అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ!
అమరావతి సమీపంలోని మంగళగిరి మండలం నవులూరులో 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహ నిర్మాణం తుది దశకు చేరుకుంది. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల సరిహద్దులో రూపుదిద్దుకుంటున్న ఈ విగ్రహం, దాని చుట్టూ ఆలయ నిర్మాణం పూర్తయితే అమరావతి ఆధ్యాత్మిక పర్యాటకానికి కొత్త ఊపునివ్వనుంది. ఇది భక్తులకు సరికొత్త ఆకర్షణగా మారనుంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర ప్రాంతం ఆధ్యాత్మిక శోభతో వెలసిల్లుతోంది. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు గ్రామంలో 123 అడుగుల ఎత్తులో అత్యంత భారీ కార్తికేయ విగ్రహ నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఈ భారీ విగ్రహం ఇప్పటికే చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.ప్రసిద్ధ మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి 11 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. మంగళగిరి నుంచి నవులూరు మీదుగా రాజధానిలోకి వెళ్లే మార్గంలో పది సెంట్ల స్థలంలో స్థానికులు, దాతల సహాయంతో ఈ నిర్మాణం చేపట్టారు. గుంటూరుకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారి అందించిన ఆర్థిక సహాయంతో పనులు నిరంతరాయంగా సాగుతున్నాయి. కేవలం విగ్రహానికి పరిమితం కాకుండా, విగ్రహం చుట్టూ నాలుగు అంతస్తుల ప్రాకారాన్ని నిర్మించారు. విగ్రహం ముందు భాగంలో ఒక సుందరమైన ఆలయ నిర్మాణం కూడా పురోగతిలో ఉంది. త్వరలోనే ఈ విగ్రహంతో పాటు ఆలయాన్ని పూర్తిచేసి, భక్తుల దర్శనార్థం అందుబాటులోకి తెస్తామని నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్తికేయ విగ్రహానికి అత్యంత సమీపం నుంచే రాజధానిని జాతీయ రహదారితో అనుసంధానించే ఈ-13 ప్రధాన రోడ్డు మార్గం వెళుతోంది.
మరిన్ని వీడియోల కోసం :
మళ్లీ మొదటికొచ్చిన డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం
ఇడుపుకాయితం టైటిల్‌పై వచ్చిన విమర్శలు విని బాధ కలిగింది
తెల్లవారేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!
ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి
అర్థరాత్రి రోడ్డు దాటుతూ కనిపించిన వింత జీవి!
62 ఏళ్ల వయసులోనూ వర్కవుట్స్.. నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే!
కదులుతున్న రైల్లోకి పార్శిల్ డెలివరీ.. వాటే టైమింగ్ బాస్!
అయ్యో.. ఈ భర్త కష్టం ఎవరికీ రాకూడదు!
హిట్టు కొడితే.. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ చేతిలో పడ్డట్టే..
బిగ్ బాస్ 10 - కామనర్స్ Vs సెలబ్రిటీస్ మధ్యలో మంట పెట్టిన మానస్
మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు..అసలేం జరిగిందంటే?
మీర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్ల కలెక్షన్స్ దిశగా అడుగులు

