తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 25 ఏళ్ల అనుభవం ఉంది.. 2000 సంవత్సరంలో తిరుపతి నుంచి ఈనాడులో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది.. 2002 నుంచి ఈటీవీ, ఈనాడు జర్నలిజం స్కూల్ లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని 2003 నుంచి ఈటీవీ 2 లో , 2006 నుంచి జీ తెలుగు, 2009 లో మహా న్యూస్, 2012 నుంచి టివి9 లో అడుగుపెట్టాను.. చెన్నై కేంద్రంగా టివి9 ప్రతినిధిగా తమిళనాడు వ్యాప్తంగా అనేక అంశాలపై ప్రత్యేక కథనాలను అందించడం జరిగింది. ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి స్పెషల్ కరస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. తిరుపతితో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ లో సంచలన ఘటనలకు సంబంధించి రిపోర్టింగ్ చేసిన అనుభవం వుంది. డిజిటల్ ఫ్లాట్ ఫాం లో ఐదేళ్ళ అనుభవం వుంది.
Tamil Nadu: స్థల పురాణం మూలాలతో తవ్వకాలు.. బయటపడింది చూసి షాక్..!
ఆలయం నిర్మాణం.. మూలాల తాలూకు వివరాలన్నీ స్థలపురాణంలో ఉన్న విషయాన్ని స్థానికులు పురావస్తు శాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణంలో తవ్వకాలు జరిపిన ఆర్కియాలజీ అధికారులకు అబ్భురపరిచే నిర్మాణాలు బయటపడ్డాయి. పురాతన నిర్మాణాలకు సంబంధించిన సమాచారంతో తవ్వకాలు జరిపితే మరోసారి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి.
- Ch Murali
- Updated on: Feb 20, 2025
- 5:57 pm
Andhra Pradesh: ఆ ప్రాంతంలో డ్రోన్ ఎగరేసిన పోలీసులు.. గుట్టు బయటపడిందిగా…
రాష్ట్రంలో గంజాయి నియంత్రణ కోసం ఈగల్ ప్రత్యేక విభాగం సమర్థవతంగా పనిచేస్తోంది. గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే.. నిఘా ముమ్మరం కావడంతో స్మగ్లర్లు కొత్త కొత్త దారులు ఎంచుకుంటున్నారు. కానీ.. అలాంటి వాటికి కూడా డ్రోన్ కెమెరాలతో చెక్ పెడుతున్నాయి.
- Ch Murali
- Updated on: Feb 15, 2025
- 4:14 pm
Jayalalithaa Assets: జయలలిత ఆస్తులు అప్పగింత.. మొత్తం ఎన్ని కేజీల బంగారం ఉందో తెలుసా..?
కర్ణాటక సీబీఐ కోర్టు ఆధీనంలో ఉన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు.. ప్రస్తుతం వాటి విలువ లెక్కగట్టే పనిలో ఉన్నారు అధికారులు. దివంగత జజలలిత. అవినీతి కేసులో జైలుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే, ఆ సమయంలో స్వాధీనం చేసుకున్న కిలోల కొద్దీ బంగారం, వెండి ఇన్నాళ్లు కర్ణాటక సిబిఐ కోర్టు వద్దే ఉంది.. అయితే.. ఇప్పుడు ఆ బంగారాన్ని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించడంతో వాటి లెక్కింపు మొదలైంది.
- Ch Murali
- Updated on: Feb 15, 2025
- 12:31 pm
తమిళనాట BJP ప్లాన్ బీ.. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే నయా స్కెచ్..!
తమిళనాట జెండా పాతేందుకు బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ అక్కడ సత్తా చాటేందుకు కమలనాథులు చేయని ప్రయత్నం లేదు.. అమలు చేయని రాజకీయ వ్యూహం లేదు. అయితే వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా అయినా డీఎంకేని అధికార పీఠంపై నుంచి గద్దె దించేందుకు నయా స్కెట్ వేస్తోంది. దీని కోసం ప్లాన్ బీ కూడా సిద్ధం చేసుకుంది.
- Ch Murali
- Updated on: Feb 7, 2025
- 4:08 pm
Tamil Nadu: ఇంతకీ జయలలిత దగ్గర ఎన్ని కేజీల బంగారం ఉంది..? అది ఎవరికి చెందుతుంది..?
దివంగత మాజీ సీఎం జయలలితకు చెందిన బంగారు, వజ్రాభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదలాయించాలని బెంగళూరులోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. జయలలిత, ఇతరులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సాక్ష్యంగా ఉన్న ఈ బంగారు, వజ్రాల ఆభరణాలకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపింది.
- Ch Murali
- Updated on: Jan 30, 2025
- 7:08 pm
మరో రికార్డ్‌కు అడుగు దూరంలో ఇస్రో.. 100వ ప్రయోగానికి ముహూర్తం ఫిక్స్..!
