AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటర్ పాసైన వారికి గుడ్‌న్యూస్.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగ అవకాశం! డిసెంబర్ 2 నుంచి దరఖాస్తులు

UPSC NDA 1 2027 Notification: UPSC NDA 1 2027 Notification: దేశ రక్షణ రంగంలో కెరీర్‌ ప్రారంభించాలని కలలు కంటున్న యువతకు UPSC శుభవార్త అందించింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), ఇండియన్ నేవల్ అకాడమీ (INA)లో ప్రవేశాల కోసం NDA 1 2027 షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 2 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం కానుండగా, ఏప్రిల్ 11, 2027న రాత పరీక్ష నిర్వహించనున్నారు. అర్హతలు, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీల పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ఇంటర్ పాసైన వారికి గుడ్‌న్యూస్.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగ అవకాశం! డిసెంబర్ 2 నుంచి దరఖాస్తులు
UPSC NDA 1 Notification Released
Srilakshmi C
|

Updated on: Nov 24, 2026 | 7:07 AM

Share

దేశ రక్షణ రంగంలో ఉద్యోగం సాధించాలని కలలు కంటున్న యువతకు శుభవార్త. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), ఇండియన్ నేవల్ అకాడమీ (INA)లో ప్రవేశాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) NDA 1 2027 షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో శిక్షణ పొందేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నారు. ఇంటర్మీడియట్ అర్హత ఉన్న అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. UPSC విడుదల చేసిన షార్ట్ నోటిఫికేషన్ ప్రకారం 2026 డిసెంబర్ 2 నుంచి పూర్తి స్థాయి నోటిఫికేషన్‌తో పాటు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 22, 2026లోగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

యూపీఎస్సీ NDA ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విద్యార్హతలు ఏమిటి?

NDAలోని ఆర్మీ విభాగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి లేదా ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతూ ఉండాలి. నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాలతో పాటు ఇండియన్ నేవల్ అకాడమీ ప్రవేశాలకు మాత్రం ఇంటర్మీడియట్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ (MPC) సబ్జెక్టులు చదివి ఉండాలి. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఇవి కూడా చదవండి

దరఖాస్తు ఫీజు ఎంత?

  • జనరల్ అభ్యర్థులు: రూ.100
  • ఓబీసీ అభ్యర్థులు: రూ.100
  • ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు: రూ.100
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు: ఫీజు మినహాయింపు
  • మహిళా అభ్యర్థులు: ఫీజు మినహాయింపు

ఎంపిక ప్రక్రియ ఇలా..

అభ్యర్థులను మూడు దశల్లో ఎంపిక చేస్తారు.

  • రాత పరీక్ష: మొత్తం 900 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
  • SSB ఇంటర్వ్యూ: రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు 900 మార్కులకు సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (SSB) ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  • వైద్య పరీక్షలు: ఇంటర్వ్యూలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్దేశిత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని దశల్లో అర్హత సాధించిన వారికి మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

ముఖ్యమైన తేదీలు ఇవే

  • షార్ట్ నోటిఫికేషన్ విడుదల: నవంబర్ 2026
  • పూర్తి నోటిఫికేషన్, దరఖాస్తుల ప్రారంభం: డిసెంబర్ 2, 2026
  • దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 22, 2026
  • రాత పరీక్ష తేదీ: ఏప్రిల్ 11, 2027

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

అర్హత ఉన్న అభ్యర్థులు UPSC అధికారిక ఆన్‌లైన్ దరఖాస్తు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దేశ రక్షణ రంగంలో కెరీర్ ప్రారంభించాలని ఆశించే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇది మంచి అవకాశం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అందులోని వయోపరిమితి, అర్హతలు, పరీక్షా విధానం, ఇతర నిబంధనలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి.

యూపీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us