దూసుకొస్తున్న వాయుగుండం.. దంచికొట్టనున్న వర్షాలు
ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈ నెల 22, 23 తేదీల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మూడు రోజుల తర్వాత తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. ఇది మరింత బలపడి ఈ నెల 22న తీవ్ర వాయుగుండంగా మారి, 23న ఉత్తర కోస్తా-దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది. అల్పపీడనం ప్రభావంతో సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు, తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు సూచించారు.
మరిన్ని వీడియోల కోసం :
డిసెంబర్ రేసులో మరో మూవీ.. హీట్ పెంచుతున్న స్టార్స్
అజిత్ రేసింగ్ జర్నీ డాక్యుమెంటరీ గ్లాడియేటర్స్ ట్రైలర్ రివ్యూ
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు

