AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పదో తరగతి మార్కులతో నేరుగా సెంట్రల్ రైల్వేలో 2,861 ఉద్యోగాలు.. ఎలాంటి రాతపరీక్ష లేదు

రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC), ముంబయి 2,861 యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.9,600 స్టైపెండ్ చెల్లిస్తారు. అర్హులైన అభ్యర్థులు 2026 డిసెంబర్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..

పదో తరగతి మార్కులతో నేరుగా సెంట్రల్ రైల్వేలో 2,861 ఉద్యోగాలు.. ఎలాంటి రాతపరీక్ష లేదు
Central Railway Apprentice Recruitment
Srilakshmi C
|

Updated on: Nov 22, 2026 | 7:13 AM

Share

సెంట్రల్ రైల్వే పరిధిలోని వివిధ వర్క్‌షాప్‌లు, యూనిట్లలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC), ముంబయి నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రల్ రైల్వే మొత్తం ఐదు క్లస్టర్ల పరిధిలో 2,861 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 2, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకాల ద్వారా ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, మెషినిస్ట్ తదితర ట్రేడుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

క్లస్టర్ల వారీగా ఖాళీల వివరాలు

  • ముంబయిలో పోస్టుల సంఖ్య: 1,712
  • భుసావల్ లో పోస్టుల సంఖ్య: 500
  • పుణెలో పోస్టుల సంఖ్య: 271
  • నాగ్‌పుర్ లో పోస్టుల సంఖ్య: 221
  • షోలాపూర్ లో పోస్టుల సంఖ్య: 157

ముంబయి క్లస్టర్‌లో అత్యధికంగా 1,712 పోస్టులు ఉన్నాయి. వీటిలో మాతుంగ వర్క్‌షాప్‌లో 547, పరేల్ వర్క్‌షాప్‌లో 272, క్యారేజ్ అండ్ వ్యాగన్ (కోచింగ్), వాడి బండర్‌లో 258 ఖాళీలు ఉన్నాయి. భుసావల్ క్లస్టర్‌లో 500, పుణె క్లస్టర్‌లో 271, నాగ్‌పుర్ క్లస్టర్‌లో 221, షోలాపూర్ క్లస్టర్‌లో 157 పోస్టులు ఉన్నాయి. ఈ నియామకాల ద్వారా ఫిట్టర్, మెషినిస్ట్, షీట్ మెటల్ వర్కర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, మెకానిక్ మెషిన్ టూల్స్ మెయింటెనెన్స్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ (COPA), మెకానిక్, పెయింటర్ ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణకు అవకాశం కల్పించనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తి చేసి నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ (NTC) కలిగి ఉండాలి. ఇంజినీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నియామకాలకు అర్హులు కారు. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి నవంబర్ 3, 2026 నాటికి అభ్యర్థుల వయసు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 2, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపికను మెరిట్ ఆధారంగా చేపడతారు. పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కులకు ప్రాధాన్యం ఇస్తారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపిక ప్రక్రియ నిర్వహించి, అర్హులైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షలు చేపడతారు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, దివ్యాంగ అభ్యర్థులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.9,600 స్టైపెండ్ చెల్లిస్తారు. అప్రెంటిస్ శిక్షణ కాలం ఒక సంవత్సరం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ సెంట్రల్ రైల్వే పరిధిలో అప్రెంటీస్‌ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us