AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. డీఎంకేలోకి పన్నీర్ సెల్వం..

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పన్నీర్ సెల్వం డీఎంకే పార్టీలో చేరారు. సీఎం స్టాలిన్ సమక్షంలో చేరారు. ఆయన కుమారుడు కూడా డీఎంకేలో చేరారు. తమిళనాడు రాజకీయాల్లో ఇది పెద్ద సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. డీఎంకేలోకి పన్నీర్ సెల్వం..
Dmk
Ch Murali
| Edited By: |

Updated on: Feb 27, 2026 | 8:47 PM

Share

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది నిజం.. అయితే అక్కడ మాత్రం రాజకీయాలు అలా ఉండవు.. ఆ రెండు పార్టీలు బద్ద శత్రువులు అన్నది నిజం.. గతంలో ఆ పార్టీ నుంచి మరో పార్టీకి వలసలు అరుదు.. అలాంటిది బద్ద శత్రువు పార్టీలోకి మాజీ ముఖ్యమంత్రి వెళ్లడం అక్కడి రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.. అదేంటో ఎక్కడో చూద్దాం..

తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన చేరిక అది. తమిళనాడులో దివంగత జయలలిత, కరుణానిధి బ్రతికి ఉన్నన్నాళ్లు బద్ద రాజకీయ శత్రువుల్లానే రాజకీయాలు చేశారు.. అంతటి శత్రుత్వం ఉన్న ప్రత్యర్థులను ఎక్కడా చూడలేదని చెప్పొచ్చు.. డీఎంకే అధికారంలో ఉన్నపుడు జయలలితను కరుణానిధి ముప్పతిప్పలు పెట్టారు.. జయలలితను అక్రమాస్తుల కేసులో సీఎంగా ఉన్నపుడే జైలుకి వెళ్లాల్సి వచ్చింది.. అప్పుడు తాత్కాలిక సీఎంగా నమ్మిన బంటుగా పేరున్న ఓ పన్నీర్ సెల్వంను జయలలిత సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది.. అప్పట్లో జయలలిత అంటే పన్నీర్ సెల్వంకు ఎంత భక్తి ఉండేది. జయలలిత జైలులో ఉన్నన్నాళ్లు సీఎం కుర్చీలో కూడా కూర్చోలేదు పన్నీర్ సెల్వం. సీఎం కుర్చీలో జయలలిత ఫోటోను ఉంచి పాలన సాగించారు. అంతటి భక్తుడు ఇపుడు చేసిన పనిని చూసి అంతా ఇలా చేశారేంటి అని చర్చించుకుంటున్నారు.

ఇవాళ డీఎంకే లో చేరిన మాజీ సీఎం పన్నీర్ సెల్వం అందరికీ షాక్ ఇచ్చారు. డీఎంకే కార్యాలయంలో సీఎం స్టాలిన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఓపీఎస్, కుమారుడు మాజీ ఎంపి రవీంద్ర నాథ్, పన్నీర్ వర్గం కూడా పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఇటీవల డీఎంకేకి అనుకూలంగా మాట్లాడిన పన్నీర్ సెల్వం.. స్టాలిన్ పాలనపై ప్రశంసలు కురిపించారు..అయితే పార్టీలో చేరుతారని మాత్రం ఎవరూ ఊహించలేదు. తన కుమారుడు, తన వర్గం నేతలకు ప్రాధాన్యత కల్పించాలని పన్నీర్ సెల్వం కోరినట్టు తెలుస్తోంది.

అన్నాడీఎంకే నుంచి బహిష్కరణ

జయ మరణం తర్వాత సీఎం అయిన ఈపీఎస్ నాయకత్వాన్ని పన్నీర్ సెల్వం విభేదించారు. ప్రత్యేక వర్గాన్ని తయారు చేసిన పన్నీర్.. పార్టీలో ఇమడలేక పోయారు. కొడుకు రవీంద్ర నాథ్ భవిష్యత్ కోసం డీఎంకే పార్టీలో చేరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో తేని నుంచి ఎంపీగా గెలుపొందన పన్నీర్ కొడుకు రవీంద్ర. కొడుకు రవీంద్ర, తనకు, తన వర్గం లో కొందరికి ప్రాధాన్యత ఇవ్వాలని పన్నీర్ సెల్వం స్టాలిన్ ను కోరారు. అమ్మ జయలలిత నమ్మిన బంటుగా పేరున్న పన్నీర్… డీఎంకే లోకి వెళ్లడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్నాడీఎంకేని దెబ్బ కొట్టడం.. తన కొడుకు రాజకీయ భవిష్యత్తు.. ఒకే దెబ్బకు రెండు షాట్స్ గా ఓపీఎస్ వ్యూహంగా అర్ధం చేసుకోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Follow Us