AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CLAT 2027 అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్! రాత పరీక్ష ఎప్పుడంటే?

CLAT 2027 ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్. నేషనల్ లా యూనివర్సిటీల కన్సార్టియం (NLUs) యూజీ, పీజీ ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేసింది. డిసెంబర్ 6, 2026న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పాస్‌వర్డ్‌తో అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..

CLAT 2027 అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్! రాత పరీక్ష ఎప్పుడంటే?
CLAT Hall Ticket Download
Srilakshmi C
|

Updated on: Nov 22, 2026 | 6:48 AM

Share

హైదరాబాద్‌, నవంబర్ 22: న్యాయ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) 2027 హాల్ టికెట్లను నేషనల్ లా యూనివర్సిటీల (NLUs) కన్సార్టియం విడుదల చేసింది. అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు వెబ్‌సైట్‌ను సందర్శించి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ వివరాలతో లాగిన్ అవ్వాలి. అనంతరం హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. 2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించి దేశంలోని భాగస్వామ్య నేషనల్ లా యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ (UG), ఏడాది ఎల్‌ఎల్‌ఎం (PG) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. CLAT 2027 ప్రవేశ పరీక్షను 2026 డిసెంబర్ 6వ తేదీన నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఆఫ్‌లైన్ విధానంలో పెన్ అండ్ పేపర్ ద్వారా అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉంటుంది.

CLAT 2027 హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

అభ్యర్థులు ఈ కింది సూచనలు పాటించి తమ అడ్మిట్ కార్డులను పొందవచ్చు.

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • హోమ్‌పేజీలో CLAT 2027 అడ్మిట్ కార్డు లింక్‌పై క్లిక్ చేయాలి.
  • రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
  • అనంతరం స్క్రీన్‌పై కనిపించే హాల్ టికెట్‌ను ఓపెన్ చేయాలి.
  • అందులోని వివరాలను సరిచూసుకుని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • పరీక్ష రోజు ఉపయోగించుకునేందుకు హాల్ టికెట్ ప్రింట్ తీసుకోవాలి.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డు ప్రింటెడ్ కాపీని తప్పనిసరిగా తీసుకెళ్లాలి. అలాగే చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డును కూడా వెంట తీసుకెళ్లాలి. హాల్ టికెట్‌లో పేర్కొన్న పరీక్షా కేంద్రం, సమయం, ఇతర సూచనలను ముందుగానే పరిశీలించుకోవాలి. CLAT 2027 ద్వారా ప్రముఖ నేషనల్ లా యూనివర్సిటీల్లో న్యాయ విద్యను అభ్యసించాలనుకునే అభ్యర్థులు వెంటనే తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షకు సిద్ధం కావాలి. తాజా సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

ఇవి కూడా చదవండి

క్లాట్‌ 2027 అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us