AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బోనాలు.. ట్రోలింగ్‌పై ఫరియా అబ్దుల్లా ఎమోషనల్ వీడియో వైరల్!

బోనాలు.. ట్రోలింగ్‌పై ఫరియా అబ్దుల్లా ఎమోషనల్ వీడియో వైరల్!

Samatha J
|

Updated on: Aug 19, 2026 | 12:16 PM

Share

టాలీవుడ్ నటి ఫరియా అబ్దుల్లా బోనాల్లో పాల్గొన్నందుకు ఎదురైన మతపరమైన ట్రోలింగ్‌పై భావోద్వేగంగా స్పందించారు. దేవుడు అంతటా విస్తరించి ఉండే దివ్యమైన వెలుగని, ద్వేషించేవారికి ప్రేమను పంచుతానని ఆమె అన్నారు. తన తండ్రి మత మార్పిడి నేపథ్యాన్ని వెల్లడిస్తూ, ప్రేమ, ఐక్యతలకు ప్రాధాన్యతనిచ్చారు.

నటి ఫరియా అబ్దుల్లా ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్న ఒక సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది. బోనాల వేడుకల్లో పాల్గొన్నందుకు కొందరు నెటిజన్లు తనను మతపరంగా ట్రోల్ చేయడంతో ఆమె తీవ్ర భావోద్వేగంతో స్పందించారు. తనపై ద్వేషం చిమ్ముతున్న వారికి మరింత ప్రేమను పంచుతానని ఫరియా ప్రకటించారు. దేవుడు ప్రతిచోటా విస్తరించి ఉండే ఒక దివ్యమైన వెలుగని, అంతటి విశాలమైన మతాన్ని సంకుచిత ఆలోచనలతో పరిమితం చేయలేమని ఆమె అన్నారు. తన తండ్రి ఇస్లాం మతాన్ని ఇష్టపడి మారారని వెల్లడించారు. తాను ఎప్పుడూ ఇస్లాంలో మంచిని మాత్రమే చూశానని తెలిపారు. జీవితంలో ప్రతిదానిలోనూ దైవత్వాన్ని చూసే గొప్పతనాన్ని అర్థం చేసుకోలేని వారు ఎంతో కోల్పోతున్నారని ఫరియా పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం :

గ్లోబల్‌ బిజినెస్‌ లెక్కలు మార్చేస్తున్న రామాయణ టీమ్‌

ఫరియా అబ్దుల్లాను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు

ఆగస్టు మీద ఐకాన్‌ స్టార్‌ ఫ్యాన్స్ ఆశలు

Follow Us