AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మ్యాట్ టెక్నాలజీ డిస్‌ప్లేతో పిచ్చెక్కించే మానిటర్..! బెన్‌ క్యూ ఆర్డీ 270 ధర, ఫీచర్లు ఇవే

BenQ rD27Q.. భారతదేశంలోని సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, ప్రోగ్రామర్లను దృష్టిలో ఉంచుకుని బెన్ క్యూ సంస్థ ఒక కొత్త మానిటర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. తమ ఆర్డీ సిరీస్‌లో భాగంగా వస్తున్న ఈ డివైజ్ రాత్రింబవళ్లు కోడింగ్ చేసేవారి కంటి శ్రమను తగ్గించడానికి ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. టెక్ నిపుణులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ సరికొత్త ఆటోమొబైల్ గ్యాడ్జెట్ తెలుసుకుందాం.

మ్యాట్ టెక్నాలజీ డిస్‌ప్లేతో పిచ్చెక్కించే మానిటర్..! బెన్‌ క్యూ ఆర్డీ 270 ధర, ఫీచర్లు ఇవే
Benq Launches Rd270q Coding Monitor
Nikhil
|

Updated on: Aug 05, 2026 | 6:30 AM

Share

సుదీర్ఘ సమయం స్క్రీన్ ముందే గడిపే సాఫ్ట్‌వేర్ నిపుణుల కోసం అద్భుతమైన ఫీచర్లతో కూడిన సరికొత్త మానిటర్ అందుబాటులోకి వచ్చింది. ప్రసిద్ధ బ్రాండ్ బెన్ క్యూ విడుదల చేసిన ఈ ట్రెండింగ్ డివైజ్ పని సామర్థ్యాన్ని పెంచేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తున్న ఈ కొత్త మానిటర్ విశేషాలను తెలుసుకుందాం!

నానో మ్యాట్ టెక్నాలజీ

భారత్‌లోని సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, ప్రోగ్రామర్లను దృష్టిలో ఉంచుకుని బెన్ క్యూ సంస్థ ఒక కొత్త మానిటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. తమ ఆర్‌డి సిరీస్‌లో భాగంగా బెన్ క్యూ ఆర్డీ270క్యూ మోడల్‌ను లాంచ్ చేసింది. రాత్రింబవళ్లు కోడింగ్ చేసే డెవలపర్ల కంటి శ్రమను తగ్గించి, పని సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా ఈ డివైజ్‌లో ప్రత్యేక ఫీచర్లను అందించారు.

ఈ బెన్ క్యూ ఆర్డీ270క్యూ మానిటర్ 27 అంగుళాల రెండు కే ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తుంది. సుదీర్ఘ సమయం స్క్రీన్ వైపే చూసేవారికి లైటింగ్ ప్రతిబింబించకుండా ప్రత్యేకమైన నానో మ్యాట్ టెక్నాలజీని వాడారు. దీంతో కాంతి నుంచి ఉపశమనం లభించి, అక్షరాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే 144Hz రీఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా సాగుతుంది.

కోడర్ల కోసం దీనిలో ప్రత్యేకమైన డెవలపర్ మోడ్స్ ఉన్నాయి. లైట్, డార్క్ మోడ్స్‌తో పాటు పేపర్ కలర్ మోడ్ కూడా అందించారు. ఇది ఈ-పేపర్ అనుభూతిని ఇస్తూ కళ్లకు హాయినిస్తుంది. గదిలోని వెలుతురును బట్టి స్క్రీన్ బ్రైట్‌నెస్, కలర్స్ ఆటోమేటిక్‌గా మారేలా విజువల్ ఆప్టిమైజర్ పనిచేస్తుంది. రాత్రి వేళల్లో వర్క్ చేసేవారికి నైట్ అవర్స్ ప్రొటెక్షన్ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది.

కనెక్టివిటీ ఆప్షన్స్

బెన్ క్యూ ఆర్డీ270క్యూ మానిటర్ కేవలం వర్క్ కోసమే కాదు వాడకంలోనూ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. టైప్-సి పోర్ట్ ద్వారా 65W ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. అంటే ఒకే కేబుల్‌తో ల్యాప్‌టాప్‌ను కనెక్ట్ చేస్తూనే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక మన వెన్ను, మెడ నొప్పులు రాకుండా ఉండటానికి మానిటర్ ఎత్తును, యాంగిల్‌ను నచ్చినట్లు మార్చుకోవచ్చు. కావలసినప్పుడు 90 డిగ్రీలు తిప్పి నిలువుగా పోర్ట్రెయిట్ రూపంలో కూడా ఉపయోగించుకోవచ్చు.

విండోస్, మాక్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లతో సులువుగా పనిచేసే ఈ బెన్ క్యూ ఆర్డీ270క్యూ మానిటర్ ప్రారంభ ధర రూ. 29,989గా ఉంది. ప్రస్తుతం ప్రధాన ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో ఇది కొనుగోలుకు అందుబాటులో ఉంది. మంచి పెర్ఫార్మెన్స్, కంటికి రక్షణ కోరుకునే ప్రోగ్రామర్లకు బెన్ క్యూ ఆర్డీ270క్యూ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఆఫీస్ పనితో పాటు డిజైనింగ్ పనులకు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

Follow Us
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!