AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: 100 మైళ్ల స్పీడ్‌ను లెక్క చేయలే.. 37 బంతుల్లోనే సెంచరీ బాదిన లేడీ కోహ్లీ..!

Smriti Mandhana 37 Ball Century: టీమిండియా మహిళల కెప్టెన్ స్మృతి మంధాన అద్భుత బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. కెవిన్ పీటర్సన్ నిర్వహించిన ప్రత్యేక బ్యాటింగ్ ఛాలెంజ్‌లో కేవలం 37 బంతుల్లోనే సెంచరీ సాధించింది. బంతుల వేగం గంటకు 100 మైళ్లకు చేరుకున్నా తన బ్యాటింగ్ జోరు తగ్గించలేదు.

Video: 100 మైళ్ల స్పీడ్‌ను లెక్క చేయలే.. 37 బంతుల్లోనే సెంచరీ బాదిన లేడీ కోహ్లీ..!
Smriti Mandhana 37 Ball Century
Venkata Chari
|

Updated on: Nov 27, 2026 | 11:59 AM

Share

Smriti Mandhana 37 Ball Century: టీమిండియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ స్మృతి మంధాన తన బ్యాటింగ్‌తో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ నిర్వహించిన ప్రత్యేక బ్యాటింగ్ ఛాలెంజ్‌లో కేవలం 37 బంతుల్లోనే సెంచరీ బాదేసింది. బంతుల వేగం క్రమంగా పెరుగుతున్నా.. ఏమాత్రం తడబడకుండా బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడింది. దీంతో పీటర్సన్ సైతం ఆమె బ్యాటింగ్‌కు ఫిదా అయ్యాడు.

37 బంతుల్లోనే సెంచరీ.. స్మృతి మంధాన సెన్సేషన్..

కెవిన్ పీటర్సన్ తన యూట్యూబ్ ఛానెల్ ‘ది స్విచ్’లో క్రికెటర్ల కోసం ప్రత్యేక బ్యాటింగ్ ఛాలెంజ్ నిర్వహిస్తున్నాడు. ఇందులో భాగంగా స్మృతి మంధాన పాల్గొంది. ఈ ఛాలెంజ్‌లో 50 బంతుల్లో 100 పరుగులు చేయాల్సి ఉంటుంది.

అయితే ఇందులో ఓ ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. మొదటి బంతి గంటకు 51 మైళ్ల వేగంతో వస్తుంది. ఆ తర్వాత ప్రతి బంతికి వేగం ఒక మైలు చొప్పున పెరుగుతుంది. అంటే 50వ బంతికి బౌలింగ్ వేగం గంటకు 100 మైళ్లకు చేరుకుంటుంది.

ఇంత కఠినమైన ఛాలెంజ్‌లో స్మృతి అద్భుతంగా ఆడింది. కేవలం 37 బంతుల్లోనే 100 పరుగుల మార్కును అందుకుంది. బంతుల వేగం పెరుగుతున్న కొద్దీ ఆమె బ్యాటింగ్‌లో మాత్రం ఎలాంటి తడబాటు కనిపించలేదు. అద్భుతమైన టైమింగ్, పవర్ హిట్టింగ్, ప్లేస్‌మెంట్‌తో బౌలర్లకు చుక్కలు చూపించింది.

ఇప్పటికే ఈ ఛాలెంజ్‌లో వైభవ్ సూర్యవంశీ, శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్ వంటి క్రికెటర్లు పాల్గొన్నారు. తాజాగా స్మృతి మంధాన కూడా తనదైన శైలిలో అదరగొట్టింది.

సౌతాఫ్రికా పర్యటనకు సిద్ధమవుతున్న స్మృతి..

ప్రస్తుతం స్మృతి మంధాన సీనియర్ ఉమెన్స్ ఇంటర్-జోనల్ టీ20 టోర్నమెంట్ 2026లో వెస్ట్ జోన్ తరఫున ఆడుతోంది. సౌతాఫ్రికా పర్యటనకు ముందు భారత క్రికెటర్లకు ఈ టోర్నీ మంచి ప్రాక్టీస్‌గా ఉపయోగపడుతోంది.

ఈ టోర్నీలో స్మృతి ఆరంభం మిశ్రమంగా ఉంది. రెండు ఇన్నింగ్స్‌లలో 18.50 సగటుతో 37 పరుగులు చేసింది. ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 బంతుల్లో 37 పరుగులు చేయగా.. సౌత్ జోన్‌తో మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే ఔటైంది.

అంతకుముందు సీనియర్ ఉమెన్స్ టీ20 ట్రోఫీలో మూడు మ్యాచ్‌లు ఆడి 41.67 సగటుతో 125 పరుగులు సాధించింది. 135.87 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి మంచి ఫామ్ కనబరిచింది.

డిసెంబర్‌లో సౌతాఫ్రికాతో టీమిండియా సిరీస్..

డిసెంబర్‌లో జరగనున్న సౌతాఫ్రికా పర్యటన స్మృతి మంధానకు కీలకం కానుంది. ఈ పర్యటన కోసం భారత జట్టులో మూడు ఫార్మాట్లలోనూ ఆమెకు చోటు దక్కింది. టెస్టు, వన్డే సిరీస్‌లలో భారత జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు కూడా చేపట్టనుంది.

ఈ పర్యటన డిసెంబర్ 9న గ్కెబెర్హాలో జరిగే ఏకైక టెస్టుతో ప్రారంభం కానుంది. అనంతరం మూడు వన్డేలు, మూడు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగనున్నాయి.

– డిసెంబర్ 9: ఏకైక టెస్టు మ్యాచ్

– డిసెంబర్ 16: వన్డే సిరీస్ ప్రారంభం

– డిసెంబర్ 30: చివరి టీ20 మ్యాచ్

కెవిన్ పీటర్సన్ ఛాలెంజ్‌లో 37 బంతుల్లో సెంచరీతో అదరగొట్టిన స్మృతి.. ఇప్పుడు సౌతాఫ్రికా పర్యటనలోనూ ఇదే జోరు కొనసాగిస్తుందేమో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే