AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

'పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ 6' కోసం జానీ డెప్‌తో చర్చలు

‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ 6’ కోసం జానీ డెప్‌తో చర్చలు

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Aug 22, 2026 | 8:01 PM

Share

‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ అభిమానులకు గుడ్ న్యూస్. కెప్టన్ జాక్ స్పారో పాత్రలో జానీ డెప్ తిరిగి కనిపించే అవకాశాలు పెరిగాయి. ‘పైరేట్స్ 6’ కోసం జానీ డెప్‌తో చర్చలు జరుగుతున్నాయని నిర్మాత జెర్రీ బ్రక్‌హైమర్ వెల్లడించినట్లు సమాచారం. మార్గోట్ రాబీ ప్రధాన పాత్రలో కనిపించే అవకాశాలున్నప్పటికీ, జాక్ స్పారోను కూడా కథలో కొనసాగించేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారిక క్లారిటీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

హాలీవుడ్ తెరపై ఎన్నో పాత్రలు వస్తాయి, కానీ కొన్ని పాత్రలు మాత్రం కాలంతో సంబంధం లేకుండా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి ఐకానిక్ క్యారెక్టర్లలో ‘కెప్టన్ జాక్ స్పారో’ ఒకటి. ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ ఫ్రాంచైజీలో జానీ డెప్ పోషించిన ఈ పాత్ర ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యింది. అందుకే మళ్లీ జాక్‌ని ఎప్పుడు తెర మీద చూస్తామా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. కానీ ఈ విషయంలో మేకర్స్ బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారన్న న్యూస్ వైరల్ అవుతోంది. హాలీవుడ్ ప్రొడ్యూసర్ జెర్రీ బ్రక్‌హైమర్ లేటెస్ట్‌గా ఇచ్చిన క్లూ హాలీవుడ్ వర్గాల్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ 6’ కోసం తాము జానీ డెప్‌తో చర్చలు జరుపుతున్నామని, స్క్రిప్ట్ వర్క్ నడుస్తోందని కన్ఫర్మ్ చేశారు మేకర్స్‌. ఐదు భాగాల్లో దాదాపు 4.5 బిలియన్ డాలర్ల వసూళ్లను సాధించిన ఈ ఫ్రాంచైజీకి, జాక్ స్పారో పాత్రే కీలకం. అతడు లేని పైరేట్స్ మూవీని ఊహించుకోవడం ఫ్యాన్స్‌కు కష్టమే. ఈ పాత్ర వెనుక ఉన్న క్రేజ్ కేవలం నటన మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. జానీ డెప్ ఆ పాత్రను పండించిన విధానం, ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ.. ఇవన్నీ ఒక కొత్త ట్రెండ్‌ను సెట్ చేశాయి. అయితే, గత కొంతకాలంగా పర్సనల్ లైఫ్ ఇష్యూస్ వల్ల డిస్నీ ఆయనకు దూరమైందనే వార్తలు వినిపించాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఆడియన్స్ డిమాండ్ ముందు స్టూడియోలు కూడా తగ్గక తప్పడం లేదు. ‘పైరేట్స్ 6’లో మార్గోట్ రాబీ లీడ్ రోల్ ప్లే చేసే ఛాన్స్ ఉన్నా, జాక్ స్పారో పాత్రను కూడా ఈ మూవీలో కంటిన్యూ చేసే ప్లాన్‌లో ఉంది మూవీ టీమ్. అయితే జానీ డెప్‌ను హీరోగా కాకుండా సపోర్టింగ్ రోల్‌లో ఎంత వరకు యాక్సెప్ట్ చేస్తారు? అసలు సపోర్టింగ్ రోల్‌కు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? అన్న ప్రశ్నలకు సమాధానం రావాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాన్,ఆధార్ వాట్సాప్‌లో పంపుతున్నారా? క్షణాల్లో రంగంలోకి సైబర్ నేరగాళ్లు.. రెప్పపాటులో బ్యాంకు ఖాతాలు గుల్ల

బయటకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. కొన్ని విటమిన్‌ లోపాలు ఉండొచ్చు.. ఎలా చెక్‌ చేసుకోవాలి?

వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు మేలుకోకుంటే మరణ మృదంగమే !

కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి!

అంతరిక్షంలో అగ్రికల్చర్.. తాజా ఆకుకూరలు పండించిన నాసా వ్యోమగామి

Follow Us