AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎయిర్‌పోర్ట్ రన్‌వేలా ధగధగ మెరుస్తున్న లైట్లు.. పంట పొలంలోకి వెళ్లి చూస్తే..!

Nellore Farmer: డ్రాగన్ ఫ్రూట్ పంట పండించడంలో నెల్లూరు రైతు సరికొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. తన పొలంలోని నాలుగు ఎకరాలలో విద్యుత్ దీపాలను అమర్చాడు. మంచు మొక్కపై పడకుండా ఉండేటట్లు ఏర్పాటు చేశాడు. దీంతో అనుకున్నట్లుగానే మొక్క పెరగడమే కాకుండా పిందె దశలో కాపు ఆశాజనకంగా ఉందని రైతు పిచ్చిరెడ్డి తెలిపాడు. అనుకున్నట్లుగా మంచి కాపు వస్తే 16 ఎకరాలలోని కాపుకు విద్యుత్ ఉద్యోపాలు అమర్చి అన్ సీజన్లో కూడా మంచి రాబడి తీసుకునేందుకు ప్రయత్నిస్తానని అంటున్నారు పిచ్చి రెడ్డి.

Ch Murali
| Edited By: |

Updated on: Mar 03, 2026 | 4:19 PM

Share
దూరం నుంచి చూస్తే ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వేలా ఉంటుంది.. దగ్గరకు వెళితే అదో భారీ పరిశ్రమ లాగా కనబడుతుంది.. ఈ విద్యుత్ వెలుగుల వెనుక పంట దిగుబడి రహస్యం ఉందంటున్నారు నెల్లూరు జిల్లా కలువాయికి చెందిన రైతు పిచ్చిరెడ్డి సాధారణంగా ప్రతి రైతు సూర్యకాంతిని సంగ్రహించే డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు నాటితే వాటి కాలాలకనుగుణంగా కాపుకొచ్చి కోతకొస్తాయి. ఆ సీజన్‌లో అందరి రైతుల పంట ఒకేసారి డ్రాగన్ ఫ్రూట్ పండ్లు తీసుకొస్తే గిరాకి తగ్గుతుంది. దీంతో రైతులకు గిట్టుబాటు ధరలు ఆశాజనకంగా ఉండవని భావించి... డ్రాగన్ ఫ్రూట్ సాగుకు  ప్రతికూల వాతావరణం పరిస్థితులలో అనుకూల పరిస్థితుల్లోకి తీసుకువస్తే మంచి లాభాలు పొందవచ్చని భావించిన రైతు పిచ్చిరెడ్డి కృత్రిమ వెలుగుల సాయంతో పంట పండించవచ్చని శాస్త్రవేత్తల ద్వారా,అనుభవం కలిగిన రైతుల ద్వారా తెలుసుకుని అనుకున్నదే తడవుగా తన వ్యవసాయ క్షేత్రంలో డ్రాగన్ ఫ్రూట్ తోటలో రెండవసారి కాపుకు వచ్చేలా.. ఇలా విద్యుత్తు దీపాలను ఏర్పాటు చేశారు.

1 / 6
అనంతసాగరం మండలం గోవిందపల్లి గ్రామంలో కలువాయి గ్రామానికి చెందిన పిచ్చిరెడ్డి అనే రైతు ఉద్యానవన శాస్త్రవేత్తల సహకారంతో కర్ణాటకలోని బళ్లారిలో నాణ్యమైన మొక్క ఉందని తెలుసుకొని 16 ఎకరాలలో రెండు సంవత్సరాల క్రితం డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు చేశాడు. ఇప్పటికి రెండుసార్లు పంట చేతికొచ్చే సమయానికి మిగిలిన రైతుల పంట కూడా చేతికి రావడంతో మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్‌కు గిట్టుబాటు ధర అందలేదు.

2 / 6
దీంతో ఆవేదనకు లోనైన రైతు ఎలాగైనా ఆదాయం పొందాలని నిర్ధారించుకొని అన్ సీజన్ ఐన శీతాకాలంలో రాత్రి వేళల్లో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తే సూర్యకాంతి పడినట్లుగా భావించి మొక్క ఏపుగా పెరిగి కాపు కొస్తాయని సంబంధిత ఉద్యానవన శాఖ శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకున్నారు. వెంటనే తన పొలంలోని నాలుగు ఎకరాలలో విద్యుత్ దీపాలను అమర్చాడు. మంచు మొక్కపై పడకుండా ఉండేటట్లు ఏర్పాటు చేశాడు. దీంతో అనుకున్నట్లుగానే మొక్క పెరగడమే కాకుండా పిందె దశలో కాపు ఆశాజనకంగా ఉందని రైతు పిచ్చిరెడ్డి తెలిపాడు. అనుకున్నట్లుగా మంచి కాపు వస్తే 16 ఎకరాలలోని కాపుకు విద్యుత్ ఉద్యోపాలు అమర్చి అన్ సీజన్లో కూడా మంచి రాబడి తీసుకునేందుకు ప్రయత్నిస్తానని అంటున్నారు పిచ్చి రెడ్డి.

3 / 6
సాధారణంగా డ్రాగన్ ఫ్రూట్ పంట నవంబర్ మాసంలో చేతికొస్తుందని ఆ సమయంలో డ్రాగన్ ఫ్రూట్ వేసిన ప్రతి రైతుకు పంట దిగుబడి రావడంతో ఆశించిన స్థాయిలో రైతుకు ఆదాయం లేకపోవడంతో శాస్త్రవేత్తల సలహా మేరకు అక్టోబర్ మాసం నుంచి  విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తే పంట దిగుబడి ఫిబ్రవరి నుంచి మొదలై మార్చి వరకు పంట చేతికొస్తుందని తెలిపాడు. దీంతో మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ అందుబాటులో ఉండదు కనుక మంచి లాభాలు ఆశించవచ్చని రైతు తెలిపాడు.

4 / 6
పంటని అన్ సీజన్లో పంట సాగు చేస్తే మొక్కలను చిన్న పిల్లలను చూసుకున్నట్లుగా చూసుకోవాలని రైతు పిచ్చిరెడ్డి తెలిపాడు. మందులు వేయాల్సిన పనిలేదని నీటి అవసరం చాలా తక్కువే ఉంటుందని 70 శాతం ఆర్గానిక్ పద్ధతిలో 30% రసాయన పద్ధతిలో పంట సులభ పద్ధతిలో సాగు చేస్తున్నానని తెలిపాడు.

5 / 6
దీంతో రైతుకు మంచి లాభాలు వస్తాయి అనే ఆశిస్తున్నాడు. పంట వేసిన్నప్పుడు ఒక్కసారి మాత్రమే  ఖర్చు అవుతుంది. ఆ తర్వాత ఖర్చు ఉండదు. ప్రతి రైతు కొంత విస్తీర్ణంలో సాగుచేస్తే దీర్ఘకాలంగా లాభాలను పొందే అవకాశం ఉంటుంది.

6 / 6
Follow Us
పీరియడ్స్ ఆలస్యం చేసే టాబ్లెట్లు వాడుతున్నారా? ప్రాణాలకే ముప్పు!

హీరోయిన్ వాణి విశ్వనాథ్ కూతురిని చూశారా.. ?

వేసవిలో శరీరం కూల్‌గా ఉండి.. మెరిసే చర్మం కోసం ఇవే బెస్ట్ టిప్స్

ఎక్కడ ఓడిపోయారే అక్కడ మీ స్థాయి ఏంటో చూపించబోతున్నారు..

ఇటు పంత్, అటు గేల్ ఆల్‌టైమ్ రికార్డ్ బద్దలు కొట్టిన వైభవ్

రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. స్టేషన్లలో ఫుడ్‌ రేట్స్ పెంపు

అప్పట్లోనే మణికొండలో ఇల్లు కట్టా.. ఇఫ్పుడు ధర ఎంతంటే..

రోల్డ్‌గోల్డ్‌ నగలు వేసుకుంటే చర్మంపై దురద వస్తోందా? ఇలా చేస్తే..

ఇవి తింటే మీ బాడీ ఇమ్యూనిటీకి పవర్ హౌస్‌లా మారిపోతుంది!

'నాన్న ఎందుకో వెనకబడ్డాడు'.. హృదయాలను తాకే కవిత