AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jupiter Blessings: దేవగురువు కటాక్షం.. వారి ఆర్థిక సమస్యలు పరిష్కారానికి బెస్ట్ టైమ్..!

అక్టోబర్ 31 వరకు గురుడు ఉచ్ఛ స్థితిలో ఉండటం వల్ల అనేక శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఆదాయం పెంచుకోవడం, వివాదాల పరిష్కారం, ఆరోగ్య మెరుగుదల వంటి పనులకు ఇది అనుకూల సమయం. అయితే వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం, కుంభ రాశుల వారు ఈ కాలంలో ఆర్థిక వ్యవహారాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.

Jupiter Blessings: దేవగురువు కటాక్షం.. వారి ఆర్థిక సమస్యలు పరిష్కారానికి బెస్ట్ టైమ్..!
Jupiter Blessings
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 28, 2026 | 1:51 PM

Share

దేవతలకు గురువైన బృహస్పతి గ్రహం ఉచ్ఛ స్థితిలో ఉన్నా, స్వక్షేత్రంలో ఉన్నా అది అనేక శుభ పరిణామాలకు దారితీస్తుందని, అనేక సమస్యలు, వివాదాల నుంచి బయటపడేస్తుంది. గురువు ఉచ్ఛ, స్వక్షేత్రాల్లో ఉన్న సమయాన్ని ఎంత వీలైతే అంత సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఆదాయాన్ని పెంచుకోవడం, ప్రయత్నాలు ముమ్మరం చేయడం, వివాదాలను పరిష్కరించుకోవడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం, శుభకార్యాలు నిర్వహించడం వంటివి చేపట్టాలి. అక్టోబర్ 31 వరకు గురువు ఉచ్ఛ స్థితిలో ఉంటున్నందువల్ల వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం, కుంభ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

వృషభం

తృతీయ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల ఈ రాశివారు ఆదాయ వృద్ధికి చురుకుగా ప్రయత్నాలు సాగించడం మంచిది. వీరి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఇతరులతో ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం, ధనపరంగా వాగ్దానాలు చేయకపోవడం, హామీలు ఉండకపోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించడం మంచిది. కొద్ది ప్రయత్నంతో రావలసిన డబ్బుపూర్తిగా అందుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

సింహం

ఈ రాశికి వ్యయ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో సంచారం వల్ల ఈ రాశివారు అనవసర సహా యాలను, వృథా ఖర్చులను ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. శుభకార్యాలు, పుణ్య కార్యాలు, సొంత ఇల్లు, వాహనం వంటి వాటి మీద ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆదాయాన్ని వృద్ధి చేసు కోవడం మీద దృష్టి పెట్టాలి. ఆదాయాన్ని మదుపు లేదా పొదుపు చేసుకోవడం మీద శ్రద్ద పెట్టడం అవసరం. లాభదాయక వ్యవహారాల మీద పెట్టుబడులు పెట్టడం వల్ల లాభం కలుగుతుంది.

తుల

ఈ రాశికి దశమ స్థానంలో గురువు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాలరీత్యా ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయ వద్దు. ఇతరులకు డబ్బు ఇవ్వడం గానీ, ఇతరుల నుంచి డబ్బు తీసుకోవడం గానీ పెట్టుకోవద్దు.. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పురోగతి మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండాలి.

ధనుస్సు

రాశినాథుడు గురువు అష్టమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్నందువల్ల ఆదాయం పెరగడానికి, ఆకస్మిక ధన లాభం కలగడానికి, రావలసిన డబ్బు పూర్తిగా చేతికి అందడానికి, ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడానికి, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందడానికి బాగా అవకాశం ఉంది. అయితే, ఖర్చులు తగ్గించుకోవడం, ఆర్థిక, ఆస్తి వ్యవహారాలను సరిగ్గా నిర్వహించుకోవడం, ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండకపోవడం, ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం చాలా మంచిది.

మకరం

ఈ రాశికి సప్తమ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితి వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంది కానీ, అంతకు మించి ఉచిత సహాయాలు, దానధర్మాలు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. వీరు ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నష్టదాయక వ్యవహారాలకు స్వస్తి చెప్పి లాభదాయక వ్యవహారాల మీద దృష్టి కేంద్రీకరించడం శ్రేయస్కరం. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా బాగా నష్టపోవడంతోపాటు, ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో మోసపోయే అవకాశం కూడా ఉంది.

కుంభం

ఈ రాశికి షష్ట స్థానంలో ఉచ్ఛ గురువు సంచారం వల్ల ఈ రాశివారు తమ అదనపు ఆదాయాన్ని ఆర్థిక సమస్యల పరిష్కారం మీద ఖర్చు చేయడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఆర్థిక విషయాలను ఎవరితోనూ పంచుకోకపోవడం ఉత్తమం. ఆర్థిక లాభాలను మదుపు చేయడం, పొదుపు చేయడం చాలా అవసరం. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటి ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు.

Follow Us