AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భూకంపం వస్తే ఇల్లు గాల్లో తేలుతుందా? ఎయిర్ దాన్షిన్ టెక్నాలజీ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

భూకంపాలు ఎక్కువగా వచ్చే జపాన్, విపత్తుల నుంచి ఇళ్లను కాపాడుకోవడానికి ఎయిర్ దాన్షిన్ అనే వినూత్న సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. ఈ టెక్నాలజీ ద్వారా భూకంపం వచ్చిన క్షణాల్లోనే ఇల్లు నేల నుంచి గాలిలోకి తేలుతుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా సోషల్ మీడియా వేదికగా దీనికి సంబంధించిన వివరాలను పంచుకోవడంతో ఇది వైరల్‌గా మారింది.

భూకంపం వస్తే ఇల్లు గాల్లో తేలుతుందా? ఎయిర్ దాన్షిన్ టెక్నాలజీ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Japan Floating House
Jyothi Gadda
|

Updated on: Oct 02, 2026 | 9:08 AM

Share

జపాన్ దేశం తరచూ తీవ్రమైన భూకంపాలను ఎదుర్కొంటుంటుంది. అయితే ప్రకృతి విపత్తులను ఆపలేకపోయినా, వాటి నుంచి ఆస్తి, ప్రాణ నష్టాలను తగ్గించడానికి జపాన్ ఇంజనీర్లు నిరంతరం కొత్త సాంకేతికతలను ఆవిష్కరిస్తున్నారు. అందులో భాగంగానే ఎయిర్ దాన్షిన్ సిస్టమ్స్ ఇన్స్ (Air Danshin Systems Inc) అనే సంస్థ ఒక వినూత్నమైన ఫ్లోటింగ్ హౌస్ (గాలిలో తేలే ఇల్లు) టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఈ సాంకేతికతకు సంబంధించిన ఫోటోలు, వివరాలను సోషల్ మీడియా వేదిక X లో షేర్ చేయడంతో ఇది ప్రపంచవ్యాప్తంగా విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ ఫ్లోటింగ్ హౌస్ సాంకేతికత ఎలా పనిచేస్తుంది?

ఈ వినూత్న నిర్మాణంలో భవనం కింద ప్రత్యేకమైన ఎయిర్ ఛాంబర్ అత్యంత సున్నితమైన సీస్మిక్ సెన్సార్లు ఉంటాయి. భూమి లోపల ప్రకంపనాలు లేదా భూకంప సంకేతాలు ప్రారంభం కాగానే, ఈ సెన్సార్లు కేవలం 0.5 నుండి 1 సెకను వ్యవధిలోనే ప్రమాదాన్ని గుర్తిస్తాయి. వెంటనే ఎయిర్ కంప్రెసర్ ఆన్ అయి ఇంటి కింద ఉన్న బ్యాగ్‌లోకి వేగంగా గాలిని నింపుతుంది.

గాలిలో తేలడం వల్ల కలిగే ప్రయోజనం:

గాలి నిండటం వల్ల ఇల్లు నేల నుంచి దాదాపు 3 సెంటీమీటర్ల ఎత్తుకు పైకి లేస్తుంది. దీనివల్ల భూకంపం వల్ల నేలలో వచ్చే తీవ్రమైన వణుకు లేదా ప్రకంపనాలు నేరుగా ఇంటి పునాదులకు తాకవు. భూకంపం ముగిసే వరకు ఇల్లు గాలి కుషన్ పై తేలుతూనే ఉంటుంది. ప్రకంపనాలు తగ్గిన తర్వాత గాలి నెమ్మదిగా బయటకు పోయి ఇల్లు సురక్షితంగా మళ్లీ దాని పాత స్థానంలోకి చేరుకుంటుంది.

ఇవి కూడా చదవండి

తక్కువ ఖర్చు, విద్యుత్ బ్యాకప్:

షోఇచి సకామోటో అనే నిపుణుడు రూపొందించిన ఈ సిస్టమ్, సాంప్రదాయ భూకంప నిరోధక పద్ధతులతో పోలిస్తే మూడో వంతు ఖర్చులోనే పూర్తవుతుంది. అంతేకాకుండా, భూకంప సమయాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినా ఈ వ్యవస్థ పనిచేసేందుకు వీలుగా శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌ను కూడా ఏర్పాటు చేశారు.

విజయవంతమైన పరీక్షలు:

జపాన్‌లో ఇప్పటికే దాదాపు 90 ఇళ్లలో ఈ సిస్టమ్‌ను విజయవంతంగా అమర్చారు. ఒక ప్రత్యక్ష పరీక్షలో, ఇంట్లో గాజు గ్లాసులు, టేబుళ్లు ఉంచి కృత్రిమంగా తీవ్రమైన భూకంప ప్రకంపనాలు సృష్టించినప్పటికీ, ఇల్లు గాలిలోకి లేవడంతో లోపల ఉన్న వస్తువులు కింద పడకుండా సురక్షితంగా ఉన్నాయి.

విపత్తుల మేనేజ్‌మెంట్‌లో జపాన్ సాంకేతికత ప్రపంచానికి నిరంతరం మార్గదర్శకంగా నిలుస్తోంది. భవిష్యత్తులో భూకంప ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఈ ఎయిర్ దాన్షిన్ సాంకేతికత ప్రాణ మరియు ఆస్తి నష్టాన్ని నివారించడంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us