రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్!
వర్షాకాలంలో పాముల సంచారం పెరిగిన నేపథ్యంలో, విశాఖపట్నంలో రెండు ఇళ్ల మధ్య తిష్ట వేసిన భారీ కింగ్ కోబ్రా స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్‌లైఫ్ సొసైటీ సభ్యుల సహాయంతో, స్నేక్ క్యాచర్లు దాదాపు అరగంట పాటు శ్రమించి 13 అడుగుల పొడవున్న పామును పట్టుకుని సురక్షితంగా అడవిలో విడిచిపెట్టారు.
వర్షాకాలం కావడంతో పాములు విచ్చలవిడిగా సంచరిస్తున్న దృశ్యాలు తరచుగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, విశాఖపట్నం జిల్లాలో ఓ సంఘటన స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. రెండు ఇళ్ల మధ్య ఉన్న చిన్న సందులో వింత శబ్దాలు రావడంతో, అక్కడి స్థానికులు దగ్గరకు వెళ్లి పరిశీలించారు. అక్కడ ఆహారం కోసం వెతుకుతూ వచ్చిన భారీ కింగ్ కోబ్రా (గిరినాగు/రాచనాగు) తిష్ట వేసి ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆ ఇళ్లలోని వారిని అలర్ట్ చేసి, కొందరు ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్‌లైఫ్ సొసైటీ సభ్యులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. అయితే, ఈ భారీ కింగ్ కోబ్రాను పట్టుకోవడం అంత సులువు కాలేదు. దాదాపు 13 అడుగుల పొడవున్న ఆ గిరినాగు స్నేక్ క్యాచర్‌ను పలుమార్లు ముప్పుతిప్పలు పెట్టింది. దానిపై దాడికి ప్రయత్నించి, కాటు వేయడానికి యత్నించింది. ఇద్దరు సిబ్బంది ఎంతో శ్రమించి, పాము దాడి నుంచి చాకచక్యంగా తప్పించుకుంటూ దానిని సురక్షితంగా పట్టుకోవడానికి ప్రయత్నించారు.
మరిన్ని వీడియోల కోసం :
గ్లోబల్ బిజినెస్ లెక్కలు మార్చేస్తున్న రామాయణ టీమ్
ఫరియా అబ్దుల్లాను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు
ఒకటే వేట.. లక్షల్లో పంట.. జాలరి వలలో భారీ చేపలు
పగలు అపర భక్తులు.. రాత్రయితే వీళ్ల అసలు స్వరూపం ఇది!
ఘాట్రోడ్లో తిష్టవేసిన చిరుత.. భయంతో వణికిపోతున్న వాహనదారులు!
ఇంట్లోనుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా.. గుండె జారిపోయే ఘటన
గణపతి విగ్రహం కొంటున్నారా.. ఎలాంటి విగ్రహం కొనాలో తెలుసా?
రీల్స్ చూస్తుండగా సిగ్నల్ కట్.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య!
ఏఐ రెట్రో లుక్స్‌తో అదరగొడుతున్న సెలబ్రిటీలు!

