AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishnapatnam Anandaiah: కరోనా ఆనందయ్య గుర్తున్నారా..? ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలిస్తే..

2020 కోవిడ్ సంక్షోభంలో, నెల్లూరు కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఉచితంగా ఆయుర్వేద కరోనా మందు పంపిణీ చేసి దేశవ్యాప్త గుర్తింపు పొందారు. ప్రాణవాయువు కొరతతో అల్లాడిన వారికి ఐ డ్రాప్స్ అందించారు. ఇప్పుడు ఆనందయ్య హైదరాబాద్, నెల్లూరులలో తన ఆయుర్వేద చికిత్సా కేంద్రాలను స్థాపించి, అన్ని వ్యాధులకు ఇంటి చిట్కాలతో వైద్యం అందిస్తున్నారు.

Krishnapatnam Anandaiah: కరోనా ఆనందయ్య గుర్తున్నారా..? ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలిస్తే..
Anandayya
Ch Murali
| Edited By: |

Updated on: Mar 03, 2026 | 12:25 PM

Share

2020 కోవిడ్ మహమ్మారితో ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. అప్పటి అరిస్థితులు తలుచుకుంటే అమ్మో . కరోనా సెకండ్ వేవ్ లో అయితే ఇక చెప్పనక్కర్లేదు.. ఎక్కడ చూసినా కరోనా మృతులు.. అంతిమ సంస్కారాలు కూడా చేయలేక మృతదేహాలను గుట్టలు గుట్టలుగా వేసి దహనాలు, ఖననాలు చేసిన పరిస్థితి. ఒకానొక దశలో కుటుంబ సభ్యులు కూడా అంతిమ సంస్కార కార్యక్రమంలో పాల్గొనడానికి సైతం భయపడ్డారు.. ఇక ఆస్పత్రుల్లో అయితే శ్వాస తీసుకోలేక లక్షలాదిమంది కరోనా బాధితులు నరకయాతన అనుభవించారు. ఆక్సిజన్ సిలెండర్లు తీవ్ర కొరత. ఆస్పత్రుల్లో బెడ్లు లేవు.. ఉన్నా ఆక్సిజెన్ అందక ఎంతో మంది చనిపోయారు. అలాంటి సందర్భంలో ఒక్క వ్యక్తి ముందుకు వచ్చారు. ఆయుర్వేద వైద్యంతో కోవిడ్ ని మటుమాయం చేస్తానని శపథం చేశారు. కోవిడ్ నివారణకు ఉచితంగా మందు పంపిణీ చేశారు. అందులో వివిధ రకాల మందులను పంపిణీ చేశారు. కోవిడ్ వచ్చిన వారికి తగ్గడం కోసం.. కోవిడ్ వచ్చి తీవ్రంగా బాధపడుతున్నవారికి, అసలు కరోనా పూర్తిగా రాకుండా ఉండేందుకు ఇలా మందులను స్వయంగా తయారు చేసి పంపిణీ ప్రారంభించారు. అతనే ఆనందయ్య.. ఇప్పుడ అతను ఎక్కడ ఉన్నారు..? ఏం చేస్తున్నారో తెలుసా..?

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం స్వస్థలమైన ఆనందయ్య అదే గ్రామంలో మందు పంపిణీ మొదలుపెట్టారు. ఈ విషయం పరిసర గ్రామాలకు పాకడంతో ఆనందయ్య మందు ద్వారా కరోనా రావడం లేదని, ఒకవేళ వచ్చినా వెంటనే నయమవుతుందని ప్రచారం మొదలైంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కరోనా మందు కోసం ప్రజలు క్యూ కట్టారు. మీడియా ద్వారా ఆనందయ్య ముందు కోసం వస్తున్న డిమాండ్ దేశం నలుమూలల పాకింది. దీంతో కరోనా మందుకోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా విజ్ఞప్తులు రావడంతో అందరికీ మందు సరఫరా చేయలేని పరిస్థితి ఎదురైంది. ప్రభుత్వం కూడా మందు పంపిణీకి అనుమతులు ఇచ్చింది.

