AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSIR UGC-NET 2026 డిసెంబర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఏ సబ్జెక్టు పరీక్ష ఎప్పుడంటే?

CSIR UGC-NET డిసెంబర్ 2026 పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. డిసెంబర్ 19, 22, 27 తేదీల్లో CBT విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, కెమికల్ సైన్సెస్, ఎర్త్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీలు, సమయాల పూర్తి వివరాలు తెలుసుకోండి..

CSIR UGC-NET 2026 డిసెంబర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఏ సబ్జెక్టు పరీక్ష ఎప్పుడంటే?
CSIR UGC-NET December 2026 Exam Schedule
Srilakshmi C
|

Updated on: Nov 22, 2026 | 6:26 AM

Share

హైదరాబాద్‌, నవంబర్ 22: CSIR UGC-NET డిసెంబర్ 2026 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక అప్డేట్ ఇచ్చింది. పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. డిసెంబర్ 19, 22, 27 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులు సబ్జెక్టుల వారీగా పరీక్ష తేదీలు, సమయాలు, షిఫ్టుల వివరాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. NTA విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. డిసెంబర్ 19న లైఫ్ సైన్సెస్ అండ్ బయోటెక్నాలజీ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. డిసెంబర్ 22న కెమికల్ సైన్సెస్, ఎర్త్ సైన్సెస్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. అలాగే డిసెంబర్ 27న మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్నాయి.

సబ్జెక్టుల వారీగా పరీక్షల షెడ్యూల్

  • డిసెంబర్ 19న లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ పరీక్షలు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు
  • డిసెంబర్ 22న కెమికల్ సైన్సెస్, ఎర్త్ సైన్సెస్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు
  • డిసెంబర్ 27న మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ పరీక్షలు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు

CSIR UGC-NET పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు NTA అధికారిక వెబ్‌సైట్ https://csirnet.nta.nic.in/ను సందర్శించాలి. అక్కడ పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించిన నోటీసును ఓపెన్ చేసి సబ్జెక్టుల వారీగా తేదీలు, సమయాల వివరాలను పరిశీలించుకోవచ్చు. పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే అభ్యర్థులు NTA అధికారులను సంప్రదించవచ్చు. అభ్యర్థులు పరీక్షల తేదీలను గమనించి, తమ సబ్జెక్టుకు అనుగుణంగా పరీక్షకు సిద్ధం కావాలని సూచించారు. అలాగే పరీక్షకు సంబంధించిన తాజా సమాచారం, అడ్మిట్ కార్డులు, ఇతర సూచనల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలి.

ఇవి కూడా చదవండి
  • ఈ-మెయిల్: csirnet@nta.ac.in
  • హెల్ప్‌లైన్ నంబర్: 011-40759000

CSIR UGC-NET 2026 అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us