క్యూట్ నెస్‌తో  మత్తెక్కిస్తున్న ముద్దుగుమ్మ బాంధవి శ్రీధర్

28 July  2026

Pic credit - Instagram

Rajeev 

అందాల భామ బాంధవి శ్రీధర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఈ చిన్నది 2022లో విడుదలైన "మసూద" అనే సినిమాలో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రంలో ఆమె దెయ్యం పట్టిన అమ్మాయి పాత్రలో నటించి మెప్పించింది. 

మసూద తన నటనా ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. దాంతో ఈ చిన్నదానికి మంచి గుర్తింపు వచ్చింది. ఆతర్వాత కొన్ని సినిమాల్లో నటించింది.

"మిస్టర్ పర్‌ఫెక్ట్", "రభస", "మొగుడు", "రామయ్య వస్తావయ్య", "మజ్ను" వంటి తెలుగు సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించి ఆకట్టుకుంది.

అంతే కాదు 2019లో "మిస్ ఇండియా రన్నరప్"గా నిలిచింది, "మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్ 2019" అలాగే "మిస్ ఇండియా మిస్ ఆంధ్రప్రదేశ్ 2019" టైటిల్స్‌ను గెలుచుకుంది.

ఇటీవలే రామ్ చరణ్ పెద్ది సినిమాలో నటించింది  బాంధవి శ్రీధర్. కానీ ఆమె సీన్స్ థియేటర్స్ లో కట్ చేశారు. ఓటీటీలో యాడ్ చేశారు/.

తెలుగు చిత్ర పరిశ్రమలో మరిన్ని మంచి అవకాశాల కోసం చూస్తోంది ఈ అమ్మడు. అలాగే సోషల్ మీడియాలో ఈ చిన్నది షేర్ చేసే ఫోటోలు అభిమానులను కవ్విస్తున్నాయి.