AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొగాకు రైతులకు సూపర్ గుడ్‌న్యూస్.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం..!

పొగాకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధరల స్థిరీకరణ, కొనుగోళ్లకు మద్దతు వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పొగాకు రైతులను ఆదుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.

పొగాకు రైతులకు సూపర్ గుడ్‌న్యూస్.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం..!
Cm Chandrababu On Tobacco Farmers
Balaraju Goud
|

Updated on: Jul 28, 2026 | 7:19 AM

Share

పొగాకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధరల స్థిరీకరణ, కొనుగోళ్లకు మద్దతు వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పొగాకు రైతులను ఆదుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ధరల లోటు భర్తీ పథకం కింద రైతులకు కిలో పొగాకుకు రూ.20 చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం కేంద్రం, రాష్ట్రం కలిసి మొత్తం రూ.188 కోట్లు భరించేందుకు అంగీకరించాయి.

రాష్ట్రంలో 94 మిలియన్ కేజీల పొగాకు కొనుగోళ్లకు పూర్తి మద్దతు లభించేలా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే బ్రైట్ రకం పొగాకు కిలో ధర రూ.240, మీడియం రకం రూ.190, లో గ్రేడ్ పొగాకు రూ.110 కంటే తగ్గకుండా కొనుగోళ్లు జరిగేలా సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు.

పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు అధికారులు తెలిపారు. రెండు రోజుల క్రితం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, డైరెక్టర్ ముఖ్యమంత్రిని కలిసి పరిస్థితిని సమీక్షించారు. సీఎం సూచనల మేరకు రాష్ట్రంలోని పొగాకు బయ్యర్లతో కేంద్ర ప్రతినిధులు సమావేశమై రైతులకు అనుకూలంగా కొనుగోళ్లపై చర్చలు జరిపారు. అనంతరం వివిధ ప్రతిపాదనలను పరిశీలించి తుది నిర్ణయానికి వచ్చారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు, టొబాకో బోర్డు ప్రతినిధులు పాల్గొన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?