AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జుట్టు రాలడం ఆగి.. ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే ఈ ఆయుర్వేద నూనె వాడండి!

పొడవైన, దృఢమైన జుట్టును కోరుకునేవారు ఖరీదైన షాంపూలు, రసాయన ఉత్పత్తులకు బదులుగా సహజ ఆయుర్వేద పదార్థాలతో ఇంట్లోనే హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు. ప్రముఖ ఆయుర్వేద న్యూట్రిషనిస్ట్ సూచించిన ఈ నూనె జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఈ పవర్‌ హెయిర్‌ ఆయిల్‌ తయారీకి కావాల్సిన పదార్థాలు, ఉపయోగాలేంటో ఇప్పుడు చూద్దాం..

జుట్టు రాలడం ఆగి.. ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే ఈ ఆయుర్వేద నూనె వాడండి!
Ayurvedic Hair Oil
Jyothi Gadda
|

Updated on: Nov 27, 2026 | 12:20 PM

Share

పొడవైన, ఒత్తైన, ఆరోగ్యకరమైన జుట్టు కోసం ప్రముఖ ఆయుర్వేద న్యూట్రిషనిస్ట్ ఒక ప్రత్యేకమైన హెయిర్ గ్రోత్ ఆయిల్ తయారీ విధానాన్ని సూచించారు. నువ్వుల నూనెలో ఉసిరి పొడి, బ్రాహ్మి పొడి, భృంగరాజ్ పొడి, మందార పువ్వులు, మెంతులు, మిరియాలు, రోజ్‌మేరీ ఆకులు కలిపి తక్కువ మంటపై మరిగించి రాత్రంతా ఉంచి వడకట్టాలి. ఈ నూనెను వారానికి 2–3 సార్లు జుట్టు కుదుళ్లకు పట్టించి మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి, కుదుళ్లు బలపడి, జుట్టు పొడవుగా పెరగడానికి తోడ్పడుతుంది. మరింత వివరంగా తెలియాలంటే..

ఈ నూెనె తయారీకి కావలసిన పదార్థాలు

నువ్వుల నూనె: 100 మి.లీ.

ఉసిరి పొడి: 1 టీస్పూన్

ఇవి కూడా చదవండి

బ్రాహ్మి పొడి: 1 టీస్పూన్

భృంగరాజ్ పొడి: 1 టీస్పూన్

మందార పువ్వులు (తాజావి లేదా ఎండినవి): అర కప్పు

మెంతులు: 1 టీస్పూన్

మిరియాలు: 1 టీస్పూన్

రోజ్‌మేరీ ఆకులు: 1 టీస్పూన్

తయారీ విధానం

ఒక పాత్రలో 100 మి.లీ. నువ్వుల నూనె తీసుకుని అందులో ఉసిరి, బ్రాహ్మి, భృంగరాజ్ పొడులు వేయాలి. అనంతరం మందార పువ్వులు, మెంతులు, మిరియాలు, రోజ్‌మేరీ ఆకులు కూడా కలపాలి. ఈ పాత్రను స్టవ్ మీద పెట్టి తక్కువ మంటపై 15 నుంచి 20 నిమిషాలు మధ్యమధ్యలో కలుపుతూ వేడి చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నూనెను రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం వడకట్టి శుభ్రమైన, పొడి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.

వాడే విధానం, ప్రయోజనాలు

వాడే పద్ధతి: ఈ నూనెను వారానికి 2 నుంచి 3 సార్లు జుట్టు కుదుళ్లకు పట్టించి వేళ్లతో సున్నితంగా మసాజ్ చేయాలి. 30 నిమిషాల నుంచి గంట సేపు ఉంచిన తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.

పోషక గుణాలు: ఉసిరిలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కుదుళ్లకు బలాన్నిస్తాయి. బ్రాహ్మి, భృంగరాజ్ తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. మందార పువ్వులు జుట్టును మృదువుగా ఉంచుతాయి. మెంతుల్లోని ప్రోటీన్ జుట్టుకు లోపలి నుంచి పోషణ అందిస్తుంది. రోజ్‌మేరీ ఆకులు రక్త ప్రసరణను మెరుగుపరచి చుండ్రును తగ్గించడంలో, జుట్టు పెరుగుదలలో సహాయపడతాయి.

ప్రతి ఒక్కరి చర్మ స్వభావం వేరుగా ఉంటుంది కాబట్టి ఈ నూనెను తలకు రాసే ముందు తప్పనిసరిగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మరోసారి వివాదంలో గంభీర్ శిష్యుడు.. తోటి ఆటగాడిపై బూతులు వర్షం..?
మరోసారి వివాదంలో గంభీర్ శిష్యుడు.. తోటి ఆటగాడిపై బూతులు వర్షం..?
జుట్టు రాలడం ఆగి.. ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే ఈ ఆయుర్వేద నూనె
జుట్టు రాలడం ఆగి.. ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే ఈ ఆయుర్వేద నూనె
ఉగ్రవాదుల చేతిలో AI.. ప్రపంచ భద్రతపై భారత్ ఆందోళన
ఉగ్రవాదుల చేతిలో AI.. ప్రపంచ భద్రతపై భారత్ ఆందోళన
. డయాబెటిస్ వల్ల చచ్చుబడ్డ నరాల్లో బలాన్ని పెంచే ప్రోటీన్ ఫుడ్..
. డయాబెటిస్ వల్ల చచ్చుబడ్డ నరాల్లో బలాన్ని పెంచే ప్రోటీన్ ఫుడ్..
కేవలం రూ.365 చెల్లిస్తే చాలు.. భారత్ నుంచి నేపాల్‌కు జర్నీ..
కేవలం రూ.365 చెల్లిస్తే చాలు.. భారత్ నుంచి నేపాల్‌కు జర్నీ..
37 బంతుల్లోనే సెంచరీ బాదిన లేడీ కోహ్లీ..!
37 బంతుల్లోనే సెంచరీ బాదిన లేడీ కోహ్లీ..!
తొందరపడితే నష్టమే.. ఓపిక విలువను తెలియజేసే గొంగళి పురుగు నీతి కథ!
తొందరపడితే నష్టమే.. ఓపిక విలువను తెలియజేసే గొంగళి పురుగు నీతి కథ!
కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలా? రైస్ వాటర్‌తో ఈ చిట్కా పాటించండి!
కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలా? రైస్ వాటర్‌తో ఈ చిట్కా పాటించండి!
వివాహిత ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్ పరిచయం! అసలు ఏం జరిగిందంటే!
వివాహిత ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్ పరిచయం! అసలు ఏం జరిగిందంటే!
తియ్యగా ఏదైనా తినాలనిపిస్తోందా? ఈ జెల్లీ తాలికలు చేసేయండి
తియ్యగా ఏదైనా తినాలనిపిస్తోందా? ఈ జెల్లీ తాలికలు చేసేయండి
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే