అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు సినీ తరహాలో సాగిన గోవా మద్యం స్మగ్లింగ్‌ను ఛేదించారు. లారీ క్యాబిన్ కింద ప్రత్యేక బాక్సులో తరలిస్తున్న 400 గోవా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నంబర్ ప్లేట్లతో లారీని నడుపుతుండగా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.