నల్గొండలో స్కూల్ ప్రిన్సిపాల్ కల్లూరు రూపా రెడ్డి దారుణ హత్య కేసులో షాకింగ్ వివరాలు వెలుగుచూశాయి. 27 సార్లు కత్తితో పొడిచి ప్రిన్సిపాల్‌ను చంపింది పదవ తరగతి విద్యార్థేనని పోలీసులు గుర్తించారు. తనను అవమానించారనే ఆగ్రహంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.