AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: థియేటర్లలో భోగి.. ఓటీటీల్లో దృశ్యం 3 టు హనుమాన్ అంశ్.. 21కు పైగా కొత్త సినిమాలు స్ట్రీమింగ్

ఈ వారం ఓటీటీల్లో దాదాపు 20కు పైగా కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కు రానున్నాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేయనున్నాయి. వీటిలో దృశ్యం 3, హనుమాన్ అంశ్ సినిమాలు కాస్త ఆసక్తిని కలిగిస్తున్నాయి.

OTT Movies: థియేటర్లలో భోగి.. ఓటీటీల్లో దృశ్యం 3 టు హనుమాన్ అంశ్.. 21కు పైగా కొత్త సినిమాలు స్ట్రీమింగ్
OTT Movies
Basha Shek
|

Updated on: Nov 24, 2026 | 6:58 AM

Share

గత వారం థియేటర్లలో రిలీజైన ఆకాశంలో ఒకతార, ఈఎన్‌ఈ రిపీట్ సినిమాలు సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతున్నాయి. అలా ఈ వారం కూడా పలు సినిమాలు రిలీజ్‌కు రెడీ అయిపోయాయి. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న శర్వానంద్- సంపత్ నందిల సినిమా భోగి ఈ వారమే ఆడియన్స్‌ను అలరించేందుకు వచ్చేస్తోంది. ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో పాటు హే కన్నమ్మ, హై, డేంజర్ బాయ్స్, ది మేజ్, పూలే లాంటి చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ వారంలో బోలెడ్ చిత్రాలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. ఈ వీక్‌లో ప్రధానంగా ‍అజయ్ దేవగణ్ దృశ్యం-3 ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. హిందీలో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్‌ క్రియేట్ చేసిన హనుమాన్ అంశ్‌ కూడా ఈ వారంలోనే ఓటీటీకి రానుంది. ఈ రెండు సినిమాలతో పాటు వెంకీ ఆదర్శకుటుంబం కూడా స్ట్రీమింగ్‌కు వచ్చే ఛాన్స్‌ ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీంతో పాటు పలు బాలీవుడ్‌, హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి నవంబర్ ఆఖరి వారంలో ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.

నెట్‌ఫ్లిక్స్

  • ది ట్రయల్స్ ఆఫ్ కరెన్ రీడ్(హాలీవుడ్ సినిమా)- నవంబర్ 23
  • రోల్ లోవే- ది అవుట్‌సైడర్(హాలీవుడ్ మూవీ)- నవంబర్ 24
  • ది మస్కిటో బౌల్-(హాలీవుడ్ సినిమా)- నవంబర్ 25
  • స్పైడర్ మ్యాన్- బ్రాండ్ న్యూ డే(హాలీవుడ్ మూవీ)- నవంబర్ 26
  • ఆల్వేస్ ఆన్ కాల్(హాలీవుడ్ సినిమా)- నవంబర్ 26
  • ఫూల్ నైట్(జపనీస్ సినిమా)- నవంబర్ 26
  • ది హంటింగ్ వైవ్స్-సీజన్ 2-(హాలీవుడ్ వెబ్ సిరీస్)- నవంబర్ 26
  • టూస్- ది వాన్‌డెర్ వాక్ కిడ్నాపింగ్(హాలీవుడ్ సినిమా)-నవంబర్ 26
  • టైసన్ ఫ్యూరీ(డాక్యుమెంటరీ చిత్రం)- నవంబర్ 27
  • ది చైల్డ్(హాలీవుడ్ మూవీ)- నవంబర్ 27
  • దృశ్యం-3(హిందీ మూవీ)- నవంబర్ 27
  • ది హంచ్‌బ్యాక్ సోల్ ఆఫ్ ప్యారిస్(ఫ్రెంచ్‌ మూవీ)- నవంబర్ 27
  • ఆదర్శ కుటుంబం- తెలుగు సినిమా (ఇంకా అధికారిక ప్రకటన రాలేదు)
ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • క్లాషింగ్ త్రూ ది స్నో (హాలీవుడ్ మూవీ)- నవంబర్ 23
  • బ్లేడ్ రన్నర్‌ 2099 (హాలీవుడ్ మూవీ)- నవంబర్ 25
  • నైన్ టూ సిక్స్ (కొరియన్ మూవీ)- నవంబర్ 25

సోని లివ్

  • హనుమాన్ అంశ్(బాలీవుడ్ సినిమా)- నవంబర్ 27

జియోహాట్‌స్టార్

  • ది డిగ్-(హాలీవుడ్ సిరీస్)- నవంబర్ 25
  • స్వీట్ పీ-సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- నవంబర్ 26
  • ది స్లైయెస్ట్ టచ్(డాక్యుమెంటరీ సిరీస్)- నవంబర్ 26
  • దాయి చాల్(హిందీ వెబ్ సిరీస్)- నవంబర్ 27

ఆపిల్ టీవీ ప్లస్

  • వే ఆఫ్‌ ది వారియర్ కిడ్-(హాలీవుడ్ మూవీ)- నవంబర్ 25

Note: ఇవి కాక వారం  కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ లను ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us