AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తక్కువ ఖర్చుతో దృఢమైన ఇల్లు.. నిర్మాణ నిపుణులు చెప్పిన స్మార్ట్ టిప్స్!

సొంత ఇల్లు నిర్మించుకోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెద్ద కల. అయితే, ఇల్లు అందంగా ఉండటమే కాకుండా దశాబ్దాల పాటు దృఢంగా, సురక్షితంగా ఉండటం చాలా అవసరం. నిర్మాణం సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం వహించినా భవిష్యత్తులో సీపేజ్, గోడల్లో పగుళ్లు వంటి సమస్యలు వస్తాయి. నిపుణులు సూచించిన కొన్ని ముఖ్యమైన నిర్మాణ చిట్కాలను ఇక్కడ తెలుసుకుందాం.

తక్కువ ఖర్చుతో దృఢమైన ఇల్లు.. నిర్మాణ నిపుణులు చెప్పిన స్మార్ట్ టిప్స్!
Strong House Construction
Jyothi Gadda
|

Updated on: Oct 02, 2026 | 8:16 AM

Share

సొంతింటి కలను నిజం చేసుకునే క్రమంలో నివాసం దృఢంగా, మన్నికగా నిర్మించుకోవడం ఎంతో ముఖ్యం. నిర్మాణ నిపుణుల సూచనల ప్రకారం, సరైన పునాది నిర్మాణం, నాణ్యమైన సిమెంట్, ఐరన్ వాడకం ఇంటి ఆయుష్షును పెంచుతాయి. బేస్‌మెంట్ నిర్మాణం సరిగ్గా డిజైన్ చేస్తే పునాది బలహీనపడదు. ఫ్రేమ్డ్ స్ట్రక్చర్ లేదా లోడ్-బేరింగ్ స్ట్రక్చర్ ఎంపిక, నాణ్యమైన ఫ్లై యాష్ ఇటుకల వాడకం వల్ల నిర్మాణ ఖర్చులు తగ్గడమే కాకుండా ఇల్లు చాలా ఏళ్ల పాటు బలంగా ఉంటుంది. నిపుణులు చెబుతున్న మరిన్ని సలహాలు సూచనలు ఇప్పుడు చూద్దాం..

బలమైన పునాది, బేస్‌మెంట్ ప్లానింగ్:

ఏ నిర్మాణానికైనా పునాదే అత్యంత కీలకమైనది. భూమి రకాన్ని బట్టి లోతుగా తవ్వి కాంక్రీట్ పునాది వేయాలి. ఇల్లు కట్టేటప్పుడు బేస్‌మెంట్ నిర్మిస్తే పునాది బలహీనపడుతుందేమోననే అనుమానం చాలామందికి ఉంటుంది. కానీ, సరైన రిటైనింగ్ వాళ్ళు, వాటర్ ప్రూఫింగ్ ఉపయోగిస్తే బేస్‌మెంట్ వల్ల పునాదికి ఎలాంటి ప్రమాదం ఉండదు.

నిర్మాణ నమూనా, పదార్థాల ఎంపిక:

సాధారణంగా పిల్లర్లు మరియు బీమ్‌లతో కూడిన ‘ఫ్రేమ్డ్ స్ట్రక్చర్’ వాడతారు. ప్రణాళికాబద్ధమైన రీతిలో లోడ్-బేరింగ్ స్ట్రక్చర్ మరియు ఫ్లై-యాష్ ఇటుకలను ఉపయోగిస్తే ఖర్చు తగ్గడమే కాకుండా గోడలు వేడిని తట్టుకుని బలంగా ఉంటాయి. సిమెంట్, ఐరన్, ఇసుక వంటి ముడిసరుకు నాణ్యతలో ఎలాంటి రాజీ పడకూడదు.

ఇవి కూడా చదవండి

గదుల పరిమాణం, వాస్తు ప్లాన్:

బెడ్‌రూమ్, హాల్, కిచెన్, గెస్ట్ రూమ్‌ల పరిమాణం ఆధునిక అవసరాలకు తగినట్లుగా ప్లాన్ చేయాలి. కిటికీలు, తలుపుల అమరిక ద్వారా ఇంటికి ధారాళంగా గాలి, వెలుతురు వచ్చేలా చూడాలి. ఇది ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచడమే కాకుండా తేమ సమస్యలను నివారిస్తుంది.

వాటర్ ప్రూఫింగ్, క్యూరింగ్:

గోడలు, స్లాబ్ వేసిన తర్వాత క్యూరింగ్ సరిగ్గా చేయాలి. బాత్‌రూమ్‌లు, టెర్రస్ భాగాలలో నాణ్యమైన వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ వేయించడం వల్ల భవిష్యత్తులో నీటి లీకేజీ సమస్యలు రావు. ఇంటి నిర్మాణం ప్రారంభించే ముందే అనుభవజ్ఞులైన సివిల్ ఇంజనీర్ లేదా ఆర్కిటెక్ట్ సలహా తీసుకోవడం చాలా శ్రేయస్కరం. సరైన ప్రణాళిక, నాణ్యమైన మెటీరియల్స్, క్రమశిక్షణతో కూడిన పర్యవేక్షణ ద్వారానే మీ డ్రీమ్ హోమ్ అనేక సంవత్సరాల పాటు దృఢంగా నిలిచి ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us