AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డ్రోన్ల హోరు… క్షిపణుల జోరు.. మారుతున్న ఆధునిక యుద్ధ తంత్రం.. ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం!

ఆధునిక యుద్ధ తంత్రం డ్రోన్లు, క్షిపణులతో రూపుదిద్దుకుంటుంది. రష్యా-ఉక్రెయిన్, యెమెన్‌లో హౌతీ దాడులు దీనికి నిదర్శనం. ఈ పోరాటాలు ఎర్ర సముద్ర వాణిజ్యం, చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. సామాన్యుడిపై భారం, సరఫరా గొలుసు అంతరాయాలు, భారత్‌పై పరిణామాలు వంటి అంశాలు ప్రస్తుత యుద్ధాల నూతన కోణాన్ని తెలియజేస్తున్నాయి.

డ్రోన్ల హోరు... క్షిపణుల జోరు.. మారుతున్న ఆధునిక యుద్ధ తంత్రం.. ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం!
Modern WarfareImage Credit source: AI Image
Siva Nagaraju
| Edited By: |

Updated on: Sep 21, 2026 | 9:22 PM

Share

ఒకచోట సముద్రం మీద పోరు సాగుతోంది. మరోచోట నేల మీద ఘర్షణ నడుస్తోంది. ఒక వైపు యెమెన్‌లో హౌతీల దాడులు. మరో వైపు రష్యా–ఉక్రెయిన్ మధ్య క్షిపణులు, డ్రోన్ల మోత. కారణాలు వేరు. నేపథ్యాలు వేరు. కానీ పోరాటం సాగుతున్న తీరు మాత్రం చాలావరకు ఒకేలా ఉంది. ఆకాశంలో డ్రోన్లు. దూరం నుంచి క్షిపణులు. వాటిని అడ్డుకునే రాడార్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు. చమురు కేంద్రాలు, విద్యుత్ కేంద్రాలు, పోర్టులు, రవాణా మార్గాలు కూడా లక్ష్యాలుగా మారుతున్నాయి. ఒక దేశంలో మొదలైన పోరు మరో దేశానికీ ప్రభావం చూపుతోంది. చమురు ధరల నుంచి నౌకల రవాణా వరకు, సరుకుల ధరల నుంచి సామాన్యుడి ఖర్చుల వరకు దాని ప్రభావం కనిపిస్తోంది. యుద్ధం మొదలైతే మంట సరిహద్దులో పడుతుంది. దాని పొగ మాత్రం ప్రపంచం మొత్తం కనిపిస్తుంది. యెమెన్‌లో హౌతీల పోరు యెమెన్‌లో గొడవ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. హౌతీలు 2014లో రాజధాని సనాను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 2015లో సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి యెమెన్‌లో జోక్యం చేసుకుంది. ఈ పోరులో ఇరాన్–సౌదీ మధ్య ప్రాంతీయ పోటీ కూడా ప్రభావం చూపింది. 2022లో కాల్పుల విరమణతో కొంతకాలం పరిస్థితి చల్లబడినా సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. ఇప్పుడు మళ్లీ ఉద్రిక్తత పెరిగింది. హౌతీలు డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తున్నారు. సౌదీ వైమానిక రక్షణతో వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఇజ్రాయెల్–గాజా యుద్ధం తర్వాత హౌతీల దాడులు...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి