విజయవాడలోని చిట్టినగర్‌లో అన్నదాన కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. వేడి సాంబార్‌ను తరలిస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడిన ఓ మహిళ తీవ్ర గాయాలపాలయ్యారు. రెండు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడి చివరకు కన్నుమూశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.