AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices Today: బంగారం ధరలు మరోసారి ఢమాల్.. తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం తులం ఎంతంటే..?

బంగారం, వెండి ధరలు భారీగా పతనమవుతున్నాయి. యూఎస్ డాలర్ బలపడుతోంది. దీంతో పాటు డిసెంబర్‌లో జరగనున్న సమీక్షా సమవేశంలో యూఎస్ ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను మరింత పెంచనుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ కారణంతో పసిడి ధరలు పతనాన్ని చవిచూస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Gold Prices Today: బంగారం ధరలు మరోసారి ఢమాల్.. తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం తులం ఎంతంటే..?
Gold Prices
Venkatrao Lella
|

Updated on: Nov 22, 2026 | 6:39 AM

Share

బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. అంతర్జాతీయంగా పరిణామాల వల్ల ధరలు కుప్పకూలుతుండగా.. దేశంలోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. కార్తీక మాసం వచ్చేయడంతో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఈ క్రమంలో బంగారం ధరలు తగ్గుముఖం పడుతుండటంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. అమెరికా డాలర్ బలపడుతుండటం, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచనుందనే అంచనాల క్రమంలో పెట్టుబడిదారులు ప్రభుత్వ బాండ్లవైపు మళ్లుతున్నారు. దీంతో బంగారానికి ఆకర్షణ తగ్గుతోంది. దీంతో ధరలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం మరోసారి బంగారం ధరలు కుప్పకూలాయి. నవంబర్ 22వ తేదీన దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం.

ఇవాల్టీ బంగారం ధరలివే..

-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,25,080 వద్ద కొనసాగుతూండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,14,650కి చేరుకుంది.

-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,25,080గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,14,650 వద్ద ట్రేడవుతోంది.

-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రేటు రూ.1,25,230గా కొనసాగుతూండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,14,800కే లభిస్తోంది

-చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,25,080కు లభిస్తోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,14,650 పలుకుతోంది.

-బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,25,080కు లభిస్తోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,14,650 పలుకుతోంది

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?

బంగారంతో పాటు సిల్వర్ ధరలు కూడా డౌన్ అవుతున్నాయి.

-దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1.75 లక్షల వద్ద ట్రేడవుతోంది

-హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.1.75 లక్షల వద్ద కొనసాగుతోంది

-చెన్నై, బెంగళూరులోనూ కిలో వెండి రేటు రూ.1.75 లక్షల వద్ద పలుకుతోంది

Follow Us