అద్దంకి ఆర్టీసీ బస్సులో ఓ మహిళను వేధించిన యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. ఒంగోలు నుంచి అద్దంకి వస్తున్న బస్సులో ఈ ఘటన జరిగింది. బాధితురాలు తన బంధువులకు సమాచారం ఇవ్వగా, బస్సు అద్దంకి బస్టాండ్‌కు చేరగానే వారు ఆ యువకుడిని పట్టుకొని చితకబాదారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.