Tamilanadu: ఆ ఒక్క రాష్ట్రంలో ఏకంగా 134 రాజకీయ పార్టీలు.. మన పక్కనే.. ఎక్కడంటే..?
మీకు తెలిసి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్ని ఉన్నాయి.. పది లోపు ఉన్నాయా.. లేదా అంతకు మించి ఉన్నాయా.. అటు ఇటుగా అంతకు మించి లేవని ఖచ్చితంగా చెప్పగలం.. కానీ మన పక్కనే ఉన్న తమిళనాడులో ఎన్ని రాజకీయ పార్టీలు ఉంటాయో తెలుసా.

తమిళనాడులో ఇప్పటిదాకా అక్కడ అధికారంలోకి వచ్చింది డీఎంకే, లేదంటే అన్నా డీఎంకే.. ఈ రెండే.. వాటితో కలిసి మరో నాలుగైదు పార్టీలు ఉంటాయి . ఇక్కడంటే రెండు తెలుగు రాష్ట్రాలు కాబట్టి జాతీయ పార్టీలతో కలుపుకుని పది పార్టీలు దాకా అనుకున్నాం.. అక్కడ ఒకే రాష్ట్రం.. మహా అయితే పది కంటే ఉంటాయా అనుకుంటున్నారా… అస్సలు కాదు.. అక్కడ పార్టీల సంఖ్య ఎప్పుడో సెంచరీ దాటేసింది.. అవును తమిళనాడు అంటే కేవల తమిళం మాతృ భాష కలిగిన రాష్ట్రం మాత్రమే కాదు.. శతాధిక పార్టీల నాడు.. తమిళనాడు..
తమిళనాడు అనగానే చాలా గుర్తొస్తాయి.. అందులో ముందుగా అక్కడ రాజకీయాల తీరు .. ప్రత్యేకమైన నేతల మధ్య వైరం.. ఇంకా చెప్పాలంటే ప్రస్తుత రాజకీయాల్లో కీలకమైన ఉచిత పథకాలు పురుడు పోసుకున్న గడ్డ.. ఇక గడిచిన కొన్ని దశాబ్దాలుగా అక్కడ రాజ్యమేలిన పార్టీలు ఏవీ అంతే రెండే రెండు పార్టీల పేర్లు గుర్తొస్తాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే, ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే పార్టీ. ఇక జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బిజెపి లు ఈ రెండు పార్టీలతో గత కట్టి పోటీ చేస్తూ ఉండడం కూడా తెలిసిందే. ఈ పార్టీల తర్వాత ఆమధ్య పార్టీని స్థాపించిన విజయకాంత్ అనారోగ్యంతో ఆయన మరణం తర్వాత ఆ పార్టీని ఆయన సతీమణి ప్రేమలత నడిపిస్తున్నారు.. మొన్న ఆమధ్య కమలహాసన్ ఏర్పాటు చేసిన మొక్కలు నీది మయ్యం పార్టీ ఒకటి.. ఏడీఎంకే నుంచి బహిష్కరణ జరిగిన తర్వాత దివంగత జయలలిత నెస్చెలి శశికళ మేనల్లుడు స్థాపించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కలగం. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో చర్చినియాంశంగా ఉన్న నటుడు విజయ స్థాపించిన టీవీకే.. అన్న డీఎంకే పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడపాడి పలని స్వామి పై ఆగ్రహంతో రగిలిపోతున్న శశికళ ఆ పార్టీని ఆ పార్టీ ఓటు బ్యాంకును దెబ్బ కొట్టేందుకు కొత్తగా ప్రకటించిన మరో కొత్త పార్టీ.. ఇలా అన్ని పార్టీలు గురించి మాట్లాడుకున్న పదికిమించి పార్టీలు లేవు కదా అనుకోవద్దు..
తమిళనాడులో చిన్నాచితకతో కలిపి అధికారాన్ని దక్కించుకున్న పెద్ద పార్టీలు కలిపి 134 కంటే ఎక్కువ పార్టీలు ఉన్నాయి.. ఇందులో 60 రాజకీయ పార్టీల కంటే ఎక్కువ ప్రతి ఎన్నికలలో పోటీ చేస్తుంటాయి.. ఒక్కో కూటమిలో పది నుంచి 15 కంటే ఎక్కువ పార్టీలు కూడా కలిసి పోటీ చేసిన సందర్భాలు ప్రతి ఎన్నికల్లో చూస్తుంటాం.. గత 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేసిన పార్టీల విషయం అటుంచితే కూటమిగా పోటీ చేసిన పార్టీల సంఖ్య అక్షరాల 63.. అవును మీరు ఏమాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. తమిళనాడులో ఉన్నన్ని రాజకీయ పార్టీలు దేశంలో మరే రాష్ట్రంలోనూ ఉండవని ఎలాంటి సంకోచం లేకుండా చెప్పొచ్చు..
అన్ని పార్టీల పేరు చెప్పడానికి సమయం సరిపోదు.. మచ్చుకు కొన్ని పార్టీల లిస్టు గమనించండి మీకే తెలుస్తుంది. డీఎంకే, అన్నా డీఎంకే, కాంగ్రెస్, బీజేపీ, ఏం.డి.ఏం.కే, డి.ఎం.డి.కే, ఏం.ఎం.కే, పై.ఏం.కే, ఎస్. ఎం.కే , టి.ఏం.సి, ఎన్.టి.కే, విసికే, వామపక్షాలు, ద్రవిడ దేశం పార్టీ, విజయ్ స్థాపించిన టి.వి.కే, ఐ. జే.కే, ఎస్.ఏం.కే, ఏం.జే.కే, ఏ.ఐ.ఎఫ్.బి, ఐ. ఎన్.ఎల్, ఐ.యు.ఏం.ఎల్, పి.బి.కే, ఎస్.డి.పి.ఐ, శశికళ కొత్త పార్టీ.. ఇలా గత ఎన్నికల్లో నాలుగు కూటములు ఒక్కో కూటమి తో 15 పార్టీల వరకు కలిసి పోటీ చేశాయి.. అయితే ఇక్కడ ఓ విషయం.. కూటమిలో ఉన్న పార్టీలన్నీ ఆయా పార్టీల గుర్తుల మీద కాకుండా పొత్తును లీడ్ చేస్తున్న ప్రధాన పార్టీల గుర్తుపై పోటీ చేస్తుంటాయి.. ఇవి కాకుండా చిన్న పార్టీలు సొంతంగా సింగిల్ గా పోటీ చేస్తుంటే.. మిగిలిన మరి కొన్ని పార్టీలు కేవలం లెటర్ ప్యాడ్ కు చౌరస్తాలో ధర్నాలకు పరిమితం అవుతుంటాయి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో 62 పార్టీలు తమిళనాడులో పోటీ చేసినట్లు ప్రకటించగా ఈ ఎన్నికల్లో మరి కొన్ని పార్టీలు కొత్తగా ఏర్పాటయ్యాయి.. తెలుగు ప్రజల కోసం అంటూ తమిళ తెలుగు నేషనల్ పార్టీ అంటూ కొత్తగా వచ్చింది.. ఇక విజయ్ టివికే, శశికళ పార్టీ అమ్మో లిస్ట్ మరింత పెరిగింది..
