AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుప్రీంకోర్టు జడ్జి అనుకుని అసదుద్దీన్ ఒవైసీకి గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చిన పోలీసులు.. విచారణకు ఆదేశం!

ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో పోలీసుల పొరపాటు చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఇవ్వాల్సిన గార్డ్ ఆఫ్ ఆనర్‌ను పొరపాటున ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి ఇచ్చారు. 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌తో కలిసి సంయుక్త మీడియా సమావేశం కోసం ఆయన అక్కడికి వెళ్లారు. ఈ ప్రోటోకాల్ వైఫల్యంపై సహరాన్‌పూర్ ఎస్పీ విచారణకు ఆదేశించారు. విచారణలో లభించే వాస్తవాలు, ఆధారాల ప్రకారం నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని పోలీసు శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు జడ్జి అనుకుని అసదుద్దీన్ ఒవైసీకి గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చిన పోలీసులు.. విచారణకు ఆదేశం!
Asaduddin Owaisi
Jyothi Gadda
|

Updated on: Nov 22, 2026 | 10:09 AM

Share

ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లాలో పోలీసుల ప్రోటోకాల్ తప్పిదం తీవ్ర చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఇవ్వాల్సిన గార్డ్ ఆఫ్ ఆనర్ (గౌరవ వందనం)ను పోలీసులు పొరపాటున ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి సమర్పించారు. నవంబర్ 21 శనివారం సహరాన్‌పూర్‌లోని సర్క్యూట్ హౌస్ వద్ద ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. న్యాయమూర్తికి బదులుగా ఎంపీకి సెల్యూట్ చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

అసలేం జరిగిందంటే?

పీటీఐ కథనం ప్రకారం, శనివారం ఉదయం సుప్రీంకోర్టు న్యాయమూర్తి సహరాన్‌పూర్ సర్క్యూట్ హౌస్‌కు రావాల్సి ఉంది. ఆయనకు అధికారిక గౌరవ వందనం అందించేందుకు పోలీసు బృందం ఉదయమే అక్కడికి చేరుకుని అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే, న్యాయమూర్తి ఇంకా ప్రాంగణానికి చేరుకోకముందే అసదుద్దీన్ ఒవైసీ అనుకోకుండా సర్క్యూట్ హౌస్‌కు వచ్చారు. వాస్తవానికి సర్క్యూట్ హౌస్ సందర్శన ఆయన అసలు కార్యక్రమంలో భాగం కాదని స్థానిక వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి

అయోమయంలో సెల్యూట్.. విచారణకు ఆదేశం

జడ్జి కంటే ముందే ఒవైసీ అక్కడికి రావడంతో, అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు అయోమయానికి గురై ఆయనే న్యాయమూర్తి అని భావించి గౌరవ వందనం సమర్పించారు. పోలీసులు సెల్యూట్ చేస్తుండటంతో ఒవైసీ కూడా నిలబడి ఆ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాల్సిన గౌరవాన్ని తప్పుగా ఇవ్వడంపై ఉన్నతాధికారులు సీరియస్‌గా దృష్టి సారించారు. ఈ ఘటనపై సహరాన్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్పందిస్తూ, ఎస్పీ ద్వారా విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. విచారణలో లభించే వాస్తవాలు, ఆధారాల ఆధారంగా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సహరాన్‌పూర్‌లో ఒవైసీ, చంద్రశేఖర్ ఆజాద్ పర్యటన

2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, ఆజాద్ సమాజ్ పార్టీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్‌తో కలిసి సహరాన్‌పూర్‌లో పర్యటించారు. 2027 యూపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీరిద్దరూ ఇటీవలే సామాజిక్ పరివర్తన్ మోర్చా పేరుతో ఉమ్మడి రాజకీయ కూటమిని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించేందుకు వీరు సహరాన్‌పూర్‌కు వచ్చారు.

గార్డ్ ఆఫ్ ఆనర్ అంటే ఏమిటి?

అధికారిక లేదా ముఖ్యమైన సందర్భాల్లో నిర్దేశిత ప్రముఖులను గౌరవించేందుకు సైనిక లేదా పోలీసు సిబ్బంది ఒక వరుసలో నిలబడి అందించే సంప్రదాయ సెల్యూట్‌ను గార్డ్ ఆఫ్ ఆనర్ అంటారు. అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి, న్యాయమూర్తులకు ప్రోటోకాల్ ప్రకారం దీనిని అందిస్తారు. ఈ ఘటనలో ప్రముఖులను గుర్తించడంలో జరిగిన లోపంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us