాక్కుని.. చీకటి పడిన తర్వాతే తన ఆహారం కోసం బయటకు వస్తుంది. అరుదైన బల్లికి రాళ్ల కుప్పల మధ్య నివసించే అలవాటు ఉండటంతో.. అదే ప్రత్యేకత ఆధారంగా ఈ జాతికి శాస్త్రీయ నామం హెమిడాక్టైలస్‌ ‘కేర్నికాలా’ అనే పేరు పెట్టారు. గరిష్టంగా 49 మిల్లీమీటర్ల పొడవు ఉండే ఈ బల్లి.. వెనుక భాగంలో ముదురు చుక్కలతో కనిపిస్తుంది. నలుపు రంగు రాళ్ల మధ్య దాదాపు కనిపించకుండా కలిసిపోయేలా దీని శరీర రంగు ఉండటం మరో ప్రత్యేకత.

ఇవి కూడా చదవండి

పాకాల అడవుల్లో మరో కొత్త జాతి..

కాకతీయ కళా వైభవానికి చిరునామా గా ఉన్న వరంగల్ జిల్లా పాకాలలో కూడా హైదరాబాద్‌ జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా శాస్త్రవేత్తల బృందం పరిశోధనలను చేపట్టింది. పాకాల వన్యప్రాణి అభయారణ్యం పరిసరాల్లో మరో అరుదైన బల్లి జాతి సరిసృపాన్ని గుర్తించారు. దీనికి హెమిడాక్టైలస్‌ కోయాఒరమ్‌ అనే శాస్త్రీయ నామాన్ని పెట్టారు. ఈ ప్రాంత అడవులు, కొండలను తరతరాలుగా సంరక్షిస్తున్న కోయ గిరిజన సమాజానికి గౌరవ సూచకంగా ఈ పేరు పెట్టడం విశేషం. ఈ బల్లి గరిష్టంగా 55.6 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. బూడిద రంగు శరీరంపై కనిపించే తెల్లటి పువ్వు ఆకారంలోని నాలుగు ప్రత్యేక మచ్చలు దీని ప్రధాన గుర్తింపు.

ఆరు ఎండెమిక్‌ సరీసృపాలు.. తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు..

ప్రపంచ శాస్త్రీయ పటంలోనూ తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా.. రెండు కొత్త బల్లి జాతులను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రెండు కొత్త జాతుల గుర్తింపుతో తెలంగాణకు మాత్రమే పరిమితమైన ఎండెమిక్‌ సరీసృపాల సంఖ్య ఆరుకు చేరింది. దేశంలోని మరెక్కడా కనిపించకుండా, తెలంగాణ భౌగోళిక పరిధిలోనే ప్రత్యేకంగా కనిపించే సరీసృపాల సంఖ్య మరింత పెరిగింది. ఈ పరిశోధన వివరాలు ఐరోపాకు చెందిన ప్రతిష్టాత్మక యూరోపియన్‌ జర్నల్‌ ఆఫ్‌ టాక్సానమీలో పబ్లిష్ అయ్యాయి. దీంతో ఈ ఆవిష్కరణకు అంతర్జాతీయ శాస్త్రీయ గుర్తింపు లభించింది.

ఒకటి రాళ్ల కుప్పల్లో.. మరొకటి అడవుల్లో..కనిపించడానికి చిన్నవే.. కానీ తెలంగాణ జీవవైవిధ్యానికి మాత్రం పెద్ద గుర్తింపుగా భావించవచ్చు. శాస్త్రవేత్తల అన్వేషణతో వెలుగులోకి వచ్చిన ఈ రెండు కొత్త బల్లులు.. తెలంగాణ ప్రకృతి ఒడిలో ఇంకా ఎన్నో జీవ రహస్యాలు దాగి ఉన్నాయనే సంకేతాన్ని ఇస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
తెలంగాణ అడవుల్లో కొత్త అతిథులు.. వెలుగులోకి అరుదైన బల్లి జాతులు
తెలంగాణ అడవుల్లో కొత్త అతిథులు.. వెలుగులోకి అరుదైన బల్లి జాతులు
ఫ్లైదుబాయ్ విమాన ఘటనపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..!
ఫ్లైదుబాయ్ విమాన ఘటనపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..!
ఫస్ట్ సినిమాకు రూ. 70లక్షలు అందుకుంది..
ఫస్ట్ సినిమాకు రూ. 70లక్షలు అందుకుంది..
ఆగస్టు 15న దేశమంతా సంబరాలు.. గాంధీజీ మాత్రం ఎక్కడ ఉన్నారంటే?
ఆగస్టు 15న దేశమంతా సంబరాలు.. గాంధీజీ మాత్రం ఎక్కడ ఉన్నారంటే?
భూకంపం వస్తే ఇల్లు గాల్లో తేలుతుందా?ఎయిర్ దాన్షిన్ టెక్నాలజీ చూసి
భూకంపం వస్తే ఇల్లు గాల్లో తేలుతుందా?ఎయిర్ దాన్షిన్ టెక్నాలజీ చూసి
శివలింగానికి సజీవ పీతలతో పూజ.. ఈ ఆలయంలో వింత ఆచారం వెనుక పురాణ కథ
శివలింగానికి సజీవ పీతలతో పూజ.. ఈ ఆలయంలో వింత ఆచారం వెనుక పురాణ కథ
రూ. 8 కోట్ల బడ్జెట్ పెడితే ఏకంగా రూ. 84కోట్లకు పైగా రాబట్టింది
రూ. 8 కోట్ల బడ్జెట్ పెడితే ఏకంగా రూ. 84కోట్లకు పైగా రాబట్టింది
రూ.80 వేల బైక్.. రూ.10.30 లక్షల జరిమానా!
రూ.80 వేల బైక్.. రూ.10.30 లక్షల జరిమానా!
దువ్వెనను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? జుట్టు ఆరోగ్యం కోసం
దువ్వెనను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? జుట్టు ఆరోగ్యం కోసం
ఇల్లు కట్టేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు.. నిపుణులు చెప్పిన సూచనలు!
ఇల్లు కట్టేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు.. నిపుణులు చెప్పిన సూచనలు!