AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బోనాల పండుగలో పాల్గొన్నందుకు నటి ఫరియా అబ్దుల్లా మతపరమైన ట్రోలింగ్‌కు గురయ్యారు. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో కన్నీళ్లు పెట్టుకున్న ఆమె, ద్వేషాన్ని ప్రేమతో జయించాలని పిలుపునిచ్చారు. ఈ ఘటనపై బీజేపీ, వీహెచ్‌పి, అయోధ్య సాధువులతో పాటు పలువురు ఆమెకు మద్దతుగా నిలిచారు, మత సామరస్యాన్ని దెబ్బతీసే చర్యలను తీవ్రంగా ఖండించారు.

Samatha J
|

Updated on: Aug 19, 2026 | 2:05 PM

Share

హైదరాబాద్‌లోని బోనాల పండుగలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న నటి ఫరియా అబ్దుల్లా, సోషల్ మీడియాలో తీవ్ర మతపరమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు. ముస్లిం అయి ఉండి హిందూ పండుగలో ఎలా పాల్గొంటావంటూ ఆమెను కాఫీర్ అని దూషించారు. ఈ విమర్శలతో మనస్తాపం చెందిన ఫరియా అబ్దుల్లా ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారు. తన వ్యక్తిగత నేపథ్యం గురించి వివరిస్తూ, తన తండ్రి ప్రేమతో ఇస్లాంను స్వీకరించారని, మతాన్ని ప్రేమతో చూసే వాతావరణంలో తాను పెరిగానని ఫరియా తెలిపారు. దేవుణ్ణి ప్రతిచోటా, ప్రతి జీవిలో చూడాలని, ద్వేషాన్ని ప్రేమతో జయించడమే తన తిరుగుబాటు, విప్లవం అని ఆమె శక్తివంతమైన సందేశం ఇచ్చారు. ఈ ఘటనపై టీ-బీజేపీ చీఫ్ రామ్ చంద్ర రావు, విశ్వహిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్, అయోధ్యకు చెందిన సాధువు పరమహంస ఆచార్యతో పాటు పలువురు ఫరియాకు మద్దతుగా నిలిచారు. దేశం బహుళత్వం, మత సామరస్యానికి నిలయం అని స్పష్టం చేస్తూ ట్రోలింగ్‌ను తీవ్రంగా ఖండించారు. ఫరియా సందేశం నెటిజన్ల నుంచి విశేష ప్రశంసలు పొందుతోంది.

Follow Us
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
గుడికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ చిన్న పూజలు చేస్తే చాలు..
గుడికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ చిన్న పూజలు చేస్తే చాలు..
పాము కరిస్తే ఈ తప్పులు అస్సలు చేయకండి..
పాము కరిస్తే ఈ తప్పులు అస్సలు చేయకండి..
వర్షాకాలంలో పెరుగు తింటే జలుబు, దగ్గు వస్తాయా? నిపుణుల క్లారిటీ
వర్షాకాలంలో పెరుగు తింటే జలుబు, దగ్గు వస్తాయా? నిపుణుల క్లారిటీ
గుండెలు ఆగేలా ఆ విమానంలో అన్నీ సమస్యలే! భయంతో వణికిన ప్రయాణికులు
గుండెలు ఆగేలా ఆ విమానంలో అన్నీ సమస్యలే! భయంతో వణికిన ప్రయాణికులు
131 బంతుల తర్వాత తప్పు సరిదిద్దుకున్న జడేజా
131 బంతుల తర్వాత తప్పు సరిదిద్దుకున్న జడేజా
కళ్ల రంగు బట్టి మీ స్వభావం ఎలా ఉంటుందో తెలుసా? సముద్రిక శాస్త్రం
కళ్ల రంగు బట్టి మీ స్వభావం ఎలా ఉంటుందో తెలుసా? సముద్రిక శాస్త్రం
రోడ్డు మీద కూరగాయలు అమ్ముతూ కనిపించిన నటుడు..
రోడ్డు మీద కూరగాయలు అమ్ముతూ కనిపించిన నటుడు..
గత వేలంలో ఛీ కొట్టారు.. 601 పరుగులతో ఐపీఎల్ ప్రాంచైజీలకు షాక్
గత వేలంలో ఛీ కొట్టారు.. 601 పరుగులతో ఐపీఎల్ ప్రాంచైజీలకు షాక్