2025లోనూ అస్సల్ తగ్గేదేలే అంటోంది భారతీ అంతరక్షి పరిశోధనా సంస్థ(ఇస్రో). కొత్త ఏడాది ప్రారంభంలోనే మరో చరిత్ర సృష్టించింది. ఇటీవల నింగిలోకి పంపించిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది. ఈ క్రమంలో మరో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. 2025 జనవరి 29న 100వ రాకెట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
- Ch Murali
- Updated on: Jan 25, 2025
- 5:06 pm
ఇలాంటి రోడ్డు గురించి మీరెప్పుడైనా విన్నారా..? 75 ఏళ్ళు గడిచినా చెక్కు చెదరలేదు!
ప్రస్తుతం ఈ రహదారిని తారు రోడ్లుగా మార్చేందుకు కార్పొరేషన్ అధికారులు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రోడ్డును సంప్రదాయ పర్యాటక రోడ్లుగా ప్రకటించాలని కారైక్కుడి ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 75 ఏళ్ల క్రితం వేసిన ఈ రోడ్డులో ప్రస్తుతం ఒక రోజుకు..
- Ch Murali
- Updated on: Jan 25, 2025
- 5:00 am
సృజనాత్మకతకు అరుదైన గౌరవం.. గణతంత్ర వేడుకలకు నెల్లూరుకు చెందిన సాధారణ మహిళకు ఆహ్వానం!
ఉదయగిరి చెక్క నగిషి ఎగ్జిబిషన్‌ను సందర్శించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రం చెక్క బొమ్మలను చూసి ముగ్ధులయ్యారు. ప్రధానమంత్రి ఈ కేంద్రాన్ని పరిశీలించడమే కాకుండా, విశ్వకర్మ పథకం ద్వారా కేంద్రానికి అదనపు ప్రోత్సాహం కల్పించేందుకు ముందుకు వచ్చారు. 120 మంది మహిళలకు ఉచిత శిక్షణ అందించే కార్యక్రమాన్ని ప్రకటించారు.
- Ch Murali
- Updated on: Jan 22, 2025
- 5:17 pm
ఇస్రోకి బాహుబలి లాంచ్ ప్యాడ్.. మ్యాన్ మిషన్ గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం భారీ ఏర్పాట్లు!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మ్యాన్ మిషన్ గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం భారీ ఏర్పాట్లు చేస్తుంది. 2040 నాటికి భారత వ్యోమగాములు చంద్రుడిపై అడుగు పెట్టాలనే లక్ష్యంతో వడివడిగా అడుగులు వేస్తుంది. ఈక్రమంలో ఇస్రోకి బాహుబలి లాంచ్ ప్యాడ్ నిర్మించేందుకు కేంద్రం పూనుకుంది. ఇప్పటికే బడ్జెట్ కేటాయింపులు కూడా పూర్తయ్యాయి..
- Ch Murali
- Updated on: Jan 17, 2025
- 9:12 pm
ISRO Spadex: చివరి నిముషంలో టెన్షన్ పెట్టిస్తున్న Spadex.. సాంకేతిక సమస్యతో వాయిదా!
ఇస్రో డిసెంబర్ 30న రాత్రి 10 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి స్పాడెక్స్ మిషన్‌ను ప్రయోగించింది. రెండు అంతరిక్ష నౌకలు - SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) PSLV-C60 రాకెట్‌తో భూమికి 475 కి.మీ. దూరంలోకి తీసుకెళ్లింది. ఈ మిషన్ జనవరి 9న బుల్లెట్ వేగం కంటే పదిరెట్లు వేగంగా ప్రయాణించే ఈ రెండు వ్యోమనౌకలు అనుసంధానం కానున్నాయి.
- Ch Murali
- Updated on: Jan 6, 2025
- 10:04 pm
నిరుపయోగంగా గానగంధర్వుడి ఇల్లు.. పట్టించుకోవడంలేదంటున్న అభిమానులు
విశ్వం మెచ్చిన “తెలుగు గాయకులు” ఎస్పీ బాలసుబ్రమణ్యం.. ఆయన దివికేగి ఇన్నేళ్లు అవుతున్న ఇప్పటికీ ప్రతి సంగీత ప్రియుడు ఆ గంగంధర్వుడిని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు. కళాకారులకు మరణం ఎక్కడ.. మీరు బౌతికంగా మా మధ్యలేదు.. మీపాటలు, మీరు నటించిన సినిమాలతో మా మధ్య సజీవంగా .. మా మాది గదిలో ఓ అపురూపజ్ఞాకంగా చిరంజీవిలా చిరకాలం అంటూ ఆయన గురించి సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూనే ఉన్నారు అభిమానులు.
- Ch Murali
- Updated on: Jan 6, 2025
- 11:14 pm
అసెంబ్లీ సమావేశాల చరిత్రలో సంచలనం.. ప్రసంగం చదవకుండానే గవర్నర్ వాకౌట్..!
ఏ రాష్ట్రంలోనైనా అసెంబ్లీ నుంచి విపక్షాలు వాకౌట్ చేస్తాయి. కానీ తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ చేశారు. ఇంతకీ ఆయన ఎందుకు సభ నుంచి వెళ్లిపోయారు. గవర్నర్ వాకౌట్‌పై అధికార పార్టీ ఏమంటోంది? అన్నదీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ఈ ఘటన జరిగింది.
- Ch Murali
- Updated on: Jan 6, 2025
- 5:54 pm