AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Prices: చికెన్ ప్రియులకు పండగే.. భారీగా పడిపోయిన ధరలు! తెలుగు రాష్ట్రాల్లో కిలో ఎంతంటే..?

నాన్‌వెజ్ ప్రియులకు భారీ శుభవార్త. చికెన్ ధరలు భారీగా దిగొస్తున్నాయి. ఇటీవల ధరలు భారీగా పెరగ్గా.. ప్రస్తుతం పండుగలు లేకపోవడం, డిమాండ్ తగ్గడంతో ధరలు కుప్పకూలుతున్నాయి. కార్తీక మాసం ప్రభావం వల్ల డిమాండ్ లేకపోవడమే ధరల పతనానికి కారణంగా వ్యాపారులు చెబుతున్నారు.

Chicken Prices: చికెన్ ప్రియులకు పండగే.. భారీగా పడిపోయిన ధరలు! తెలుగు రాష్ట్రాల్లో కిలో ఎంతంటే..?
Chicken Prices
Venkatrao Lella
|

Updated on: Nov 22, 2026 | 7:07 AM

Share

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పడిపోతున్నాయి. కార్తీక మాసం రావడంతో నాన్‌వెజ్‌కు సాధారణంగా డిమాండ్ తగ్గిపోతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ధరలు కుప్పకూలుతున్నాయి. దీంతో పాటు ప్రస్తుతం పండుగలు ఏవీ లేకపోవడంతో చికెన్‌కు మరింత డిమాండ్ తగ్గిపోగా.. ఫామ్స్ నుంచి సరఫరా పెరిగిపోయింది. సరఫరాకు తగ్గట్లు డిమాండ్ లేకపోవడంతో చికెన్ ధరలు నేలచూపులు చూస్తున్నాయి. ఈ నెలలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. వచ్చే నెలలో క్రిస్మస్ ఉండటంతో చికెన్‌కు డిమాండ్ పెరిగే ఛాన్సుంది. ఈ కారణంతో క్రిస్మస్ పండక్కి ముందు ధరలు కొండెక్కే అవకాశముంటుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల దసరా, దీపావళి లాంటి వరుస పండుగల కారణంగా డిమాండ్ పెరగడంతో చికెన్ ధరలు పుంజుకోగా.. ప్రస్తుతం ధరలు దిగొస్తుండటంతో సామాన్యులు ఊరట చెందుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఎంతంటే..?

-హైదరాబాద్‌లో కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.226 నుంచి రూ.240 మధ్య విక్రయిస్తున్నారు. ఇక డ్రస్స్‌డ్ చికెన్ రూ.200 వద్ద పలుకుతుండగా.. రిటైల్ లైవ్ బర్డ్ రూ.129, ఎక్స్ ఫారం లైవ్ బర్డ్ రూ.102 వద్ద కొనసాగుతోంది

-విజయవాడ జోన్ పరిధిలో కిలో స్కిన్‌లెస్ ధర రూ.222 నుంచి రూ.230 మధ్య ఉండగా.. డ్రస్స్‌డ్ చికెన్ ధర రూ.197గా ఉంది. ఇక రిటైల్ లైవ్ బర్డ్ రూ.127, ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.100గా పలుకుతోంది.

-కరీంనగర్ జోన్ పరిధిలో స్కిన్‌లెస్ రూ.226, డ్రస్స్‌డ్ రూ.200, రిటైల్ లైవ్ బర్డ్ రూ.129, ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.102 వద్ద కొనసాగుతున్నాయి

పెరుగుతున్న గ్రుడ్ల ధరలు

అయితే చికెన్ ధరలు తగ్గుతుండగా.. కోడిగ్రుడ్ల ధరలు మాత్రం పెరుగుతున్నాయి.

-కరీంనగర్ జోన్ పరిధిలో 12 గ్రుడ్ల రిటైల్ ధర రూ.86 వద్ద కొనసాగుతూండగా.. విజయవాడ పరిధిలో రూ.80గా పలుకుతున్నాయి. హైదరాబాద్‌లో 12 గ్రుడ్ల రేటు రూ.84కు లభిస్తున్నాయి.

రానున్న రోజుల్లో చికెన్, గ్రుడ్ల ధరలు పెరుగుతాయా..?

అయితే రానున్న రోజుల్లో ఎల్‌నివో ప్రభావంతో చికెన్, కోడిగ్రుడ్ల ధరలు పెరుగుతాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎల్‌నివో వల్ల దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కారణం వల్ల దాణా ఖర్చులు పెరగడం, నిర్వహణ ఖర్చుల భారం పెరగడం, రవాణా ఖర్చుల పెరుగుదలతో పాల్ట్రీ వ్యాపారులకు వ్యయం పెరుగుతోంది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో చికెన్, గ్రుడ్ల ధరలు భారీగా పెరుగుతాయని పాల్ట్రీ వ్యాాపారులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే సామాన్యులకు పెను భారంగా చెప్పవచ్చు. రానున్న రోజుల్లో కిలో చికెన్ రూ.400కి కూడా చేరుకునే అవకాశముందని అంటున్నారు.

Follow Us