అయితే, రాష్ట్రంలో ఆయా నియోజకవర్గాలకు మందు సరఫరా చేయాలని స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు ఆనందయ్య చుట్టూ క్యూ కట్టారు. పేరు మోసిన బడా పారిశ్రామికవేత్తలు సైతం ఆనందయ్య మందు కోసం కృష్ణపట్నం రావడంతో వస్తున్న మంత్రులు పారిశ్రామికవేత్తలను కలవడానికి సైతం ఆనందయ్యకు సమయం లేని పరిస్థితి ఏర్పడింది. కరోనా రాకుండా, వచ్చినవారికి నయం అయ్యేందుకు ఆనందయ్య ఇచ్చే మందు కంటే ఐసీయూలో ఉంటూ ఊపిరి తీసుకోలేని బాధితులకు ఆనందయ్య ఐ డ్రాప్స్ తయారు చేయడంతో వాటికోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో మంత్రులు తమ పలుకుబడితో ఆనందయ్య తో ప్రత్యేకంగా మందు తయారు చేయించి మరీ తమకు కావలసిన వారికి పంపిణీ చేశారు.

ఇవి కూడా చదవండి

కరోనా మందు పంపిణీకి ముందు ఆనందయ్య కృష్ణపట్నం మాజీ సర్పంచ్. అంతకుమించి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు. కానీ, మందు పంపిణీ తర్వాత విపరీతమైన గుర్తింపు రావడంతో ఎప్పుడూ లేనంత, ఎవరూ లేనంత బిజీ అయిపోయారు. కరోనా ఆనందయ్యగా మంచి గుర్తింపు పొందారు. అయితే ఆనందయ్య ఇప్పుడు మళ్ళీ బిజీ అయ్యారు.. హైదరాబాద్, నెల్లూరు లో ఆనందయ్య ఆయుర్వేద చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి, వైద్యం అందిస్తున్నారు.. అన్ని రకాల వ్యాధులకు చికిత్స చేస్తానని అంటున్నారు. వంటింట్లో ఉండే వస్తువులతోనే అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం ఉంటుందని అంటున్నారు ఆనందయ్య.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
తెల్లారి పొలానికి వెళ్లిన రైతుకు కనిపించిన పెద్ద గొయ్యి..
తెల్లారి పొలానికి వెళ్లిన రైతుకు కనిపించిన పెద్ద గొయ్యి..
మార్చి 3న చంద్రగ్రహణం.. హోలీ జరుపుకుంటున్నారా?
మార్చి 3న చంద్రగ్రహణం.. హోలీ జరుపుకుంటున్నారా?
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
తలలో పేలు ప్రాణం తీయగలవా?.. ఇలా చేస్తే మొత్తం పరార్
తలలో పేలు ప్రాణం తీయగలవా?.. ఇలా చేస్తే మొత్తం పరార్
ఈ పండు మగవాళ్ళు తింటే పిల్లలు పుట్టరా? బయటపడ్డ నమ్మలేని నిజాలు
ఈ పండు మగవాళ్ళు తింటే పిల్లలు పుట్టరా? బయటపడ్డ నమ్మలేని నిజాలు
దుబాయ్ పేలుళ్ల నుంచి తప్పించుకుని బెంగళూరు చేరుకున్న పీవీ సింధు
దుబాయ్ పేలుళ్ల నుంచి తప్పించుకుని బెంగళూరు చేరుకున్న పీవీ సింధు
కరోనా ఆనందయ్య గుర్తున్నారా..? ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలిస్తే..
కరోనా ఆనందయ్య గుర్తున్నారా..? ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలిస్తే..
చంద్రగ్రహణాన్ని కళ్లతో చూడొచ్చా..! ఏ టైమ్‌కు ఎలా చూస్తే..
చంద్రగ్రహణాన్ని కళ్లతో చూడొచ్చా..! ఏ టైమ్‌కు ఎలా చూస్తే..
లగ్జరీ స్పోర్ట్స్ కారులో సంపూర్ణేష్ బాబు చక్కర్లు..
లగ్జరీ స్పోర్ట్స్ కారులో సంపూర్ణేష్ బాబు చక్కర్లు..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త.. త్వరలోనే అకౌంట్లోకి డబ్బులు
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త.. త్వరలోనే అకౌంట్లోకి డబ్బులు